PK for formation dayPK for formation day

సాంస్కృత కార్యక్రమాలతో జనసేన పార్టీ (Janasena Party) ఆవిర్భావ సభ (Formation day) ప్రారంభం అయ్యింది. సభ ప్రాంగణం ఇప్పటికే నిండిపోయింది. జనసైనికులు (Janasainiks) రెట్టించిన ఉత్సాహంతో చేస్తున్న నినానాదాలతో ఇప్పటం (Ippatam) గ్రామమంతా మారుమోగిపోతున్నది. సీఎం పవన్ (CM Pawan), సీఎం పవన్ అంటూ చేస్తున్న నినాదాలతో సభ ప్రాంగణం అంటా ప్రతి ధ్వనిస్తున్నది.

జనసేన ఆవిర్భావ సభ హైలైట్స్ (Highlights of Formation day):

వైసీపీ (YCP) వ్యతిరేక ఓట్లను చీలనివ్వను. వైసీపీ ఆధిపత్యాన్ని (YCP Government) అడ్డుకొంటాను అంటూ జనసేనాని (Janasenani) తన ప్రసంగాన్ని ముగించారు.

అధికార మదంతో, వాళ్ళు బలిసి కొట్టుకొంటున్న వైసీపీ అనే మహిషానికి కొమ్ములు విరగగొట్టి, కింద కూర్చోబెట్టి, వచ్చి ఎన్నికల్లో సరికొత్త ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. ఇదే జనసేన శపథం.

గూండాల్లా రేచిపోతున్న వైసీపీ నాయకులకు భీమ్లా నాయక్ (Bheemla Nayak) ట్రీట్మెంట్ అంటే ఏమిటో జనసేన చూపిస్తుంది.

అప్పుల్లేని ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) గా చేయడం కోసం జనసేన షణ్ముఖ వ్యూహం (Shanmukha Vyuham) అనుసరిస్తుంది.

అప్పుల్లో ఆంధ్ర ప్రదేశ్. ఆస్తుల్లో పాలకులు. సంక్షోభంలో సంక్షేమ పధకాలు. తరలిపోతున్న పరిశ్రమలు. రోడ్లు వేయడం లేదు. పంచాయతీల్లో డబ్బులు లేదు. డ్రైనేజీ శుభ్రం చెయ్యలేరు. రైతులకు డబ్బులు చెల్లించలేరు. సంపూర్ణ మధ్య నిశితం అంటూ సంపూర్ణంగా తాగిస్తున్నారు. నాయకుల జేబుల్లోకి పోతున్న మద్యం డబ్బులు. అప్పు చేసిన డబ్బులు ఏమైపోయాయే తెలీదు. దేవుళ్ళ విగ్రహాలను కూడా రక్షణ లేదు అంటూ చెలరేగిపోయిన జనసేనాని పవన్ కళ్యాణ్.

జగన్ ప్రభుత్వం అమరావతి విషయంలో నాడు ఒక మాట నేడు మరొక మాట మాట్లాడుతున్నారు. నేడు మూడు రాజధానులు అంటున్న వైసీపీ నాయకులు నాడు ఏమి చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారా అని ఎక్కి పారేసిన పవన్ కళ్యాణ్.

జగన్ ప్రభుత్వంపై తన ఘాటైన విమర్శలతో చెలరేగిపోతున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).

2014 లో ప్రశ్నించాం. 2019 గట్టిగా నిలదొక్కుకోన్నాం. 2024 లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్

చీకట్లో మగ్గుతోన్న ఆంధ్ర ప్రదేశ్ భవిత జనసేన పార్టీ (Janasena Party) క్రియాశీల సభ్యుల చేతుల్లో ఉంది అని స్పష్టం చేసిన జనసేనాని.

కాంగ్రెసుకి మరో రూపమైన వైసీపీకి జనసేన సాధించిన విజయాలు అర్ధం కాకపోవచ్చు. నేటి టీడీపీకి మన విజయాలు అర్ధం కాకపోవచ్చు. కానీ జనసేన 7 శాతం నుండి 27 % పెరిగిన ఓట్ల శాతం చాలా గొప్పది. ఇది ఆ రెండు పార్టీలకు అర్ధం కాకపోవచ్చు.

