Satya NadellaSatya Nadella

మైక్రోసాఫ్ట్‌ (Microsoft) చైర్మన్’గా సత్య నాదెళ్ల (Satya Nadella) నియమితులయ్యారు. దీనికి సంబంధించి మైక్రోసాఫ్ట్ బోర్డులో కీలక మార్పులు చోటుచేసికొన్నాయి. ప్రస్తుత సీఈవో (CEO) సత్య నాదెళ్లకు మరిన్ని అదనపు అధికారాలు కట్టబెట్టారు. ఆయనను బోర్డు ఛైర్మన్‌గా ఎన్నుకోవడం జరిగింది. ఈ మేరకు ఏకగ్రీవంగా బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ సత్య నాదెళ్ల పేరుకు ఆమోదం తెలిపారు.

దీంతో బోర్డు అజెండాను నిర్ణయించే అధికారం సత్య నాదెళ్లకు రానున్నది. వ్యూహాత్మక అవకాశాలను దక్కించుకొనేందుకు, కీలక ఇబ్బందులను గుర్తించేందుకు ఆయనకు ఉన్న వ్యాపారంపై అవగాహన మైక్రోసాఫ్ట్’కి బాగా ఉపయోగపడుతుంది’’ అని మైక్రోసాఫ్ట్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత మైక్రోసాఫ్ట్ ఛైర్మన్‌గా ఉన్న జాన్‌ థామ్సన్‌ను స్వతంత్ర డైరెక్టర్‌గా కూడా నియమించింది.

స్టీవ్‌ బామర్‌ నుంచి సత్య నాదెళ్ల సీఈవో బాధ్యతలను 2014లో స్వీకరించారు. ఆయన వచ్చాక మైక్రోసాఫ్ట్‌’ని పురోభివృద్ధి వైపు తీసికెళ్ళారు. కొత్తతరం టెక్నాలజీ వైపు కంపెనీని నడిపించారు. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ రంగంపై కూడా కంపెనీ విస్తృతంగా పనిచేసేటట్లు చేసారు.