కాపుల ఆవేశంపై సామ్రాజ్యాలు స్థాపించుకొన్నది ఎవరు?
కాపులను మోసం చేసింది ఎవరు?
పవన్ వ్యూహాలు అర్ధంకానీ వ్యర్ధమా?
తుని రైలు దుర్ఘటన (Tuni Rail Incident) వెనుక వైసీపీ (YCP) ఉంది. అలానే కోనసీమ అల్లర్లు (Konaseema Incidents) వెనుక కూడా వైసీపీ ఉంది అనే జనసేనాని (Janasenani) మాటలు చాలా మంది కాపు పెద్దలకు (Kapu leaders) మింగుడు పడడం లేదు. ముఖ్యంగా కమ్మ వ్యతిరేకులకు (Kamma vyathirekulu) పవన్ వ్యాఖ్యలు గాని పవన్ వ్యవహార శైలిగాని అస్సలు నచ్చడం లేదు. కమ్మ వ్యతిరేకత (Anti Kamma) అంత మంచిది కాదు అనే పవన్ వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత? అసలు కాపులకు (Kapu) అన్యాయం చేసింది కమ్మ (Kamma) వర్గమా లేక రెడ్డి (Reddy) సామాజిక వర్గ పెద్దలా? ఇటువంటి విషయాలకు సమాధానాలు తెలియాలి అంటే చరిత్ర పుటలను వెనక్కి తిరగేయాల్సి ఉంది. మహోన్నతమైన కాపు చరిత్ర (History of Kapu) అంతా కాపు కులపెద్దల, ఉద్యమ పెద్దల భోషాణాల్లో చెదపురుగులు పట్టి మరుగున పడిపోతున్నది.
మన కులపెద్దలు, ఉద్యమపెద్దలు, కులసంఘాలు కలిసి కాపు యువతలో (Kapu Youth) నరనరానా కమ్మ వ్యతిరేకతని (Anti Kamma) ఇంజెక్ట్ చేశారు. రెడ్లు చేసిన లేదా చేస్తున్న మోసాలు గురించి వీరు అస్సలు చెప్పరు. దీనికి కారణం మన కులపెద్దలు, కులనాయకుల్లో ఎక్కువ మంది రెడ్డి వర్గానికి తొత్తులుగా మారడమే. కమ్మవ్యతిరేక మత్తులో ఉన్న మనకి రెడ్డి పెద్దలు కాపులకు చేసిన అన్యాయాలను తెలియ నివ్వడం లేదు.
ఇంతకీ కమ్మలు కాపులను అన్యాయం చేయలేదా?
అస్సలు కమ్మలు కాపులను అన్యాయం చేయలేదు అని అనడం లేదు. చేశారు. అయితే 1983 కి ముందు కమ్మలు అధికారంలోనే లేరు. అప్పటివరకు కాపులకు అన్యాయం చేసిందే రెడ్డి పెద్దలే. చంద్రబాబు (Chandra babu) రాజకీయాల్లోకి వచ్చిన తరువాతనే కాపులకు అన్యాయం చేయడం కమ్మలు మొదలు పెట్టారు. కాపులకు చంద్రబాబు తీరని అన్యాయం చేసాడు అనేది నిజమే. అయితే 1953 నుండి 2022 వరకు రెడ్డి సామజిక వర్గ పెద్దలు కాపులకు తీరని ద్రోహం, అన్యాయం చేశారు. వీటి గురించి కాపు కులపెద్దలుగాని (Kapu Peddalu), కాపు నాయకులు (Kapu Leaders) గాని మనకి చెప్పడం లేదు. మన అధికారాన్ని కమ్మని దొడ్డలు ఇద్దరు కూడా అనుభవిస్తున్నారు అనేది మరిచి పోయి ఒక్క కమ్మ వ్యతిరేకతనే మనలో ఇంజెక్ట్ చేస్తున్నారు.
