అంజనీపుత్రా! బాబుని (Chandra Babu) కలవడం అనేది మెగా వ్యూహం (Mega Strategy) అయితే నువ్వు దేవుడవు అవుతావు. సింహాల చరిత్రలో (History of Lions) చిరస్థాయిగా మిగిలిపోతావు. ఒకవేళ ఇది మెగా మోసం (Poll Alliance with TDP) అయితే సింహాలను బలి తీసికొంటున్న వేటగాళ్ల పాలేరుగా ముద్ర వేసికొంటావు.
ఎందుకంటే…
జనసేన పార్టీ (Janasena Party) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తెలుగు దేశం పార్టీ (Telugudesam) అధినేత చంద్రబాబు (Chandra Babu) ఇంటికి వెళ్లి కలవడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. అసలు పవన్ వ్యూహాలు ఏమిటో అర్ధం కాక వైసీపీ నాయకులు, ఇటు రాజకీయ పండితులు తలలు పట్టుకొని చర్చలతో కొట్టుకు చస్తున్నారు. మరొక పక్కన పవన్ కళ్యాణ్’ని అభిమానించే వారు కూడా ఏడవలేక నవ్వు నటిస్తున్నారు.
మొగుడు కొట్టినందుకు కాదు తోటికోడలు దెప్పినందుకు అన్నట్లు వైసీపీలోని కుల నాయకులు చేస్తున్న విష ప్రచారానికి జనసైనికులు ఏడవలేక నవ్వు నటిస్తున్నారు. మీకు చెప్పుకోలేక చెప్పు ఇచ్చుకొని కుల నాయకులను కొట్టలేక, అలానే తాము కొట్టుకోలేక, బాబు ఆధిపత్యాన్ని అంగీకరించలేక తమలో తామే కుమిలి పోతున్నారు.
వైసీపీ కన్నీటికి కారణం:
జనసేన-టీడీపీ కలిసి పోటీచేస్తే వైసీపీ తప్పకుండా ఓడిపోతుంది. వైసీపీ ఉనికే ప్రమాదంలో పడుతుంది. కావున జనసేన-టీడీపీ కలవకుండా ఉండడం కోసం వైసీపీ కాపు యువతని, కాపు మేధావులను రెచ్చగొడుతున్నది. వైసీపీ తనం ఉనికిని కాపాడుకోవడం కోసం శాయశక్తులా కాపులను రెచ్చగొడ్డడం కృషి చేస్తుంది.
జనసేన-బీజేపీతో కలిసి పోటీ చేస్తే, వైసీపీ విజయం ఖాయం. బీజేపీ కోరుకొంటున్నది కూడా ఇదే. అందుకే బీజేపీతో కలిసి జనసేన కలిసి పోటీచేయాలి గాని టీడీపీతో ఉండ కూడదు అని వైసీపీ భాదీరద ప్రయత్నం చేస్తాది.
వైసీపీలోని కుల నాయకుల కన్నీటికి కారణం:
జనసేన-తెలుగు దేశం అధికారాన్ని సరి సగం పంచుకొనేటట్లు పొత్తులు ఉండబోతున్నాయి అని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం వైసీపీ నాయకుల వద్ద ఉంది. అదే జరిగితే వైసీపీలో ఉన్న కులనాయకులు జనసేన పార్టీనిగాని, పవన్ కళ్యాణ్’ని విమర్శ చేయడానికి వీలు ఉండదు. సేనానిని విమర్శ చేయకపోతే తమ నాయకుడు వదలడు. విమర్శ చేస్తే ప్రజలు ఊరుకోరు. అందుకే టీడీపీతో జనసేన పొత్తు ఉండకూడదు అని కుల నాయకులు కుల పెద్దలు కోరుకొంటున్నారు.
పొత్తులతో పవన్ కళ్యాణ్ సీఎం అయిపోతే మా కుల నాయకుల, కుల సంఘాల, ఉద్యమ పెద్దల అవసరం కులానికి ఉండదు. అప్పుడు మా కుల నాయకుల ఉనికే ప్రమాదంలో పడుతుంది అని కుల నాయకులు ఆందోళనలో ఉన్నారు. వీరికి టీడీపీతో జనసేనకు మద్దతు ఉండకూడదు అని కోరుకొంటున్నారు.
