JanasenaniJanasenani

నిరుద్యోగ యువత (Unemployed Youth) పక్షాన ప్రశ్నించే జనసైనికుల (Janasainiks) గొంతుని నొక్కాలని జగన్ ప్రభుత్వం (Jagan government) చూస్తున్నది. ఇది అప్రజాస్వామ్యం అని జనసేనాని (Janasenani) తీవ్రంగా దుయ్యబట్టారు. రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామనే హామీని ఎంతో ఆశగా నమ్మిన నిరుద్యోగ యువతకు ప్రభుత్వం చేసిన వంచనపై జనసేన (janasena) ప్రశ్నిస్తున్నది. నిరుద్యోగ యువతకు జనసేన అండగా నిలుస్తున్నది. ప్రభుత్వ వంచనని ప్రశ్నిస్తున్న జనసైనికులను అక్రమంగా అరెస్టులు చేసి గొంతు నొక్కే ప్రయత్నం ఏపీ ప్రభుత్వం చేయడం అప్రజాస్వామికం (Undemocracy) అని పవన్ (Pawan Kalyan) విమర్శించారు. ఇచ్చిన హామీని విస్మరించి 10 వేల ఉద్యోగాలతో సరిపెడితే, యువతీయువకులు ఆక్రోశిస్తున్నారు. అటువంటి వారి కోసం మంగళవారం అన్ని జిల్లా కేంద్రాల్లోని ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజీ (Employment Exchange) కార్యాలయాలకు జనసైనికులు వెళ్ళి వినతి పత్రాలు అందించే కార్యక్రమం చేపట్టింది. దీన్ని జగన్ ప్రభుత్వం అడ్డుకోవడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది అని జనసేనాని తెలిపారు.

సోమవారం రాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా జనసేన నాయకులు, కార్యకర్తల ఇళ్లకు వెళ్ళి పార్టీ కార్యక్రమానికి వెళ్లకూడదని పోలీసులు ఆంక్షలు విధించారు. అర్థరాత్రి నుంచి గృహ నిర్బంధాలు, అరెస్టులు చేసి పార్టీ శ్రేణులను పోలీసులు భయపెట్టే ప్రయత్నం చేశారు. ధర్మం, న్యాయం పక్షాన మాట్లాడటం, ప్రజాస్వామ్యయుతంగా ముందుకు వెళ్ళడం జనసేన నైజం. నిర్భందాలు, అరెస్టులతో గొంతు నొక్కి, నిలువరించడం సాధ్యం కాదు. ఎంతగా కట్టడి చేయాలని చూసినా నిరుద్యోగుల కోసం జనసేన నాయకులు, శ్రేణులు జిల్లా ఉపాధి అధికారులకు వినతి పత్రాలు అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎన్ని ఆటంకాలు కలిగించినా పార్టీ పిలుపు మేరకు ఈ కార్యక్రమంలోప్రతి నాయకుడు , ప్రతి జన సైనికుడు పాల్గొన్నారు అని పవన్ కళ్యాణ్ తెలియ జేశారు.

జనసేనకు మాత్రమే నిబంధనలు, నిర్బంధాలూనా?

30 లక్షల మంది నిరుద్యోగ యువత భవిష్యత్ కోసం శాంతియుతంగా కార్యక్రమం చేపడితే నోటీసులు ఇచ్చి నిబంధనలు పెట్టి, నిర్బంధాలు చేశారు. ఈ నిబంధనలను జనసేనకు మాత్రమే వర్తింప చేస్తారా? అధికార పార్టీ వేల మందితో చేసే కార్యక్రమాలను, సన్మానాలను, ఊరేగింపులకు ఈ నిబంధనలు, నిర్భందాలు ఎందుకు వర్తించడంలేదు అని జనసేనాని తీవ్రంగా దుయ్యబట్టారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి, పార్టీ జిల్లాల అధ్యక్షులు డా.పి.హరిప్రసాద్, శ్రీ కందుల దుర్గేష్, శ్రీ కొటికలపూడి గోవిందరావు, శ్రీ షేక్ రియాజ్, శ్రీ టి.సి.వరుణ్, శ్రీ గాదె వెంకటేశ్వరరావు, పి.ఏ.సి.సభ్యులు శ్రీ పంతం నానాజీ, శ్రీ పితాని బాలకృష్ణ, శ్రీ కోన తాతారావు, శ్రీ కనకరాజు సూరి, మత్స్యకార వికాస విభాగం ఛైర్మన్ శ్రీ బొమ్మిడి నాయకర్ లతోపాటు అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జులు, పార్టీ కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, మహిళా నాయకులను, కార్యకర్తలను అరెస్టులు చేసి, గృహ నిర్బంధాల్లో ఉంచారు. ప్రజాస్వామ్యంలో వినతులు ఇచ్చే ప్రక్రియను నిలువరించారు. ఎన్ని ఆటంకాలు కలిగించినా జనసేన పార్టీ నాయకులు ఉపాధి కల్పన కార్యాలయాలకు చేరుకొని వినతి పత్రాలు అందించి నిరుద్యోగుల ఆవేదనను తెలియచేయగలిగారు. ఇదే స్ఫూర్తితో నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకూ వారికి అండగా నిలబడదాం అని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు.

Spread the love