కాపులకు రెడ్డి వర్గానికి చెందిన పెద్దలు చేసిన అన్యాయాలు గురించి ఒక్కసారి పరిశీలిద్దాం.
కాపులపై రెడ్ల పెత్తనం (Reddy’s dominance on kapus)
-చరిత్రలో కాపుల మీద జరిగిన అతి పెద్ద కుట్రలు, అణచివేతలు చేసింది రెడ్లు అధికారంలో ఉన్నప్పుడే.
-కాపులకు రెండు సార్లు రిజర్వేషన్స్ (Kapu Reservations) తీసేసింది కూడా రెడ్డి పెద్దలే (నీలం సంజీవ రెడ్డి (Neelam Sanjeeva Reddy, కాసు బ్రహ్మానంద రెడ్డి (Kasu Brahmananda Reddy)).
– రిజర్వేషన్ల పేరుతో కాపులను ముక్కలు ముక్కలుగా చేసింది కూడా రెడ్డి పెద్దలే.
-2005 లో కాపులకు శాశ్వతంగా రిజర్వేషన్ రాకుండా చేసింది రాజశేఖర్ రెడ్డి (Rajasekar Reddy).
-2005 లో కాపులపై బీసీ కమిషన్ సర్వే జరగడానికి అవసరమైన నిధులు కేటాయించని వ్యక్తి: రాజ శేఖర్ రెడ్డి.
-రంగాని (Ranga) అంతం చెయ్యడంలో ప్రధాన కుట్రదారులలో రెడ్డి పెద్దలు కూడా ఉన్నారు అనే ఆరోపణలు ఉన్నాయి.
-కాపులకు అనేక పర్యాయాలు రాజ్యాధికారం (Rajyadhikaram) రాకుండా చేసింది: రెడ్డి పెద్దలే
(నిజామాబాదుకి చెందిన రాజారామ్, డి శ్రీనివాస్, హైద్రాబాదుకి చెందిన శివశంకర్, వి హనుమంతరావు, చిరంజీవి, నేడు పవన్ కళ్యాణ్)
-కాపులకు ముఖ్యమంత్రి (Chief minister post) అవకాశం వచ్చినప్పుడల్లా కుట్రలు చేసి రెడ్డి వర్గానికే అధికారం దక్కేటట్లు చేసింది కూడా రెడ్డి పెద్దలే.
-ముద్రగడ (Mudragada) ఉద్యమాలను రెడ్డి పెద్దలు వాడుకొన్నారు గాని ముద్రగడని సీఎంగా ఎలివేట్ కాకుండా అడ్డుకొన్నది కూడా రెడ్డి పెద్దలే
-రంగా సమాధులపై అధికారంలోకి వచ్చిన రెడ్డి/కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) రంగా కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వకుండా అణచివేశారు.
– కమ్మలు-రెడ్డిలు కలిసిన కుట్రలతో తుని రైలు దుర్ఘటన జరిగింది అనే ఆరోపణలు ఉన్నాయి.
– కోనసీమ జిల్లాకు అంబెడ్కర్ పేరు అలానే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పట్టడం ద్వారా కాపులకు-దళితులకు- కమ్ములకు చిచ్చు పెట్టవచ్చు అని చేసి కుట్ర పన్నింది కూడా రెడ్డి పెద్దలే అనే ఆరోపణలు ఉన్నాయి.
-నేటి కోనసీమ పేరుతో అల్లర్లు సృష్టించి కాపులకు దళితులకు అగ్గి రాజేసింది కూడా కమ్మలు చాటున రెడ్డి పెద్దలే అని సోషల్ మీడియా కోడై కూస్తున్నది.
-2013 లో చిరంజీవిని (Chiranjeevi) కాంగ్రెస్ (Congress) నుండి సీఎం కాకుండా అడ్డుపెట్టింది కూడా రెడ్డి పెద్దలే అని కాపు చరిత్ర చెబుతున్నది.
