RosaiahRosaiah

ఉదయం నిద్రలేవకపోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి
నివాళులర్పించిన సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణ
నేడు గాంధీభవన్‌కు భౌతికకాయం

ఆర్ధిక దురంధరుడు, అపర చాణిక్యుడు అయిన రోశయ్య (Rosaiah) పార్థివ దేహానికి నేడు అంత్య క్రియలు (Funerals) జరగనున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ (Combined Andhra Pradesh) ముఖ్యమంత్రిగా (Chief minister), తమిళనాడు గవర్నర్‌గా  (Tamilnadu Governor) రోశయ్య సేవలు అందించారు. అటువంటి రాజనీతిజ్ఞుడు, రాజకీయ దురంధరుడు కొణిజేటి రోశయ్య (Konijeti Rosaiah) కన్నుమూశారు.

శనివారం ఉదయం ఇంట్లో ఆయనకు బీపీ (BP) తగ్గి పల్స్‌ (Pulse) పడిపోయింది. దేనితో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన బంజారాహిల్స్‌లోని స్టార్‌ ఆసుపత్రికి (Star Hospital) తరలించారు. దారిలోనే ఉదయం 8.20 గంటల ప్రాంతంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి

రోశయ్యకు భార్య శివలక్ష్మి, కుమారులు శివ, మూర్తి, కుమార్తె రమాదేవి ఉన్నారు.ఆయన మృతి సమాచారం తెలియడంతో పలువురు రాజకీయ ప్రముఖులు (Political Stalwarts)  తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పార్టీలకతీతంగా పలువురు ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుని భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అయన నివాస ప్రాంతమైన అమీర్‌పేట ధరమ్‌కరం రోడ్డులో విషాద ఛాయలు అలముకున్నాయి.

సుప్రీంకోర్టు (Supreme Court) ప్రధాన న్యాయమూర్తి (Chief Justice) జస్టిస్‌ ఎన్‌వీ రమణ (N V Ramana), ముఖ్యమంత్రి (Chief Minister) కేసీఆర్‌ (KCR) భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర రాజకీయ ప్రముఖులు కూడా భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి (Jagan Mohan Reddy) రోశయ్య కుటుంబసభ్యులను ఫోన్‌లో పరామర్శించారు. కుమారులు, కుమార్తెతో మాట్లాడి ఓదార్చారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి కారణంగా శనివారం నుంచి సోమవారం వరకు మూడు రోజులపాటు సంతాప దినాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు ప్రకటించాయి.

నేడు గాంధీభవన్‌కు భౌతికకాయం

ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు రోశయ్య భౌతికకాయాన్ని గాంధీభవన్‌కు (Gandhi Bhavan) తీసుకువస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలియ చేశాయి. మధ్యాహ్నం 12.30 వరకు ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దూతగా రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే గాంధీభవన్‌లో రోశయ్యకు నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత రోశయ్య పార్థివ దేహానికి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది.

భారీగా తరలివచ్చిన నేతలు

ఆసుపత్రి నుంచి ఉదయం 10.30గంటలకు రోశయ్య భౌతిక కాయాన్ని నివాసానికి తరలించారు. మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ నివాళి అర్పించారు. వీరితో పాటు శ్రీనివాస్‌గౌడ్‌ పలువురు ఎమ్మెల్యేలు, కేవీపీ రామచంద్రరావు, తెలంగాణ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు… తదితరులు పార్థివ దేహానికి నివాళి అర్పించారు. తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, మధుయాస్కీగౌడ్‌, మహేశ్వర్‌రెడ్డి, తదితరులు సంతాపం తెలిపారు.

రోశయ్య కుటుంబాన్ని పరామర్షించిన సోనియా

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi), అగ్రనేత రాహుల్‌గాంధీలు (Rahul Gandhi) రోశయ్య మరణం పట్ల వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. రోశయ్య కుమారుడు శివసుబ్బారావుతో సోనియా ఫోన్‌లో మాట్లాడి ప్రగాఢ సంతాపం తెలిపారు.

ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం రోశయ్య కన్నుమూత