dasari garudasari garu

దర్శక రత్న, నిర్మాత, కధా రచయత, మాటల రచయిత, పాటల రచయిత, నటుడు, నిర్మాత, జర్నలిస్ట్, పత్రికాధిపతి, మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్ర సహాయ మంత్రి స్వర్గీయ శ్రీడాక్టర్ దాసరి నారాయణ రావు గారి (Dasari Narayana Rao జన్మదినం (Birthday) సందర్భంగా ప్రత్యేక కధనం.

సాధారణంగా సినీ రంగంలోగాని, రాజకీయ రంగంలోగాని లేదా మరే ఇతర ప్రముఖ వ్యక్తిని కలవాలన్నా రికమండేషన్, అప్పోయింట్మెంట్ వైగారా లాంటి ప్రాసెస్ కొండవీటి చాంతాడులా ఉంటుంది. కానీ గురువు గారు దాసరి గారిని కలవడానికి ఎటువంటి అప్పోయింట్మెంట్ లాంటివి సామాన్యులకు అవసరం ఉండేది కాదు. సామాన్యులకు, అభాగ్యులకు, అన్నార్తులకు దాసరి (Dasari) గారి ద్వారములు ఎప్పుడు తెరిచియే ఉండెడివి.

దాసరి గారి ఇంటికి వెళితే టిఫిన్ గాని, భోజనం గాని ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. అక్కడ ఎవ్వరికి అడ్డు చెప్పరు అని చాలామంది దాసరి గారి ఇంటికి వెళ్లి తినేవారు. వారి ఆఫీస్ స్టాఫ్ కూడా అటువంటి వారికి అడ్డు చెప్పేవారు కాదు. ఎవరైనా అడ్డు చెప్పిన దాసరి గారు ఒప్పుకొనే వారు కాదు. భోజనాలు కోసం డబ్బు లేకపోతే అప్పు చేసి మరే తెచ్చి ఇస్తుండే వారు.

తాను ఎన్ని రకాలు తింటే అక్కడ ఉండే వారికి కూడా అన్ని రకాలు సమానంగా పెట్టమని గురువు గారు చెబుతూ ఉండేవారు. దాసరి గారి చివరి రోజుల వరకు కూడా తనతో పాటు కనీసం ఒక పది మందితో కలిసి భోజనం చేస్తుండే వారు. ఆయన ఎప్పుడు ఒక్కరే తినేవారు కాదు.

దాసరి గారి సతీమణి (Dasari Padma) గాని, వారి బిడ్డలు గాని వారి ఇంటిలో జరిగే నిత్య అన్న దాన కార్యక్రమానికి ఎప్పుడు అడ్డు చెప్పేవారు కాదు. దాసరి గారి దగ్గర డబ్బులు లేని రోజుల్లో కూడా అప్పు చేసి అయన ఇస్తుండేవారు. మన ఇంటికి వచ్చినవారికి ఎప్పుడు ఏమి పెట్టకుండా పంప వద్దు అని ఆయన నిరంతరం చెబుతూ ఉండేవారు.

ఎవరికీ ఏమి కష్టం వచినా గురువు (Guruvu) గారికి చెప్పుకొనే వారు

ఎవరికీ ఏమి కష్టం వచినా గురువు గారికి వెళ్లి చెప్పుకొంటూ ఉండేవారు. గురువుగారు వెంటనే తన సూట్ కేసు నుండి డబ్బులు తీసి అటువంటి వారికి ఇస్తుండేవారు. గురువు గారు మాకు డబ్బులు వద్దు అని అంటే ఉంచవయ్యా అని వారిని వారించి పంపిస్తుండేవారు. మొహమాటంతో ఎవరైనా చెప్పుకోలేక పోయినా గాని, ఆయనే స్వయంగా తెలిసికొని అటువంటి వారి అవసరాల కోసం డబ్బులు వారి ఇంటికి పంపిస్తూ ఉండేవారు.

సినీ, రాజకీయ, పత్రికా లేదా సామాన్య ప్రజానీకం ఎవ్వరికైనా ఏ కష్టం వచ్చిన దాసరి గారి ఇంటికి వెళితే సరిపోతుంది అనే భరోసా అందరికి ఉండేది. దాసరి గారు కూడా ఆవిధంగానే స్పందిస్తూ ఉండేవారు.

దాసరి గారు భోళాశంకరుడు (Bhola shankarudu). దాసరి గారి సంపాదనలో ఎక్కువ భాగం మీడియా (Dasari Media) వల్ల వచ్చిన నష్టాలకి, తన దగ్గరికి వచ్చిన వారికి కస్టాలు తీర్చడానికి వెచ్చించారు అని చెప్పడం తప్పు కాదేమో. దాసరి గారి దగ్గర లక్షలకి లక్షలు తీసికొని తమ అవసరాలు తీర్చుకొన్న వారు కూడా ఉన్నారు అని ఇక్కడ చెప్పడం భావ్యం కాదేమో?

దాసరి గారి జాతకమో లేక పూర్వ జన్మ ఫలమో తెలీదు గాని. దాసరి పుట్టినది మే 04, అలానే ఆయన చని పోయినది కూడా మే 30. ఆయన చివరి పుట్టిన రోజున ఉదయం 7 గంటల నుండి ప్రారంభం అయిన భోజన, ఫలహారాలు రాత్రి 11 గంటల వరకు జరిగింది అని ఉటంకించడం తప్పు కాదు అనుకొంటా.

ఆయన జీవితం చివరి వరకు మహారాజు వలే సాగిపోయింది. అనుబంధాలు, ఆప్యాయతలు అంతా భూటకం అంటూ తన చుట్టూ ఉన్న పంచ భూతాలకు లొంగి (తనని వశపరచుకొన్న ఆ పంచ భూతాల పేర్లు అడగవద్దు), మేఘాలలో కలిసిపోయారు.

“నేను విష సర్పాల మధ్య సేదతీరుతున్నాను. నేను ఆ సర్పాలను ఆడిస్తున్నంత సేపు ఆ సర్పాలు నన్ను ఏమి చేయలేవు. నేను ఏ రోజునైతే వాటిని ఆడించలేని స్థితిలో ఉంటానో ఆరోజున అవి నన్ను కాటేస్తాయి.”– ఇది దాసరి “పిచ్చోడి చేతిలో రాయి” సినీమాలోని ఒక డైలాగ్. ఈ డైలాగ్’ని’ని నేను గురువు గారి అవసాన దశకి కొద్దీ రోజులు ముందు గురువు గారికి గుర్తు చేసాను. ఇది విని గురువు గారు నవ్వుకొన్నారు గాని తిరిగి సమాధానం చెప్పలేక పోయారు. అర్ధం అయ్యింది గాని తెలియనట్లు మౌనం వహించాను.

గురువు (Guruvu) గారి చేసిన ఆ పుణ్య భలం ఆయన బిడ్డలను మరియు అయన శిష్య మరమాణువులందరినీ ఎల్లవేళలా కాపాడాలని ఆ భగవంతుడిని, గురువు గారి ఆత్మను సదా ప్రార్ధిస్తూ….

మా “బహుదూరపు బాటసారి’కి నమఃసుమాంజలితో

మీ

Akshara Satyam

Lock down related issues:

Spread the love