Kanna LakshminarayanaKanna Lakshminarayana

కాపుల ఓట్లతోనే ఏ పార్టీ అయినా గెలిచేది. కానీ ఆ యా పార్టీలు గెలిచిన తరువాత కాపులను వాడుకొని వదిలేస్తున్నారు. ఎన్నికల ముందు మరల కాపులు గుర్తుకొస్తారంటూ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు

రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, గెలిచినా కాపుల ఓట్లతోనే సాధ్యపడుతోంది. ఏపీ జనాభాలో 22 శాతం కాపులున్నారు. 1989 నుంచి రాష్ట్రంలో కాపులే నిర్ణయాత్మకశక్తిగా ఉన్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల్లో ఓట్ల కోసం కాపు సామాజికవర్గాన్ని వాడుకొని తర్వాత వదిలేయడం రాజకీయపార్టీల పని అయిందని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.

కాపు రిజర్వేషన్లపై కన్నా ఆవేదన…

రాష్ట్రంలో కాపుల రిజర్వేషన్లు అమలు కాకపోవడంపై కన్నా ఆవేదన వ్యక్తం చేశారు. కాపు రిజర్వేషన్ల కోసం ఎంతోమంది పోరాటాలు చేసారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాపుల రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. చంద్రబాబునాయుడు ఈ రిజర్వేషన్లను పూర్తిచేశారు. చంద్రబాబు హయాంలో ఈబీసీ కోటాలో కేంద్రం ప్రకటించిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతాన్ని కాపులకు చంద్రబాబు కల్పించారు. ఈ కోటా అమలయ్యే సమయానికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత జారుగుతున్నదో మనకితెలిసిందే అని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.

పవన్ కల్యాణ్’పై కన్నా కీలక వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ 9 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టినప్పటికీ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయారు. కాపులను తాను ఒక్కడినే ప్రభావితం చేయలేనని కన్నా అన్నారు. జనసేనానిని బయటనుండి ఎవరూ ప్రభావితం చేయకుండా చూడాల్సి ఉంది అని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. జనసేనను ఎలా అధికారంలోకి తీసుకురావాలనే విషయాన్ని జనసేనానికే వదిలేస్తే మంచిది అని కన్నా అన్నారు.

పవన్ కళ్యాణ్ తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నాడు. సేనాని ప్రలోభాలకు అంతగా ప్రభావితమయ్యే వ్యక్తి కూడా కాదు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద కాపులకు రిజర్వేషన్లు పునరుద్ధరించాలని కూడా కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేసారు.

అసలు జీవీఎల్’కి సన్మానాలు దేనికో అర్ధం కావడం లేదు?

కాపు రిజర్వేషన్లు చెల్లుతాయన్న కేంద్రం రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఇటీవల కాపులతో సన్మానాలు చేయించుకుంటున్నారు. ఇలా ఎందుకు చేయించు కుంటున్నారు అనేది అర్ధం కావడం లేదు? కాపులకు ఏం చేశారని సన్మానాలు చేయించుకుంటున్నారంటూ కన్నా సూటిగా ప్రశ్నించారు.

కాపులకు 5 శాతం రిజర్వేషన్లపై సర్టిఫికెట్లు జారీచేయబోతున్న తరుణంలో వైసీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఆ రిజర్వేషన్లు చెల్లవని వైసీపీ ప్రభుత్వం రద్దుచేసింది. దీనివల్లే కాపులకు రిజర్వేషన్లు దక్కడం లేదు. దీనిపై పార్లమెంటులో జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సమాధానం చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన కాపు రిజర్వేషన్లు చెల్లుతాయని చెప్పింది. ఒకప్పుడు చంద్రాబును కన్నా తీవ్రంగా విమర్శించేవారు. అలా విమర్శించడమే కాకుండా వ్యక్తిగత విమర్శలు కూడా చేసేవారు.

అటువంటిది చంద్రబాబు హయాంలోనే రిజర్వేషన్లు కల్పించారంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారా అనిపిస్తున్నది. మరికొద్దిరోజుల్లో తెలుగుదేశంలో కానీ, జనసేనలోకానీ జీవీఎల్ చేరబోతున్నారా అంటూ కన్నా లక్ష్మీనారాయణ అనుమానాలు వ్యక్తం చేసారు.

ఎమ్మెల్సీ సీటు కోసం ఎగబడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు: సేనాని కార్టూన్