మద్ది ఆంజనేయ స్వామి ఆలయ చైర్ పర్సన్ కీసరి సరిత విజయ భాస్కరరెడ్డి కార్తీక మాసోత్సవాలను ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్తీకమాస మహోత్సవములు ఆమె ఈ రోజు బుధవారం ప్రారంభించారు. పశ్చిమగోదావరి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామములొ వేంచేసియున్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానమునందు కార్తీక మాస మహోత్సవములు ది.26.10.2022 నుండి ది.23.11.2022 వరకు అత్యంత వైభవముగా జరుగును.
ఈ కార్యక్రమములో జంగారెడ్డిగూడెం ZPTC సభ్యులు పోల్నాటి బాబ్జీ గురవాయిగూడెం సర్పంచ్గుబ్బల సత్యవేణి గురవాయిగూడెం MPTC కొయ్యా రామారెడ్డి, ట్రస్ట్ బోర్డు సభ్యులు దండు వెంకట కృష్ణం రాజు, మల్నీడి మోహన కృష్ణ(బాబీ), చిలుకూరి సత్యనారాయణరెడ్డి, బల్లే నాగలక్ష్మి,పాములపర్తి యువరాణి, పరపతి భాగ్యలక్ష్మి, జెట్టి దుర్గమ్మ మరియు ప్రత్యేక ఆహ్వానితులు కర్పూరం రవి భక్తులు తదితరులు పాల్గొన్నారు.
భక్తుల సౌకర్యార్దం గుండుగొలను వాస్తవ్యులు మంతెన కాశీ విశ్వనాధరాజు, మంతెన ఝాన్సీరాణిలు స్వామి వారి దేవస్థానమునకు A.C.మిషన్లు బహుకరించారు. అలానే మురమళ్ళ వాస్తవ్యులు దాట్ల సత్యనారాయణ రాజు ప్రసాదములు తయారుచేయు వంటసాల నందు ఉపయోగించుకొనుటకు స్టీమ్ బాయిలర్స్ బహుకరించారు. ఈ వివరాలను ఆలయ ధర్మకర్తల మండలి అద్యక్షురాలు కీసరి సరిత విజయ భాస్కరరెడ్డి మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలియజేసారు.
అక్టోబర్ 28 నుండి కార్తీకమాస 29వ సప్తాహ మహోత్సవములు
శ్రీ స్వామి వారి దేవస్థానము నందు ది.28.10.2022 శుక్రవారము నుండి ది.04.11.2022 శుక్రవారం వరకు 29 వ సప్తాహమహోత్సవములు జరుగును. ఉదయం గం.05.00ల నుండి ప్రాతఃకాలార్చన, తోమాలసేవ, గోపూజా, ఉదయం గం09.00 లనుండి సప్తాహ పూజా కార్యక్రమములు జరుగును. అలానే విశ్వక్సేనపూజ, దీక్షాధారణ, భజనాపాళీలకు వరుణులు అందజేయబడును. సాయంత్రం గం.06.00లకు యాగశాల ప్రవేశం నీరాజన మంత్ర పుష్పములు జరుపబడునని ఆలయ ధర్మకర్తల మండలి ఒక ప్రకటనలో తెలిపారు.
–జంగారెడ్డిగూడెం నుండి గరువు బాబురావు