Yadadri templeYadadri temple

ఆరేళ్ళ తరువాత స్వయంభువు దర్శనం

కెసిఆర్ దంపతులచే తొలిపూజలు

చినజీయర్‌ పెట్టిన ముహుర్తానికే మహా సంప్రోక్షణ

యాదాద్రి ఆలయ (Yadadri Temple) ఉద్ఘాటన తెలంగాణ సీఎం (Telangana CM) కెసిఆర్ (KCR) చేతుల మీదుగా నేడే జరగనుంది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి (Lakshmi Narasimha Swamy) స్వయంభు దర్శనాలు నేటి నుండి మొదలు కానున్నాయి. సోమవారం ఉదయం యాదాద్రి ప్రధానాలయ ఉద్ఘాటన పూజలు, గర్భాలయంలో నృసింహుల మూలవిరాట్‌ దర్శనాలు బ్రహ్మాండంగా ప్రారంభం కానున్నాయి. సుమారు 6 సంవత్సరాల అనంతరం స్వయంభు స్వామి వారు గర్భాలయంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

కాకతీయ స్తంభాలు, అష్టభుజి ప్రాకార మండపాలు, సింహయాళీ, పురాణ ఇతిహాసాలను రాతి శిలలపై పదిల పరుస్తూ ఎన్నో విశేషాలతో కొండపై అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రభుత్వం చేపట్టింది. వీటితోపాటు పాంచనరసింహుల పునర్నిర్మాణం, విస్తరణ కూడా పూర్తవడంతో ప్రధానాలయ ఉద్ఘాటన క్రతువుకు ఇటీవల శ్రీకారం చుట్టారు.

యాదాద్రి క్షేత్రం మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు అందుబాటులో ఉన్న మంత్రులు అందరూ హాజరు కానున్నారు. కాగా,యాదాద్రి ఉద్ఘాటనలో ఆధ్యాత్మిక గురువు చినజీయర్‌ అత్యంత కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆయన సూచించిన ఆగమ, వైదిక శాస్త్ర నియమాల పర్యవేక్షణలో రూపుదిద్దుకున్నది అనేది తెలిసిందే. అటువంటి చిన జీయర్ స్వామి హాజరు కాలేక పోవడం చర్చనీయాంశం అయ్యింది.

గట్టి నిఘా మధ్య సంప్రోక్షణ!

సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతున్నందున పోలీసు శాఖ పటిష్టమైన నిఘా చర్యలు తీసుకుంటోంది. 3 వేలమందితో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది. కొండపైన ప్రత్యేకంగా ఒక కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశారు. దర్శనానికి వచ్చే భక్తులు టికెట్‌ కౌంటర్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. ఇప్పటికే నమోదు చేసుకున్నవారికి జియో ట్యాగింగ్‌తో కూడిన క్యూఆర్‌ కోడ్‌ కేటాయించారు.

సతీ సమేతంగా సీఎం కేసీఆర్‌

తెలంగాణ సీఎం కెసిఆర్స తీ సమేతంగా యాదాద్రికి రానున్నారు. పెద్దగుట్టపైకి చేరుకొని ఆలయ అభివృద్ధిని పరిశీలిస్తారు. అనంతరం 11.55 గంటలకు మహాకుంభ సంప్రోక్షణ వైదిక పూజల్లో పాల్గొంటారు.

నేతాజీ అస్థికలను భారత్‌కు తేవాలి: జనసేనాని