రెడ్డి పెద్దలే కాపు కులాన్ని అణచివేశారు!
ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో చెప్పవచ్చు. అయితే పైన చెప్పిన అన్ని సందర్భాల్లో కూడా ప్రత్యక్షంగానో/పరోక్షంగానో రెడ్డి పెద్దలే కాపు కులాన్ని అణచివేశారు అని చెప్పాలి. ఇందులో బాబు హయాంలోని కమ్మ పెద్దలు (Kamma Leaders) చేసిన మోసాలు కూడా ఉన్నాయి. వాటిని ప్రత్యేక వ్యాసంలో చర్చిద్దాం. కానీ కాపు వర్గపు వెన్నెముకపై రెడ్డి సామ్రాజాన్ని (Reddy samrajyam) స్థాపించుకొన్నారు అనేది కాదనలేని అక్షర సత్యం. దీన్ని కాపు యువత (Kapu Youth) అంతా అర్ధం చేసికోవాలి.
1953 నుండి కూడా కాపులను అణచివేయ్యడానికి కాపు పెద్దలనే రెడ్లు వాడుకొన్నారు. రెడ్లు – కమ్మలు కలిసి మన కుల పెద్దలతోనే మన కాపు జాతిని అణగతొక్కేసారు. నాశనం చేసేసారు అని కాపు యువత భావిస్తున్నది. మన జాతికి రాజ్యాధికారం రాకపోవడానికి, బానిస సంకెళ్లతో నేటికి మగ్గడానికి ప్రధాన కారకులు రెడ్లు, ఆ తరువాత మన కుల నాయకులు/ కుల పెద్దలు/కుల సంఘాలు. ఆ తరువాతనే చంద్ర బాబు అని చెప్పాలి.
రంగా మరణాంతరం కాపుల పతనం!
రంగా మరణం ముందు గాని రంగా మరణం అనంతరం గాని రెడ్డి పెద్దలు ప్రణాళిక బద్ధంగా కాపులను వాడుకోవడం మొదలు పెట్టారు. దానికి కాపు ఉద్యమాలను (Kapu agitations), ఉద్యమ నాయకులను (Kapu Leaders) వాడుకొన్నారు. (కాపు ఉద్యమ నాయకులకు సమాంతరంగా చిన్న చిన్న కాపు నాయకులను పెంచి పోషిస్తున్నారు అనే నిజాన్ని ఉద్యమ పెద్దలు నాడు తెలిసికోలేక పోయారు.) అందులో భాగంగానే కమ్మ వ్యతిరేకత మన నరనరాన కలిసిపోయేలా రెడ్డి వర్గపు పెద్దలు చేసారు.
ఒక పక్కన కుల ఉద్యమాల ద్వారా కమ్మ వ్యతిరేకత పెంచుతూ, మరొక పక్కన ఉద్దండులైన కాపు నాయకులను పక్కకు పెట్టడం మొదలు పట్టారు. సంగీతం వెంకటరెడ్డి (Sangeetham Venkata Reddy), మంగెన గంగయ్య (Mangena Gangaiah), పంతం పద్మనాభం (Pantham Padmanabham), హనుమంతరావు (V Hanumantha Rao), కేశవరావు (Kesava Rao), రాజారామ్ (Rajaram) లాంటి సీనియర్ కాపు నాయకులను పక్కకు నెట్టసారు లేదా నామ మాత్రపు నాయకుల్లా ఉండేలా చేశారు. ప్రతిగా కాపుల్లో అంతగా అడ్రస్ లేని కాపులను తమ తొత్తులుగా ఉండడం కోసం అడ్రస్ లేని వారిని నాయకులుగా ఎలివేట్ చేయడం రెడ్డి పెద్దలు మొదలు పెట్టారు. వీటి అంతటికీ కాపు పెద్దల, ఉద్యమ పెద్దల సహకారం రెడ్డి పెద్దలకు పుష్కలంగా ఉంది.
