* అందరికీ పడని కళ్యాణ్ అని నాడు అన్నారు – అందరికీ పవర్ నిచ్చే పవన్ కళ్యాణ్ అని నేడు అంటున్నారు.
* నాడు పవన్ కి తిక్కెక్కువ అన్నారు – పవన్ తిక్కే వ్యవస్థలకు కిక్కు అని నేడు అంటున్నారు.
* అన్న కాంగ్రెస్ చుట్టూ తిరిగాడు. తమ్ముడు బీజేపీ చుట్టూ తిరుగుతాడు అని నాడు అన్నారు – బీజేపీనే తన చుట్టూ తిరిగేటట్లు తమ్ముడు భలే చేసికొన్నాడు అని నేడు అంటున్నారు.
* పవన్ కళ్యాణ్ ది కొందరి పార్టీనే అని నాడు అన్నారు – జనసేన అంటే అందరి శ్రేయస్సు కోరే పార్టీ అని నేడు అంటున్నారు.
* పవన్ వెనుక తన కులపోల్లే లేరు అని నాడు అన్నారు – సనాతన ధర్మమే కాదు. యావత్తు మార్పునే సేనాని వెనుక ఉన్నదీ అని నేడు అంటున్నారు.
* చంద్రబాబు వెనుక కళ్యాణ్ బాబు అని నాడు అన్నారు – కళ్యాణ్ బాబు వెనుకనే చంద్ర బాబు అన్నంత స్థాయికి జనసేనాని ఎదిగాడు అని నేడు అంటున్నారు.
సీఎంని చేస్తే ఈ భూమిమీద నిలబడతావా
* నిన్ను సీఎంని చేస్తే ఈ భూమిమీద నిలబడతావా అని నాడు అన్నారు – నువ్వు సీఎంవి కాకపోతే మేము మా వ్యవస్థలు భూమి మీద నిలబడలేము అని నేడు అంటున్నారు.
* పవన్ కళ్యాణ్ కి స్టెబిలిటీ లేదు అని నాడు అన్నారు – రాష్ట్రానికి, దేశానికి స్టెబిలిటీ నిచ్చేది పవన్ కళ్యాణ్ ఒక్కడే అని నేడు అంటున్నారు.
* పవన్ కళ్యాణ్ ని కుల రక్షకుడు మాత్రమే అని నాడు అన్నారు – పవన్ కళ్యాణ్ అంటే భావి భారత పరిరక్షకుడు అని ఒప్పుకోలేకనే ఒప్పుకొని నేడు చెప్పుకొంటున్నారు.
* పవన్ కళ్యాణ్ కి పార్టీని నడిపే అంత శక్తి లేదు అని నాడు అన్నారు – పవనేశ్వరా! మీ శక్తిని మీరు తెలిసికోండి. సీఎం అయ్యి మా రాష్ట్రాన్ని కాపాడండి అని నేడు అంటున్నారు.
* పవన్ కళ్యాణ్ అంటే తుఫాన్ అని దేశీయులు అంటున్నారు – పవన్ అంటే ఆ తుఫాన్లను సృష్టించే పరమేశ్వరుడి ప్రియపుత్రుడు పవనేశ్వరుడు అని అక్షర సత్యం లాంటివారి వాదన.
* సనాతన ధర్మ పరిరక్షకుడిగా సేనానిని ఎలా కొనియాడాలి అని జాతీయ మీడియా ఆలోచిస్తుంటే – సేనానిని ఎలా తొక్కేయాలి అని తెలుగు కుల మీడియా కుట్రలు పన్నుతున్నది.
ఆలోచించండి… పవన్ కళ్యాణ్ అంటే అంజనీ పుత్రుడు. తన శక్తిని తానూ తెలిసికోగలితే మార్పు తధ్యం అని దశాబ్దంగా చెబుతున్న అక్షర సత్యం వ్యాఖ్యలు నేడు అక్షర సత్యం అయ్యాయి! (It’s from Akshara Satyam)