pawan kalyanPawan kalyan handing over insurance policy

అమరావతి రైతులతో జనసేనాని సమావేశం
GHMC ఎన్నికల్లో పోటీకి సిద్దం
ప్రతీ క్రియాశీల కార్యకర్తకు 5 లక్షల ఇన్సూరెన్సు

అధికారం తాలూకు అంతిమ లక్ష్యం వేల కోట్లు వెనకేసుకోవడం కాదు. ప్రజలు కోల్పోయిన వాటిని వారికి అందజేయడం కావాలి… జనసేన పార్టీ (Janasena Party) అది చేస్తుందని జనసేన (Janasena) అధ్యక్షులు  పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేశారు. ఒక సమస్య ఉంటే దాని గురించి బలంగా ప్రస్తావించి మాట్లాడితే – వ్యక్తిగత దూషణలకు దిగడం మినహా దాన్ని పరిష్కరిద్దామన్న ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. నేను కోరుకుంటున్న క్రియాశీలక సభ్యులు ప్రజలు, పార్టీకి అందుబాటులో ఉండేవారై ఉండాలని ఆకాంక్షించారు.

ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా ధైర్యంగా నిలబడాలని నాయకులకు దిశా నిర్దేశం చేశారు. మంగళవారం ఉదయం మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో (Mangalagiri Party Office) ఇచ్చాపురం, రాజోలు, మంగళగిరి, నెల్లూరు రూరల్, అనంతపురం అర్బన్ నియోజకవర్గాల ఇంచార్జులు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆ అయిదు నియోజకవర్గాల్లో పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని(Prime membership) పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి విజయవంతంగా పూర్తి చేశారు. ఇందుకు సంబంధించి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నవారికి అమలు చేస్తున్న ప్రమాద భీమా వివరాలను వెల్లడించారు. ఈ సభ్యత్వం పొందినవారికి రూ.5 లక్షలు ప్రమాద భీమా సదుపాయం కల్పిస్తున్నారు. భీమా ధ్రువపత్రాలను  పవన్ కల్యాణ్  ప్రదానం చేశారు.

అమరావతి రైతులతో జనసేనాని సమావేశం

రాష్ట్ర ప్రభుత్వం (AP Government) అమరావతి (Amaravathi) కాదు మూడు రాజధానులు అని ప్రకటన చేసింది. ఆ ప్రకటనకు వెనువెంటనే అందరితో మాట్లాడి, సమావేశ పరచి, అందరి అభిప్రాయాలు తీసికొన్న తరువాతనే రాజధానిపై నిర్ణయం తీసికొన్నాం. జనసేన పార్టీ అమరావతి రాజధానికే తక్కుబడి ఉంది అని జనసేనాని పవన్ కళ్యాణ్ తెలియ చేశారు. పోలవరం గురించి మాట్లాడాలి అంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా దుష్టిలో పెట్టుకొనే మాట్లాడాలి. రాష్ట్ర ప్రభుత్వమే తప్పులు చేసింది అని కేంద్రం అంటే మనం ఏమి చెప్పాలి. పోలవరం ప్రాజెక్టుపై తప్పులు, ఒప్పులు పూర్తిగా తెలిసికొని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళతాం. పూర్తి బాధ్యతో దీన్ని నిర్వహిద్దాం అని పవన్ కళ్యాణ్ ఉద్భోధించారు.

పోలవరం పర్యటనలో ఖమ్మం వరకు వెళ్లి ముంపు ప్రాతాలను పరిశీలించాం. పునరావాసం ఎవరికీ అందలేదు. నిద్దుల్లో ఎక్కువ భాగం ఈ పునరావాసానికి వెళుతుంది. గిరిజనుల జీవితాలు ఛిద్రం అయిపోయాయి. అయితే ప్రజల నుంచి కూడా మద్దతు లభించినప్పుడు ప్రజా పోరాటాలకు బలం వస్తుంది అని పవన్ కళ్యాణ్ అమరావతి రైతులను ఉద్దేశించి అన్నారు.

జి.హెచ్.ఎమ్.సి. ఎన్నికల్లో పోటీకి సిద్దం – శ్రీ పవన్ కళ్యాణ్

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జి.హెచ్.ఎమ్.సి.) ఎన్నికల్లో పోటీ చేయాలని యువ కార్యకర్తల విజ్ఞప్తి మేరకు నిర్ణయించాం. తెలంగాణ రాష్ట్రంలోనూ, జి.హెచ్.ఎమ్.సి. పరిధిలోను పార్టీలో క్రియాశీలకంగా ఉన్న కార్యకర్తలు, యువ జనసైనికులు నుంచి ఈ అంశంపై పలు విజ్ఞప్తులు వచ్చాయి. వారి వినతి మేరకు జి.హెచ్.ఎమ్.సి. ఎన్నికల్లో పోటీ కి సన్నద్ధం కావాలని పార్టీ నాయకులను, నగర పరిధిలోని కమిటీలకు స్పష్టం చేశాను.

Spread the love