పవన్ మద్దతుదారుల కన్నీటికి కారణం
చేతిలో చిల్లి గవ్వ లేక పోయినా, ప్రశ్నిస్తే పోలీసు కేసులు పెడతారు అనే వత్తిడులు ఉన్నాగాని సేనాని వెంట నడుస్తున్నది సేనానిని సీఎం చెయ్యాలి అని గాని చంద్రబాబుని సీఎం చెయ్యాలి కాదు అని పవన్ మద్దతుదారులు ఆవేదన చెందుతున్నారు.
చంద్రబాబుతో పొత్తుపెట్టుకొన్న పార్టీలుగాని, నాయకులుగాని నాశనం అయ్యారేగాని, బాగుపడ్డ ధాఖలాకు ఇప్పటివరకు లేవు అని జనసనికులు ఆందోళనలో ఉన్నారు.
చంద్రబాబు కుటిల వ్యూహాల ముందు పవన్ కళ్యాణ్ నిజాయితీ పని చేస్తుందా? అసలు బాబు పవన్’ నాయకత్వాన్ని ఒప్పుకొంటాడా? అసలు పవన్ పార్టీలోని వారిని గెలవనిస్తాడా ? గెలిస్తే సీఎం కానిస్తాడా? అని బాబు నైజం తెలిసున్నవారు ఆవేదన చెందుతున్నారు.
పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పొత్తు పెట్టుకొంటే జరగబోయేది ఏమిటంటే?
పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బాబు అంగీకరించినా లేదా సమ భాగస్వామ్యంలో అధికారాన్ని పంచుకొనే రీతిలో టీడీపీ జనసేన పొత్తులు ఉన్నాగాని కుల నాయకులు గాని ఉద్యమ నాయకులు గాని సేనానికి మద్దతునివ్వరు. కానీ తేలుకుట్టిన దొంగల్లా కిక్కురు మానకుండా తమలో తామే ఏడుస్తూ ఉంటారు.
ఒకవేళ పవన్ కళ్యాణ్ మునుపటి లాగానే చంద్ర బాబుకి బేషరతుగా మద్దతు నిస్తే
కుల నాయకులు, ఉద్యమ నాయకులు, కుల సంఘాలు, కుల మేధావులు తీవ్రమైన విష ప్రచారాన్ని చేయడం మొదలు పెడతారు. వారు చేయబోయే విష ప్రచారంలో జనసేన మరుగున పడిపోవడం ఖాయం.
అలానే కుల పెద్ద, ఉద్యమ పెద్ద సేనానిపై విరుచుకు పడడం కోసం అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. పవన్ బాబుకి మరొక్క సారి మద్దతునిస్తే తన “ముద్ర” తో సేనానిని :గడ” గడ లాడించడానికి పెద్దాయన వ్యూహాలు పన్నుతున్నట్లు సమాచారం ఉంది. మెగా ఫామిలీపై బురద చల్లడం కోసం “పెద్దాయన” ఆ రెండు పార్టీల పంచన చేరినా చేరవచ్చు. మరి కొద్దీ రోజుల్లో అవి బయట పడబోతున్నాయి.
కమ్మ ఆధిపత్యాన్ని, చంద్రబాబు నైజాన్ని ఇష్టపడని పవన్ మద్దుతుదారులు మౌన ముద్రలోకి పోతారు. జనసేన పార్టీ నుండి మెల్ల మెల్లగా జారిపోయి తమ పనులు తాము చేసికొంటారు.
కోసం మెరుపు:
జనసేనాని పవన్ కళ్యాణ్ చంద్రబాబు మద్దతు తీసికోగలిగితే, ఆ బాబు మద్దతుతో జనసేన పార్టీని అధికారంలోకి తెచ్చి తాను ముఖ్యమంత్రి కాగలితే చరిత్ర తిరగ రాస్తాడు. ఉద్యమ నాయకుల, కుల నాయకుల నోర్లకి శాశ్వతంగా తాళం వేయగలుగుతాడు.
అలా కాకుండా విష సర్పం లాంటి చంద్రబాబు మనోహరమైన మాటల గారడితో పడి బాబుని సీఎం చేయడానికే సేనాని మరొక్కసారి ఒప్పుకొంటే పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ మరుగున పడిపోతాయి. నేడు ముద్రగడని, కులనాయకులను తిట్టేవారే రేపు పవన్ కళ్యాణ్ కూడా తిట్టడం మొదలు పెడతారు. ఇదే అక్షర సత్యం.
ఆలోచించండి… ఇది ఆవేశంతో రాసింది కాదు. దశాబ్దాలుగా మోసపోతున్న అణగారిన వర్గాల మనోరక్తంతో రాసిన కన్నీటి మెగా వేడుకోలు. (Akshara Satyam)