నా సంస్కారం వైసీపీ నాయకులకు (YCP Leaders), కార్యకర్తలకు కూడా నమస్కారం పెట్టమంటోంది అని నమస్కరించిన జనసేనాని.

రాజకీయాల్లో అభిప్రాయం భేదాలు ఉండాలి తప్ప వ్యక్తిగత ద్వేషాలు ఉండకూడదు అని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్.

ఆవిర్భావ సభని పెట్టుకోవడానికి అనుమతి నిచ్చిన ఇప్పటం గ్రామానికి 50 లక్షలు విరాళం ప్రకటించిన జనసేనాని.

జనసైనికుల కేరింతలు, గర్జింపుల మధ్య ప్రారంభమైన జనసేనాని ప్రసంగం.

అంధకారాన్ని తీసికొచ్చిన జగన్ ప్రభుత్వం (Jagan Government) పోవాలి. పవన్ ప్రభుత్వం రావాలి అంటూ తన ప్రసంగాన్ని ముగించిన నాదెండ్ల మనోహర్.

నిరుద్యోగులతో సహా అన్ని వర్గాలను మోసం చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని విమర్శ చేసిన నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar).

సంక్షేమం పేరుతో పాలక పార్టీలు విలువలు లేని రాజకీయాలను చేస్తున్నారు: నాదెండ్ల మనోహర్.

శ్రీ దామోదరం సంజీవయ్య లాంటి మహోన్నతమైన వ్యక్తిని యువతకి తెలియజేసిన వ్యక్తి మన జనసేనాని అంటూ తన ప్రసంగాన్ని మొదలు పెట్టిన నాదెండ్ల మనోహర్.

పవన్ రాజకీయాల్లోకి వచ్చింది ప్రశ్నించడానికే కాదు రాజ్యాధికారాన్ని సాధించడానికి కూడా అని స్పష్టం చేసిన కొణెదల నాగబాబు

జనసైనికులను ఆకట్టుకున్న కొణెదల నాగబాబు సెటైరికల్ స్పీచ్.

జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకి సుమారు 10 లక్షలు హాజరు అయి ఉంటారని అంచనా

జనసేన సభకు ఎప్పుడూ యువకులు మాత్రమే హాజరు అయ్యేవారు. కానీ ఈ సారి జనసేన సభలో 50 సంవత్సరాలు పైబడినవారు కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నారు. దీన్ని మార్పుకి సంకేతంగా భావించవచ్చు.

పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్ర రాష్ట్రము (Andhra) బాగుపడుతుంది: రియాజ్, జనసేన నాయకులు

అవినీతి మీద అణచివేతలమీద మనం యుద్ధం ప్రకటించాలి. జనసేన ప్రభుత్వాన్ని స్థానించాలి అంటూ ఉపన్యాసం ప్రారంభించిన చిల్లపిల్ల శ్రీనివాస్

మార్పు కోసం యుద్ధం మొదలు పెడదామా అంటూ తన పదునైన ఉపన్యాసం మొదలు పెట్టిన తెలంగాణ యువకెరటం సంపత్

వైసీపీ పాలనలో ఆస్తులు అమ్మడం, అప్పులు తేవడం తప్ప ఏకులానికి లేదా ఏ మతానికి న్యాయం జరగడం లేదు: జనసేన పార్టీ నాయకులు

రా రా నా కొడకా అంటూ ఉపన్యాసం కొనసాగించిన బొలిశెట్టి శ్రీనివాస్

జనసేనని ఆదరిస్తున్న ప్రజలకి స్వాగతం అంటూ… అమరులైన జనసైనికులకు నివాళిలు అర్పించారు. రెండు నిముషాలు మౌనం పాటించారు.

జనసేన ఆవిర్భావ సభలో ప్రారంభమైన ఉపన్యాసాలు

హోటల్ నుండి సభాస్థలికి బయలుదేరిన జనసేనాని
ప్రారంభమైన సాంస్కృతిక కార్యక్రమాలు

కష్టాల కడలిలో జనసేనాని పోరాటం!

Spread the love