Notice to Pawan KalyanNotice to Pawan Kalyan

జనసేన పార్టీ (Janasena Party) అధినేత పవన్ కళ్యాణ్’కి (Pawan Kalyan) విశాఖ పోలీసులు (Visakha Police) నోటీసులు జారీచేయారు. ఆదివారం సాయంకాలంలోగా విశాఖ (Visakha) ఖాళీ చేసే వెళ్లాలని పోలీసులు ఆదేశించారు అని చెబుతున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులపైనా (YCP Leaders), ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపైన (AP CM Jagan Mohan Reddy) పలు కీలాపమైన ఆరోపణలు చేసారు.

జనసేనాని చేసిన కీలకమైన ఆరోపణలు/సమాధానాలు:

నేను కానీ, జనసేన పార్టీ కానీ వైఎస్‌ఆర్‌పార్టీ (YSRCP) తాటాకు చప్పుళ్లకు, వారి బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదు. ఎన్నో తట్టుకుని నిలబడిన వాళ్ళం, మార్పు కోసం వచ్చిన వాళ్ళం, మీరెంత.

పోలీస్ వ్యవస్థ అంటే గౌరవం లేని వ్యక్తి వైఎస్ జగన్, అలాంటి వ్యక్తికి సలాం కొడుతున్నారు పోలీసు వారు. మీ పరిస్థితి నేను అర్దం చేసుకోగలను, కానీ మీరు కూడా పరిస్థితులు అర్దం చేసుకోవాలి

దేశంలో గంజాయి సాగులో రాష్ట్రం నెంబర్ 1 గా ఉంది, గంజాయి దొంగలను పట్టుకోవాలి, మా జనసేన నాయకులను కాదు.

గంజాయి సాగు చేసే వారిని వదిలేసి, ప్రజాస్వామికంగా రాజకీయం చేసే మమ్మల్ని అరెస్టులు చేస్తారా? రాత్రి 4గంటల వరకు హోటల్ లోపల పోలీసులకి ఏం పని? వందల మంది పోలీసులతో అరెస్టులు చేయడం, భయపెట్టాలని చూడటం ఎందుకు.

నేను వైఎస్‌ఆర్‌పార్టీ నాయకుల అక్రమాల గురించి మాట్లాడాలంటే జీవితకాలం సరిపోదు, అన్ని అక్రమాలు చేశారు.

కోడి కత్తి వాళ్ళే పొడిపించుకుని కేసులు పెట్టినట్టు, విశాఖలో మంత్రులపై వాళ్ళే దాడులు చేయించుకుని విశాఖలో శాంతిభద్రతల సమస్య సృష్టించి మాపై వేయాలని చూస్తున్నారు వైఎస్‌ఆర్‌పార్టీ నాయకులు. లేదంటే సెక్యూరిటీ ఎందుకు లేదు?

విశాఖపట్నం నోవాటెల్ హోటల్ వద్ద పీఏసీ సభ్యులు పంతం నానాజీ,అమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు, షేక్ రియాజ్,బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, చిలకం మధుసూదన రెడ్డి, కమల్, పితాని బాలకృష్ణ గార్లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు.

151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉన్న వైఎస్‌ఆర్‌పార్టీ ప్రభుత్వాన్ని సమస్యలు పరిష్కరించమని అడిగితే , బూతుల పంచాంగం చదువుతున్నారు

విశాఖపట్నం నోవేటల్ హోటల్ వద్ద పీఏసీ సభ్యులు పంతం నానాజీ,అమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు, షేక్ రియాజ్,బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, చిలకం మధుసూదన రెడ్డి, కమల్, పితాని బాలకృష్ణ గార్లను అక్రమంగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలిస్తున్న పోలీసులు. ఎందుచేత?

జనవాణి కార్యక్రమాన్ని మా నాయకులు లేకుండా చేయం. వాళ్లు బయటకు వచ్చే వరకు వేచి ఉంటాం. ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిన మా నాయకులను బేషరతుగా విడుదల చేయాలి

సమస్యలను తెలుసుకునే కార్యక్రమాలను అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పటికి 4 జనవాణి కార్యక్రమాలు చేశాం, ఎక్కడ పోలీస్ వారితో ఇబ్బంది లేదు, ఎందుకు ఇక్కడ ఇంతలా ఇబ్బందులు పె డుతున్నారు

గర్జించడం ఏంటి?

అధికారంలో ఉన్నవారు గర్జించడం ఏంటి? కడుపు కాలిన వాడు గర్జిస్తాడు. ప్రభుత్వంలో ఉండి గర్జిస్తామంటారేంటి

మా పార్టీ కార్యక్రమాలు ఎలా జరగాలో, ఏ ఊరు వెళ్ళాలో వైఎస్‌ఆర్‌పార్టీ నాయకులు మాకు చెప్పక్కర్లేదు, మీరెవరు మాకు చెప్పడానికి, మా కార్యక్రమాలు మేము డిసైడ్ చేసుకుంటాం

ఉత్తరాంధ్ర పర్యటన 3 నెలల క్రితం నిర్ణయించుకున్న కార్యక్రమం, మాకు వైసీపీ వారి కార్యక్రమాలను భగ్నం చేయాల్సిన అవసరం లేదు

నిన్న జరిగిన ర్యాలీలో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు పెట్టారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరించాల్సిన, సెక్యూరిటీ కల్పించాల్సిన పోలీసు వారు మమ్మల్ని నియంత్రించాలని చూసారు

సామాన్యుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, పరిష్కారానికి కృషి చేయాలనే ఉద్దేశంతోనే జన వాణి కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టడం జరిగింది. కానీ వైఎస్‌ఆర్‌పార్టీ ప్రభుత్వం అడ్డుకోవాలని చూడటం అప్రజాస్వామికం అంటూ పవన్ కళ్యాణ్ పలు కీలకమైన ఆరోపణలు చేసారు.

వైసీపీ ప్రభుత్వం పెట్టే బెదిరింపులకు భయపడి తగ్గేదే లేదు అన్నట్లు జనసేనాని చేసిన వివరణతో రాష్ట్రంలో ఒక కొత్త చర్చ మొదలు అయ్యింది అనే చెప్పాలి.

అడుగడుగునా ఆటంకం- అయినా సేనాని ర్యాలీ విజయవంతం