చలి చీమల సింహనాదం!
కుల మీడియా కుంభస్థలాన్ని చేధించగలదా?
మెగా ఛానల్’కి అంకురార్పణ వేయగలదా?
మెగా ఛానల్ (Mega Channel) కావాలంటూ చలి చీమలు (Chali Cheemalu) నిన్నటి రోజున అనేక దేశాల నుండి సింహనాదాలు (simhanadalu) మొదలు పెట్టాయి. తోటి చీమలకు తప్ప వినిపించని చలి చీమల ఘోష, కుల మీడియాకి (Kula Media) వినిపిస్తుందా? అంటే వినిపించే రోజు వచ్చి తీరుతుంది. రెండో వ్యక్తికి కూడా అర్ధంగాని చలి చీమల ఆక్రందన (akrandana), ఆవేదన (avedana), కుల మీడియాపై వీటికున్న ఆవేశం మెగా ఫామిలీకి (Mega Family) చేరగలదా? అంటే చేరి తీవుతుంది.
ఛానల్ కావాలి అంటున్న చీమల లాంటి అణగారిన వర్గాల (anagarina vargalu) సంకల్ప బలం గట్టిది అయితే మెగా ఫ్యామిలీకి చేరి తీరుతుంది. ఒక్క మెగా ఫామిలీకే కాదు. అణగారిన వర్గాలలో ఉన్న డబ్బున్న మారాజుల చెవులు గింగురులు అయ్యే స్థాయికి మాకు ఛానల్ కావాలి అనే ఆందోళన చేరి తీరుతుంది. ఇది Akshara Satyam.
ఎంత బలమైన విష సర్పమైనా (visha sarpam) సరే చలి చీమల చేత చెక్కి చావదే సుమతీ అన్నట్లు. మాకు ఛానల్ కావాలి అని మొదలైన నేటి ఈ ఉద్యమాల్లో కుల మీడియా విషపు ఆలోచనలు నశించే రోజు వచ్చి తీరుతుంది.
నేడు ప్రపంచంలోని అనేక దేశాల్లో, అనేక రాష్ట్రాల్లో ఉన్న అణగారిన వర్గాలకు చెందిన వారు అందరూ కంకణం కట్టుకొని దీక్ష పూనడం చూసాం. ఇదే మార్పుకి సంకేతం. ఇదే చైతన్యానికి నాంది. ఇదే రాబోయే సామాజిక మార్పులకి సూచనలు.
మాకు అన్యాయం జరిగింది. మాకు నాయం కావాలి. మాకు ఇల్లు కావాలి. మాకు సంక్షేమ పధకాలు కావాలి. మాకు ప్రభుతం అన్యాయం చేసింది అంటూ ఉద్యమాలు చేయడం చూసాం. కానీ మాకు ఒక ఛానల్ కావాలి అని దీక్షలు చేయనారంభించడం ఇదే మొదటిసాయి కావచ్చు. కుల మీడియా విష ప్రచారాలకు వ్యతిరేకంగా మాకు ఒక మెగా ఛానల్ కావాలి అని దీక్షలు చేయ మొదలు పెట్టడం చాలా కొత్తగా ఉన్నప్పటికీ హర్షించ తగినది.
మాకు ఛానల్ కావాలి అని సరికొత్త ఉద్యమాన్ని ఆరంభించిన అణగారిన వర్గాలకు చెందిన చలి చీమలు అభినందనీయులు. వీరిలో ఆలోచన రేకెత్తిచ్చిన అమెరికాలో ఉన్న రవి మొదలు కొని అనేక రాష్ట్రాల్లో, అనేక ఇళ్లలోనే ఉంటూ దీక్ష చేస్తూ ఈ ఉద్యమాన్ని బలపరచిన స్త్రీలకు, పురుషులకు, పిల్లలు అందరూ అభినందనీయులే.
కొత్త ఛానల్ రావడం అంటే ఉన్న మీడియాని పక్కన పెట్టమని కాదు. అణగారిన వర్గాల ఆవేదనకు గొంతుగా ఉన్నఅణగారిన వర్గాలకు చెందిన మీడియాని, ఛానల్’ని ఆదరించాలి. అలానే అణగారిన గర్గాలకు చెందిన చిన్న చితకా యూట్యూబ్ చానెల్స్’ని కూడా ఆదరించాలి. వీటికి అండగా ఉండడానికే మాకు మెగా ఛానల్ కావాలి అంటున్న వీరి ఆలోచన కూడా అభినందనీయుయమే.
చలి చీమలూ! శుభం భూయాత్
చలిచీమల సంకల్పానికి బలవంతమైన విష సర్పాన్ని మధించడానికి అవసరమైన శక్తి జ్వలించింది. అలానే చలి చీమలు లాంటి అణగారిన వర్గాలకు చెందిన యువత చేస్తున్న దీక్షల నుంచి మెగా మీడియా పుట్టుకొస్తుంది. కుల మీడియా కుంభ స్ధలాన్ని కొట్టి తీరుతుంది.
నేను సైతం సమిధ నొక్కటి ఆహుతి ఇచ్చాను అన్నట్లు… నేను సైతం కనీసం వెయ్యినొక్కటి రూపాయిలు నా మెగా ఛానల్ కోసం ధారా పోస్తాను అనే సంకల్పం చలి చీమల్లో కలిగిన రోజున మెగా మనస్సులు తప్పక కరుగుతాయి. అణగారిన వర్గాల్లో ఉన్న డబ్బున్న మారాజుల భోషాణాల్లోంచి కూడా కాసులు రావడం కూడా మొదలు అవుతాయి. వాటిలోంచి వస్తున్న రణఘణ ధ్వనులకు కుల మీడియా విషపు రాతలు హంతరించి తీరుతాయి.
చలి చీమలూ! శుభం భూయాత్ (Shubham bhuyat).
— Akshara Satyam
It shows the change in the minds of the normal people too wanted a channel to show the problems of the in shown in the present media n the govt. to respond on common people’s request. Chali cheemalu Hard working with unity will always achieve build to high level buildings even the snakes are always dangerous to occupy but the thought itself is good to have their own Channel with the help of Megha family n others contribution to safe gaurd the common people from the law n Judiciary along with power n law…..kadanagalaraa……
మీరు మాత్రం చలి చీమలు సింహనాదం అంటే చదువుతున్నంతసేపు చలిచీమల సింహాలై సింహనాదాలు చేస్తూ అన్నట్లు అనిపించేలా రాశారు సార్