Gidugu RudrarajuGidugu Rudraraju

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (Andhra Pradesh Congress Committee) అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు (Gidugu Rudra Raju) నియమితులయ్యారు. గిడుగు రుద్రరాజును ఏపీసీసీ చీఫ్‌గా నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మస్తాన్ వలీ, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, పి.రాజేష్ రెడ్డిలను నియమించింది. ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్గా పల్లంరాజు నియమితులయ్యారు. క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా హర్షకుమార్‌ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది.

తనపై పార్టీ ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుంటానని గిడుగు రుద్రరాజు చెప్పారు. పార్టీ బలోపేతం దిశగా తగిన చర్యలు చేపడతామని రుద్రరాజు అన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ఎన్నికైన కొద్ది రోజుల్లోనే పార్టీని పటిష్టం చేసే దిశగా చర్యలు చేపట్టారు. ఈ దిశలోనే ఏపీసీసీ ప్రెసిడెంట్’గా గిడుగు రుద్రరాజుతో పాటు పార్టీ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు.

18 మందితో పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీని ఏర్పాటు చేసింది. 34 మందితో కోఆర్డినేషన్‌ కమిటీని నియమించింది.

వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా అధ్యక్షుడిగా మస్తాన్ వలి, సుంకర పద్మశ్రీ, జంగా గౌతమ్, రాకేశ్‌రెడ్డి, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌గా మాజీ ఎంపీ హర్షకుమార్‌, కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌గా మాజీ మంత్రి పల్లం రాజు, మీడియా, సామాజిక మాధ్యమాల కమిటీ చైర్మన్‌ బాధ్యతలను తులసిరెడ్డికి అప్పగించింది. ఈ మేరకు పార్టీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.

అంచెలంచెలుగా ఎదిగిన రుద్రరాజు

ఎన్ఎస్ యుఐ పట్టణ అధ్యక్షుడు నుంచి పిసిసి అధ్యక్షుడు గా అంచెలంచెలుగా గిడుగు రుద్రరాజు ఎదిగారు. అమలాపురంలో జన్మించిన గిడుగు రుద్రరాజు ఎలిమెంటరీ, ప్రాధమిక, ఉన్నత విద్యాభ్యాసం అమలాపురంలో చేసారు. బాల్యం నుంచి కాంగ్రెస్ ఆశయాలను ఒణికి‌ పుచ్చుకున్న రుద్రరాజు అమలాపురం పట్టణ ఎన్.ఎస్.యు.ఐ.అధ్యక్షులుగా పని చేసారు.

న్యాయవాది వృత్తి చెపట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీసు చేసారు. జిల్లా ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులుగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర అధ్యక్షుడుగా అయన పని చేసారు. పిసిసి కార్యదర్శి గానూ, ప్రధాన‌కార్యదర్శిగానూ పని చేసారు. వైఎస్సార్’కు ప్రియ శిష్యులు. శాశన మండలి సభ్యులుగా, ఆంధ్రప్రదేశ్ వైద్య మౌళిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్’గా కూడా పని చేసారు.

ఎ.ఐ.సి.సి.కార్యదర్శిగా పలు రాష్ట్రాల్లో ఇన్చార్జి గా పని చేసారు. సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీలతో మంచి పరిచయాలు ఉన్నాయి.

నాడు కళా వెంకట్రావు నేడు గిడుగు రుద్రరాజు:-

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర అధ్యక్షులుగా పని చేసారు. నాడు కోనసీమ రూప శిల్పి కళా వెంకట్రావు ఎఐసిసి కార్యదర్శిగా పని చేయగా నేడు కోనసీమ నుంచి ఆయన వారసుడుగా ఎఐసిసి కార్యదర్శిగా, పిసిసి అధ్యక్షుడుగా గిడుగు రుద్రరాజు పని చేయడం విశేషం.

–టి వి గోవిందరావు, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్

కాంగ్రెస్ మనుగడ కోసం కాపులకు పీసీసీ అధ్యక్ష పదవి

Spread the love