Global investors summitGlobal investors summit

విశాఖలో జరగబోతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’పై (AP Global Investors Summit) జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ట్వీట్ల వర్షం కురిపించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (Andhra Pradesh Global Investors Summit) విజయవంతం కావాలనే ఆశాభావాన్ని పవన్ కళ్యాణ్ వ్యక్తం చేసారు. విజయవంతం కావాలంటే వైసీపీ ప్రభుత్వం ఎలా నడుచుకోవాలో అంటూ చురకలు అంటించారు.

రాబోయే రెండు రోజుల్లో వైసీపీ ప్రభుత్వంపై జనసేన పార్టీ ఎటువంటి విమర్శలు చేయబోదు. ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతం అవ్వడానికి పూర్తిగా సహకరిస్తాం అంటూ తమ ట్వీట్లలో వివరించారు.

జనసేనాని పవన్ కళ్యాణ్ ట్వీట్ల సారాంశం:

1) దేశవిదేశాల నుంచి ప్రకృతి అందాలతో అలరారే విశాఖ నగరానికి వస్తున్న పెట్టుబడిదారులందరికీ జనసేన పార్టీ స్వాగతం పలుకుతోంది. మా శక్తివంతమైన, అనుభవం కలిగిన ఆంధ్రప్రదేశ్ యువత మిమ్మల్ని మెప్పిస్తారని భావిస్తున్నాను. ఈ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ ద్వారా రాష్ట్రానికి మంచి భవిష్యత్తు మన యువతకు ఉపాధిని అందించే అవకాశం కల్పించగలడు. అవకాశాలు కల్పించడంతోపాటు ఇన్వెస్టర్లు కూడా తమ పెట్టుబడులకు తగిన ప్రతిఫలం పొందుతారని ఆశిస్తున్నాను.

2) వైసీపీ ప్రభుత్వానికి నా హృదయపూర్వక విన్నపం

ఏపీలో ఆర్థికవృద్ధికి ఉన్న అవకాశాలు, శక్తివంతమైన మానవ వనరులు, ఖనిజ సంపద, సముద్రతీరం వంటి వాటిని ఇన్వెస్టర్లకు సవివరంగా వివరించండి. రివర్స్‌ టెండరింగ్‌, మధ్యవర్తుల కమీషన్లు వంటి అడ్డంకులు ఏవీ లేకుండా పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలిగించండి!

3) ఒక్క ప్రాంతానికే పరిమితం చేయకండి:

ఈ సమ్మిట్‌ ఆలోచనలను కేవలం వైజాగ్‌కే పరిమితం చేయకండి. తిరుపతి, అమరావతి, అనంతపురం, కాకినాడ, శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడప లాంటి ఆంధ్రప్రదేశ్ లోని ఇతర ప్రాంతాలలో ఉన్న అభివృద్ధి అవకాశాలను కూడా ఇన్వెస్టర్లకు వివరించండి. దీన్ని కేవలం ఒక నగరానికే పరిమితం చేయకుండా ఏపీ మొత్తానికి నిజమైన ఇన్వెస్టర్ల సమ్మిట్‌’లాగా మార్చండి.

4) ఇక చివరిగా

రానున్న రెండు రోజుల్లో ప్రభుత్వంపై జనసేన ఎలాంటి విమర్శలకు చోటివ్వదు. ఇన్వెస్టర్ల సమ్మిట్‌ విషయంలో ప్రభుత్వం ఎటువంటి రాజకీయ విమర్శలు చేయం. పెట్టుబడుల ఆకర్షణ అంశంలో ప్రభుత్వానికి సంపూర్ధ మద్దతును అందిస్తోంది. ఇన్వెస్టర్ల సమ్మిట్‌ సందర్భంగా ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియచేస్తోంది. రాజకీయం కంటే రాష్ట్రం మిన్న. #JSP4AP JanaSena పార్టీ అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.

సోషల్ మీడియా స్పందన

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’పై పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’పై పవన్ కళ్యాణ్ వైఖిరిపై కొందరు వైసీపీవారు విమర్శ చేస్తుండగా… సామాన్యులు మాత్రం పవన్ కళ్యాణ్ వైఖిరిని మెచ్చుకొంటున్నారు.

జనసేనానిని ఎవరు ఎన్నివిధాలుగా విమర్శ చేసినా పవన్ కళ్యాణ్ ఆలోచన ఎప్పుడూ ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి అనుకూలంగానే ఉంటుంది. దానికి నిదర్శనమే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’పై పవన్ ట్వీట్ల సారాంశం అంటూ పలువురు మెచ్చుకొంటున్నారు.

మచిలీపట్నం వేదికగా జనసేన 10వ ఆవిర్భావ సభ

Spread the love