CI Bala SureshCI Bala Suresh

అనన్య సినిమా కార్యాలయం ప్రారంభోత్సవంలో సి ఐ బాల సురేష్

జంగారెడ్డి గూడెం: నూతన నటీనటులను ప్రోత్స హించడం వల్ల సమర్ధులైన వారు సినిమాల్లో ప్రవేశించి తమ టాలెంట్’ను రుజువు చేసుకుంటారని ఇపుడున్న మేటినటులు అందరూ అలా ఉన్నత స్థానాన్ని చేరుకున్వవారేనని జంగారెడ్డి గూడెం (Jangareddygudem) పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (Circle Inspector) బాల సురేష్ అన్నారు.

శ్రీ వర్మ మూవీస్ బేనర్ పై బుద్దాల సత్యనారాయణ నిర్మిస్తున్న హర్రర్ చిత్రం “అనన్య” (Ananya) సినిమా కార్యాలయంను సోమవారం పట్టణ సబ్ ఇన్స్ పెక్టర్ సాగర్ బాబు రిబ్బన్ కత్తి రించి ప్రారంభించారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ బాల సురేష్ జంగారెడ్డి గూడెం ప్రాంతంలో కొత్త వారితో నిర్మాణం జరుపు కుంటున్న ఈ చిత్రం విజయ వంతం కావాలని ఆకాంక్షించారు. ఇది ఎంతో గొప్ప విషయం అని ఈ ఏరియాలో సినిమాలు నిర్మించడం విశేషం అని అన్నారు.నిర్మాత, దర్శకులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఎస్ ఐ సాగర్ బాబు మాట్లాడుతూ ఆత్మ కాన్సెప్ట్’తో వచ్చిన అనేక చిత్రాలు (Movies) సక్సెస్ అయ్యాయని ఈ సినిమా కూడా అదే కోవలోనిదని తెలిసిందని ఈ చిత్రం కూడా విజయ వంతం కావాలని కోరారు. డైరెక్టర్ తనకు సినిమా కథ క్లుప్తంగా చెప్పారని దాన్ని బట్టి తాను అంచనా వేస్తున్నానన్నారు. సినిమా విజయవంతం కోసం ప్రతివారు కష్ట పడాలి అని కోరారు.

నూకాలమ్మ ఆలయం (Nukalamma temple) చైర్మన్ డా.రాజాన సత్యనారాయణ (పండు) నిర్మాత బుద్దాల సత్యనారాయణ మాట్లాడారు.డైరెక్టర్ బి ప్రసాద్ మాట్లాడుతూ కొత్త పాత వారి మేలు కలయిక లో ఈ చిత్రం నిర్మాణం జరుపు కుంటున్నదని వివరించారు. ఈ నెల 21 నుంచే రెగ్యులర్ షూటింగ్ జంగారెడ్డి గూడెం పరిసరాల్లో జరుగుతుందని తెలిపారు. 6,7 తేదీల్లో నూతన నటీనటుల కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆసక్తి కలిగినవారు హాజరు కావచ్చునన్నారు.

కార్యక్రమంలో భాగంగా సినిమా బౌడ్ స్క్రిప్ట్ ను డైరెక్టర్ బి.ప్రసాద్ కు సి ఐ బాల సురేష్ అందజేశారు. ఈ సందర్భంగా అతిధులను శాలువాతో సత్కరించి మెమెంటోలు బహుకరించారు. నిర్మాత బుద్దాలను సి ఐ, ఎస్ఐ తదితరులు ఘనంగా సత్కరించారు.

కార్యక్రమంలో రాష్ట్ర రంగ స్థల కళాకారుల సంఘం అధ్యక్షుడు ఎల్ ఆర్ కృష్ణ బాబు, బిజెపి రాష్ట్ర ఓ బి సి ఉపాధ్యక్షుడు లకనవరపు భోగేశ్వర్ హీరో వెంకట్,అంబికా దుర్గారావు, పెసరగంటి త్రిమూర్తులు, చందన బ్రదర్స్ మేనేజర్ ఏ. బ్రహ్మనంద రావు ప్రభృదులు పాల్గొన్నారు.

–Garuvu Baburao from Jangareddygudem

పిల్లి సుభాష్ చంద్రబోస్’కి వినతిపత్రం ఇస్తున్న ఆయిల్ ఫామ్ రైతులు