రామ్ మనోహర్ లోహియా ఏమి ఆశించారు?
1956 లో రామ్ మనోహర్ లోహియా (Ram Manohar Lohia) హైదరాబాద్’లో ప్రసంగిస్తూ రెడ్ల తరువాత కాపులకు అధికార బదిలీ (Transition of power) జరగాలి అని ఆశించారు. కాపులు, దళితులు, పద్మ సాలీలు, బీసీలు కలిసి పనిచేయాలి. అధికార ఫలాలను (Fruits of power) అందరూ అనుభవించాలి. అంటే దీని అర్ధం అప్పటికి కమ్మ వర్గానికి ఉనికే లేదు. కానీ కాపుల్లో ఐక్యత లేకపోవడం, కాపునాయకులు, కాపు ఉద్యమ నాయకుల్లో అవగహన లేమి, అసూయల వల్ల కాపులకు దక్కాల్సిన రాజ్యాధికారం (Rajyadhikaram) కమ్ములకు పోయింది.
లోహియా చెప్పినది కమ్మలు ఆచరణలో పెట్టారు. రాజ్యాధికారాన్ని సాధించుకొన్నారు. కాపులు మాత్రం పల్లకీలు మోయడంతోనే సరిపెట్టుకొంటున్నారు. అలానే కాపు నాయకులు రెడ్డి పెద్దలకు తొత్తులుగా మారడమే అని కాపు చరిత్ర స్పష్టంగా చెబుతున్నది.
రామ్ మనోహర్ లోహియా “కులాల సమస్య” అనే పుస్తకంలో ఆంధ్ర రాజకీయాల (Andhra Politics) గురించి చాలా స్పష్టంగా ఉంది. కాపులకు అధికారం రాకపోవడానికి కారణం ఏమిటి? కాపులు అధికారం రావాలంటే ఎలాంటి నాయకుడు కాపుల్లోంచి పుట్టాలి అనేది కూడా అయన వివరింగా 1956 లోనే చెప్పారు. లోహియా సూచించిన లక్షణాలు పవన్ కళ్యాణ్’లో ఉన్నాయి. అయితే అతనిలో కూడా సమూలమైన మార్పులు రావాల్సి ఉంది. వస్తుంది కూడా.
కాపులకు అధికారం దక్కాలి అంటే?
మెజారిటీ వర్గమైన కాపులకు రావాల్సిన అధికారం, రెడ్ల నుండి కమ్మలు ఎత్తుకుపోయారు. దీనికి కారణం రెడ్డి పెద్దల వ్యూహాల్లో కాపు పెద్దలు చిక్కుకోవడం వల్లనే అని తెలిసికోవాలి. జనసేనానికి ఈ పుస్తకం గురించి, పుస్తకంలోని ప్రతీ అక్షరం గురించి తెలుసు. ఏ పేజీలో ఏముందో కూడా చూడకుండా చెప్పగలరు. ఆంధ్రలో కుల రాజకీయాలు గురించి, కమ్మలు-రెడ్డిలు కలిసి కాపులకు చేస్తున్న మోసాలు గురించి కూడా జనసేనాని పూర్తిగా తెలుసు. సమయం కోసం ఎదురు చూస్తున్నారు.
ఏకాకిగా మిగిలిన కాపు జాతిని దళితులు (Dalits), బీసీలు (BC) తదితర కులాలతో కలపాలి అన్న రామ్ మనోహర్ లోహియా మాటలను ఆచరణలో పెట్టడానికి పవన్ కృషి చేస్తున్నారు. కుల పెద్దల, ఉద్యమ పెద్దల సహకారం కోసం పవన్ వేచి చూస్తున్నారు. అందుకే పవన్ (Pawan Kalyan) ఆచి తూచి వెళుతున్నారు అని భావించాలి.
ఇంతకీ కాపుల సమస్యకి పరిస్కారం ఏమిటి?
