Narendra ModiNarendra Modi

పండగ సమయంలో ప్రజలకు ప్రధాని దిశా నిర్ధేశం

కరోనా అయిపోయిందని భావిస్తూ చాలామంది అశ్రద్దతో వ్యవహరిస్తున్నారని అది ఏమాత్రం మంచిది కాదని భారత ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు. అగ్ని శేషం… శత్రు శేషం… రోగ శేషం మంచిది కాదని ప్రధాని హితవు పలికారు. అవి మూడు సమూలంగా అంతం అయ్యేవరకు ప్రజలు జాగరూకులై ఉండకపోతే ప్రమాదం తరుముకొస్తుందని ప్రధాని మోడీ అన్నారు. వాక్సిన్ వచ్చే వరకు కరోనా పోయినట్లు కాదని ప్రధాని అన్నారు. మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ, చేతులు శుభ్రం చేసికొంటూ పూర్తి ఆరోగ్య నిభంధనలతో ముందుకు వెళ్ళాలి అని ప్రధాని ప్రజలకు పిలుపునిచ్చారు.

పండగల సంతోషం మన ఇంట నిలవాలి అంటే ప్రతీ ఒక్కరు అప్రమత్తతతో మెలగాలని ప్రధాని పిలుపు నిచ్చారు. భారత ప్రధాని మంగళవారం నాడు జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కరొనపై దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు.

కరోనాపై భారతీయులందరు సుదీర్ఘ ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఆర్ధిక కార్యక్రమాలు క్రమ క్రమంగా పుంజుకొంటున్నాయి. ప్రజలు తమ దైనందిన కార్యక్రమాల కోసం బయటకి వస్తున్నారు. పండగ వాతావరణంలో బజార్లలో సందడి వాతావరణం పెరుగుతోంది. అయితే లాక్ డౌన్ అయిపోయి ఉండవచ్చు గాని కరోనా వైరస్ ఇంకా పోలేదన్న నిజాన్ని ప్రజలు మరచిపోవద్దు. ప్రస్తుతం ఉన్న సంతలో ఉన్నాం. దాన్ని మెరుగుపరచుకోవాలి తప్పితే దిగజారిపోనివ్వరాదు. ప్రస్తుతం మన రికవరీ రేటు బాగున్నది. మరణాల రేటు కూడా తక్కువగా ఉన్నది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత దేశంలో కరోనా బాధితుల రేటు, మరణాల రేటు, రికవరీ రేటు కూడా తక్కువగా ఉన్నాయి.
ఈ విషయంలో మన దేశం విజయం సాధించినది.

కరోనాపై ఇంకా ఏమీ ప్రమాదం లేదు అనుకోవద్దు. ప్రమాదం పొంచి ఉన్నది. నిర్లక్ష్యం మంచిది కాదు. మాస్కు లేకుండా బయటకి రావడం మీకు మీ కుటుంబానికి, సమాజానికి కూడా మంచింది కాదు అని ప్రధాని మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో హెచ్చరించారు.