cabinet expansioncabinet expansion

15 మంది కేబినెట్‌ మంత్రులు, 28 మంది సహాయమంత్రులు

కేంద్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ (Modi Cabinet Expansion) నేడు రాష్ట్రపతి భవన్’లో (Rastrapati Bhavan) జరిగింది. కొత్తగా నియమితులైన కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం రాష్ట్రపతి (Rastrapati) చేతుల మీదుగా జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కొత్త మంత్రులతో నేడు ప్రమాణం చేయించారు. 15 మంది కేబినెట్‌ మంత్రులు, 28 మంది సహాయమంత్రులు నేడు ప్రమాణం చేసారు. తొలుతగా నారాయణ్‌ రాణే ప్రమాణం చేసారు. చివరగా నిషిత్‌ ప్రామాణిక్‌తో రాష్ట్రపతి ప్రమాణం చేయించారు.

రాష్ట్రపతి భవన్‌ వేదికగా కొవిడ్‌ నిబంధనల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. దీనికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్‌ షా, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ప్రధాని మోదీ రెండో సారి అధికారంలో వచ్చిన తర్వాత చేపట్టిన తొలి మంత్రివర్గ విస్తరణ ఇదే కావడం విశేషం.

నేడు ప్రమాణం చేసిన మంత్రులు:

నారాయణ్‌ రాణే: భాజపా(మహారాష్ట్ర)
శర్వానంద సోనోవాల్‌ : భాజపా(అసోం)
డా. వీరేంద్ర కుమార్‌: భాజపా(మధ్యప్రదేశ్‌)
జ్యోతిరాదిత్య సింధియా: భాజపా (మధ్యప్రదేశ్‌)
రాంచంద్ర ప్రసాద్ సింగ్‌: జనతాదళ్‌ యునైటెడ్‌(బిహార్‌)
అశ్వినీ వైష్ణవ్‌ : భాజపా (ఒడిశా)

పశుపతి కుమార్‌ పరాస్‌ : లోక్‌ జనశక్తి (బిహార్‌)
కిరణ్‌ రిజిజు : భాజపా (అరుణాచల్‌ ప్రదేశ్‌)
రాజ్‌ కుమార్‌ సింగ్‌ : భాజపా(బిహార్‌).
హర్‌దీప్‌ సింగ్‌ పూరి : భాజపా (దిల్లీ)
మన్‌సుఖ్‌ మాండవీయ: భాజపా (గుజరాత్‌)
భూపేంద్ర యాదవ్‌: భాజపా (రాజస్థాన్‌)
పురుషోత్తం రూపాలా: భాజపా (గుజరాత్‌)
కిషన్‌ రెడ్డి : భాజపా (తెలంగాణ)

అనురాగ్ సింగ్‌ ఠాకూర్‌ : భాజపా(హిమాచల్‌ ప్రదేశ్‌)
పంకజ్‌ చౌధరీ : భాజపా (ఉత్తర్‌ ప్రదేశ్‌)
అనుప్రియా సింగ్‌ పటేల్‌ : అప్నాదళ్ (ఉత్తర్‌ ప్రదేశ్‌)
డా. సత్యపాల్‌ సింగ్‌ భగేల్‌: భాజపా (ఉత్తర్‌ ప్రదేశ్‌)
రాజీవ్‌ చంద్రశేఖర్‌ : భాజపా (కర్ణాటక)
శోభ కరంద్లాజే : భాజపా (కర్ణాటక)
భాను ప్రతాప్‌ సింగ్‌ వర్మ : భాజపా (ఉత్తర్‌ ప్రదేశ్‌)
దర్శన విక్రమ్‌ జర్దోష్‌ : భాజపా (గుజరాత్‌)

మీనాక్షి లేఖి : భాజపా (దిల్లీ)
అన్నపూర్ణ దేవీ యాదవ్‌ : భాజపా (ఝార్ఖండ్‌)
ఎ.నారాయణస్వామి : భాజపా (కర్ణాటక).
కౌశల్ కిశోర్‌ : భాజపా (ఉత్తర్‌ ప్రదేశ్‌)
అజయ్‌ భట్‌ : భాజపా (ఉత్తరాఖండ్‌)
బి.ఎల్‌ వర్మ : భాజపా (ఉత్తర్‌ ప్రదేశ్‌)

అజయ్‌ కుమార్‌ మిశ్రా : భాజపా (ఉత్తర్‌ ప్రదేశ్‌)
దేవ్‌సింహ్‌ చౌహన్‌ : భాజపా (గుజరాత్‌)
భగవంత్‌ కుభా : భాజపా( కర్ణాటక)
కపిల్‌ మోరేశ్వర్‌ పాటిల్‌ : భాజపా (మహారాష్ట్ర)
ప్రతిమా భౌమిక్‌ : భాజపా (త్రిపుర)
డా. సుభాష్‌ సర్కార్‌ : భాజపా (పశ్చిమ్‌బంగాల్‌ )
డా. భగవత్‌ కిషన్‌రావ్‌ కరాద్‌ : భాజపా (మహారాష్ట్ర)

డా. రాజ్‌కుమార్‌ రంజన్‌ సింగ్‌ : భాజపా(మణిపూర్‌)
డా. భారతి ప్రవీణ్‌ పవార్‌ : భాజపా (మహారాష్ట్ర).
భిశ్వేశ్వర్‌ తుడు : భాజపా (ఒడిశా)
శంతను ఠాకూర్‌: భాజపా (పశ్చిమ్‌ బంగాల్‌)
డా. ముంజపరా మహేంద్రభాయ్‌: భాజపా (గుజరాత్‌)
జాన్‌ బార్లా : భాజపా (పశ్చిమ్‌ బంగాల్‌)
డా. ఎల్‌ మురుగన్‌: భాజపా (తమిళనాడు)
నిషిత్‌ ప్రామాణిక్‌ : భాజపా (పశ్చిమ్‌ బంగాల్‌).

Best Wishes to Kambampati Hari Babu and Bandaru Dattatreya

Spread the love