- కమ్మ వ్యతిరేకత (Anti Kamma)-రెడ్ల మీద ప్రేమ లేదా రెడ్డి వ్యతిరేకత (Anti Reddy) -కమ్మల మీద ప్రేమతో కొట్టుకు చేస్తున్న కాపులు ఈ వాస్తవాలు తెలిసికోవాలి.
- రాజకీయాల్లో ఎత్తులు-పై ఎత్తులు సర్వ సాధారణం. కమ్మ వర్గం గాని రెడ్డి వర్గం గాని అధికారాన్ని మనకి ఇవ్వరు. దాన్ని సాధించుకోవడానికి కాపులే ఎదగాలి. సాధించుకోవాలి.
- మన కాపు నాయకులు, ఉద్యమ నాయకులు, కాపు కులసంఘాల అవగహన రాహిత్యం వల్ల మనం రాజ్యాధికారాన్ని ఎలా కోల్పోతున్నామో నేటికైనా అర్ధం చేసికోగలగాలి.
- మన జాతికి జరుగుతున్న అన్యాయాలు గురించి, మోసాల గురించి తెలిసికొని రాజ్యాధికార సాధనకు ప్రతిఒక్కరూ పునరంకితం అవ్వాలి.
- సాటి అణగారిన వర్గాలతో చేయి చేయి కలిసి తిరగాలి. పాలక వర్గాలతో వ్యూహాత్మకంగా వెళ్ళాలి తప్ప ఆవేశంతో కాదు.
- మిగిలిన అగ్ర వర్ణాల మనస్సులను మనకి అనుకూలంగా మార్చుకోవాలి.
- దీనికి కారకులు రెడ్డి పెద్దలు. ఆ తారువాత కమ్మ వర్గపు పెద్దలు అని ద్వేషించుకోవడంలో ప్రయోజనం లేదు.
- అలానే వీరికి సహకరిస్తున్న మన కుల నాయకులను, ఉద్యమ నాయకులను, కుల సంఘాలను తిట్టడంలోను ఉపయోగం లేదు.
ఎలెక్షన్లకోక పార్టీకి మద్దతు నివ్వడమేనా?
దొడ్ల పంచనే కొనసాగడమా లేక కమ్మని పెద్దల వెంట పోదామా అనే బానిస ఆలోచనలను నేటికైనా మానాలి. మారండి అంటున్న మన కుల నాయకులను మందలించాలి. ఒకరి పంచన లేదా ఒకరి గట్టున మనం ఉండడం ఏమిటి? మన గట్టున మనమే ఉందాం. సోదర కులాలతో కలిపి, మన పార్టీని మనమే గెలిపించి కొందాం అనే ఆలోచనకు ఇప్పటికైనా రావాలి. దీనికి కుల నాయకులు, కుల సంఘాలు, ఉద్యమ నాయకులు మన పార్టీలకు సహకరించాలి.
సాటి అణగారిన వర్గాలతో (Suppressed classes) కలిసి అధికారాన్ని సాధించి, అధికార ఫలాలను సమానంగా మనమంతా పంచుకోవాలి. ఇందులో కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి అన్న పవన్ కళ్యాణ్’కు చేదోడుగా ఉండాలి. అవసరమైతే ప్రజాస్వామ్య పద్ధతుల్లో మనమంతా ఉద్యమించాలి.
ఇప్పటికైనా కాపులంతా కలిసికట్టుగా (Unity in Kapus) పోరాడి రాజ్యాధికారం సాధించకోకపోతే భావి తరాలు కూడా బానిసల్లా మిగిలి పోవాల్సిందే? ఇదే జరిగితే ఆఫ్రికాలో (Africa) ఉన్న కొన్ని బానిసజాతుల వలే కాపుల భావి తరాల మనుగడ కూడా ప్రశ్నర్ధకం అవుతుందేమో? ఆలోచించండి.