మూడు వర్ణాలతో మురిపించే భారత జాతీయ పతాకం (Indian National Flag) అనేది భారతీయుల ఏకత్వానికి, శౌర్యానికి, స్వాభిమానానికి, సార్వభౌమత్వానికి, సమున్నతకి ప్రతీక. మన త్రివర్ణ పతాకాన్ని(Tri Color Flag) వీక్షించిన మరుక్షణం శరీరం రోమాంచితం కాని భారతీయులు ఉండరంటే అది అతిశయోక్తి కాదు. ఇది అక్షర సత్యం (Akshara Satyam). అంతటి శక్తి కలిగిన పతాకాన్ని రూపొందించిన స్వాతంత్ర సమరయోధుడు శ్రీ పింగళి వెంకయ్య (Pingali Venkaiah) చరితార్థుడు. ఆ పతాక తపశ్శాలి తెలుగు గడ్డపై జన్మించడం తెలుగు జాతి (Telugu People) పుణ్యఫలం. ఆ మహానుభావుని 146వ జయంతి సందర్భాన నా పక్షాన, జనసేన పార్టీ (Janasena Party) పక్షాన నీరాజనాలు అర్పిస్తున్నాను అని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు.
భారతదేశానికి (India) స్వతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తవుతున్న శుభతరుణంలో జాతి యావత్తు వజ్రోత్సవాలు జరుపుకోడానికి సమాయత్తమవుతున్న వేళ స్వర్గీయ శ్రీ పింగళి వెంకయ్య జయంతి కూడా జరగడం యాదృచ్చికమే అయినా అదొక మరుపురాని మహత్తర ఘట్టం అని పవన్ కళ్యాణ్ తెలిపారు.
దేశం పరాయిపాలనలో అరాచకాలను చవి చూస్తున్న తరుణంలో జాతిని ఏకం చేయడానికి దేశానికి ఒక పతాకం అవసరమని ఏళ్ల తరబడి ఘోషిస్తూ, శ్రమిస్తూ చివరికి ‘ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా’ అనే పుస్తకాన్ని రచించి, ప్రచురించారు శ్రీ పింగళి. తుదకు 1921 మార్చిలో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో మహాత్మా గాంధీజీ ఆశీస్సులతో శ్రీ పింగళి రూపొందించిన త్రివర్ణ పతాకం భారత జాతీయ పతాకంగా ఆమోదం పొందింది. ఈ ఘడియలకోసం శ్రీ పింగళి ఒక తపస్సునే చేశారు అని జనసేనాని వివరించారు.
విద్యాధికుడు, వ్యవసాయం, భూగర్భశాస్త్రంలో నిపుణుడు అయిన శ్రీ పింగళి వెంకయ్యని ఎందువల్లనో ఇటు తెలుగు రాజకీయ నాయకులు, అటు జాతీయ నాయకులు సరైన సమయంలో ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తించకపోవడంతో ఆర్థికంగా దుర్భరమైన జీవితాన్ని చరమాంకంలో చవిచూశారు. ఇది అత్యంత దురదృష్టకరం. ఆ త్యాగశీలికి ‘భారతరత్న’ (Bharat Ratna) పురస్కారం అందించాలని తెలుగు ప్రజల కోరిక. అది ఇంతవరకు నెరవేరలేదు. దేశంలో ‘ఆజాది కా అమృతోత్సవ్’ (Azadi Ka Amrut Mahotsav) వేడుకలు జరుగుతున్న ఈ శుభ ఘడియలలో శ్రీ పింగళి వెంకయ్య సేవలకు గుర్తింపుగా ఆయనకు భారతరత్న ప్రకటించాలని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) డిమాండ్ చేసారు. దీనిపై భారతీయ జనతా పార్టీ (Bharateeya Janata Party) జాతీయ నాయకత్వం (National Leadership) తక్షణమే స్పంచించాలి అని పవన్ కళ్యాణ్ కోరారు.