Jammi CheruvuJammi Cheruvu

కృతజ్ఞతలు తెలిపిన విస్సంపల్లి సిద్దు మాదిగ

ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలం మక్కినవారిగూడెం గ్రామంలో ఉన్న జమ్మిచెరువు ఆక్రమణలకు గురైన విషయంపై అధికారులు స్పందించారు. మహాజన సోషలిస్టు పార్టీ పోలవరం నియోజకవర్గం ఇంచార్జి విస్సంపల్లి సిద్ధూ మాదిగ గ్రామంలోని జమ్మిచెరువు ఆక్రమణలకు గురైందని దీనిపై సమగ్ర విచారణ జరపాలని జంగారెడ్డిగూడెం ఆర్డీవోకు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు స్పందించారు అని విస్సంపల్లి సిద్దు మాదిగ వివరించారు.

సిద్ధూ మాదిగ ఫిర్యాదుపై జలవనరులశాఖ అధికారులకు చర్యలు తీసుకోవాలని ఆర్డిఓ ఆదేశించారు. దీనిపై ఆ శాఖ జమ్మిచెరువు ఆక్రమణలపై త్వరలో సర్వే నిర్వహిస్తామని అధికారులు తెలిపినట్లు మహాజన సోషలిస్ట్ పార్టీ పోలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ విస్సంపల్లి సిద్దు మాదిగ వివరించారు.

అంతేకాకుండా చెరువు అభివృద్ధికి నిధులు ఇప్పటికే కేటాయించామని ప్రభుత్వానికి వ్రాసి ఉన్నట్లు అధికారులు పేర్కొన్నట్లు సిద్దు మాదిగ తెలిపారు. ఈ జమ్మిచెరువు విషయంపై ఆయన మాట్లాడుతూ టి.నరసాపురం మండలం మక్కినవారి గూడెంలో సర్వే నెంబర్ 38లో సుమారు 110 ఎకరాల విస్తీర్ణం కలిగిన జమ్మిచెరువు ఉందని తెలిపారు.

అయితే 110 ఎకరాలు అని చెప్తున్నా నిజానికి రెవెన్యూ రికార్డ్స్ లోమాత్రం 81.50 సెంట్లు మాత్రమే ఉందని మిగిలిన భాగం అక్ర మాలకుగురి అయిందని తాను స్పందన కార్యక్రమంలో ఆర్డీవోకు ఒక ఫిర్యాదు చేసినట్లు విస్సంపల్లి సిద్దు మాదిగ తెలిపారు. ఈ ఫిర్యాదు పై అధికారులు స్పందించినందుకు సిద్దుమాదిగ కృతజ్ఞతలు తెలిపారు.

సుమారు 10 దశాబ్దాల పైగానే జమ్మి చెరువు 3000 ఎకరాల ఆయకట్టు కలిగి ఉండి రెండు పంటలకు నీరు అందించెంది. ప్రస్తుతం ఆక్రమణ గురవటం కారణంగా, అదేవిధంగా చెరువు అభివృద్ధికి నోచుకోకపోవడంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అయన అన్నారు.

ప్రస్తుతం రైతుల జీవ నాధారమై రెండు పంటలకు నీరు అందించే జమ్మిచెరువు ఇప్పుడు నీరు లేక వెలగల పోతుందని అన్నారు. ఇదిలా ఉండగా జమ్మిచెరువు వల్ల మక్కినవారి గూడెం, కొల్లివారిగూడెం, శ్రీనివాసపురం, బండివారిగూడెం, కృష్ణాపురం,గంగినీడుపాలెం, వాకలపూడి తదితర గ్రామాల రైతులు సస్యశ్యామలంగా పంటలు పండించుకునేవారని, అయితే ఎర్రకాలువకు ఇటువైపు ఉన్న ఎన్నో భూములకు జీవనాడి ఈ జమ్మి చెరువు ప్రస్తుతం నీరు లేక శిథిలావస్థకు చేరింది. అందుచేత ప్రభుత్వ చెరువు అభివృద్ధికి కేటాయించి నిధులు కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు.

ప్రస్తుతం నీళ్లు లేక వెలవెల పోతున్న జమ్మిచేరువు అభివృద్ధి కోసం మహాజన సోషలిస్ట్ పార్టీ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంయుక్తంగా పోరాటం చేస్తుందని సిద్ధు మాదిగ తెలిపారు. తక్షణమే జిమ్మిచెరువు అభివృద్ధికి ఐదు కోట్ల రూపాయల నిధులు కేటాయిoచాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా జమ్మిచెరువుకి పూర్వ వైభ వం తీసుకు రావాలని కోరారు. జమ్మిచెరువు అభివృద్ధికి 5 కోట్లు నిధులు ప్రభుత్వం మంజూరు చేసే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. జమ్మిచెరువు ఆక్రమదారులని గుర్తించి, ఆక్రమించినవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సిద్దు మాదిగ డిమాండ్ కోరారు.

–గురువు బాబురావు, జంగారెడ్డిగూడెం

కేసీఆర్ బ్రహ్మస్త్రంతో కాపుల దశ తిరిగేనా?
త్రిశంకు స్వర్గంలో కాపు సీఎంలు
అర్ధంకాని సేనాని

Spread the love