పాలకొండ నియోజకవర్గ (Palakonda Constituency) సమస్యల పరిస్కారం దిశగా గర్భన సత్తిబాబు (Garbana Sathibabu) జనసేన పార్టీ (Janasena Party) తరుపున కృషి చేస్తున్నారు. పాలకొండ నియోజకవర్గం లుంబూరు గ్రామం బీసీ కాలనీ లో ఇళ్లపై విద్యుత్ ప్రవాహం అయ్యే విద్యుత్ లైన్లు ఉండడం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలానే స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ఈ సమస్య పరిష్కారం కొరకు పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు (Janasena Leader) గర్భన సత్తిబాబు దృష్టికి స్థానికులు తీసికొచ్చారు.
తక్షణమే పాలకొండ జనసేన నాయకుడు సత్తిబాబు స్పందించి ఆ గ్రామానికి వెళ్లి అక్కడ సమస్యలు తెలిసికొన్నాడు. ఈ విద్యుత్తు వైర్ల సమస్య పరిస్కారం కొరకు పాలకొండ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ డి.ఈ.ఈ. మోహన్ చంద్రశేఖర్’ని సంప్రదించారు. లుంబూరు సమస్యలపై డి.ఈ.ఈ కి వినతి పత్రం కూడా అందచేయడం జరిగింది.
డి.ఈ.ఈ సానుకూలంగా స్పందిస్తూ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది అని జనసేన నాయకుడు గర్భాన సత్తిబాబు ఒక ప్రకనలో తెలిపారు.
పాలకొండ నియోజకవర్గ నాయకులు గర్భన సత్తిబాబుతో పాటు పాలకొండ పట్టణ నాయకులు గొర్రెల. మన్మధరావు, అనిల్,సాయి, సీతంపేట శ్రీకాంత్, యోగి, వీరఘట్టం మండల నాయుకులు జనసేన జానీ, వెంకటరమణ, సంతోష్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు సత్తిబాబు ఒక ప్రకటనలో తెలిపారు.