Pawan Kalyan-CheppuPawan Kalyan-Cheppu

ఇక వైసీపీతో బహిరంగ యుద్ధమే
ఇప్పటి వరకు నా సహనమే మిమ్మల్ని కాపాడింది
ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతా
జనసేన శ్రేణులు పోరాటాలకు సిద్ధంగా ఉండండి
అన్ని కులాలకు రాజకీయమే జనసేన అంతిమ లక్ష్యం
వైసీపీ కాపు ఎమ్మెల్యేలు కులాన్ని కించపరిస్తే నాలుక కోస్తా
రంగాని కాపాడుకోలేకపోయారు
వచ్చే ఎన్నికల్లో జనసేన జెండా ఎగురవేద్దాం
జనసేన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ (Janasena Party) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జనసేన పార్టీ (Janasena Party) కార్యకర్తలను ఉద్దేశించి ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపుతున్నాయి. జనసేనాని (Janasenani) వ్యాఖ్యలు అభ్యంతరకర భాషలో ఉన్న మాట వాస్తవం. అయితే సేనాని పవన్ కళ్యాణ్’పై వైసీపీ నాయకులు (YCP Leaders), కార్యకర్తలు చేస్తున్న వ్యాఖ్యలతో పోలిస్తే, పవన్ కళ్యాణ్ వాడిన బాష అంత అభ్యంతరకరమైనది కాదు అని ప్రజలు చర్చించి కొంటున్నారు.

అసలు పొత్తు అవసరమా?

పవన్ కళ్యాణ్’ని చంద్రబాబు కలవడంతో దాదాపు పొత్తు ఖరారు అనే చర్చ కూడా జరుగుతున్నది. ఇంతకీ పొత్తు జనసేనానికి అవసరమా? ప్రస్తుత పరిస్థితుల్లో పొత్తు అవసరమే. అలానే అధికార పంపిణీ పద్దతిలో బాబు-సేనాని సమ నిష్పత్తిలో అధికారాన్ని పంచుకొనే విధంగా పొత్తులు ఉంటే అందరూ అంగీకరిస్తారు. జనసేన-తెలుగుదేశం కూటమి ఘనవిజయం సాధిస్తుంది. అదే జరిగితే వైసీపీ పార్టీకి గడ్డు రోజులు మొదలు అయినట్లై అని చెప్పాలి.

పవన్ కళ్యాణ్ చెలరేగి మాట్లాడిన మాటలతో, అలానే ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండవచ్చు అని తెలియడంతో, వైసీపీలో (YCP) తీవ్ర అసహనం, అసంతృప్తి పెరిగింది అని చెప్పాలి. అలానే ఒకరకమైన భయం కూడా పెరిగింది అనేది కూడా వాస్తవం. ఇక మనకి ఓటమి తప్పదా అనే ఆవేదనలో రగిలిపోతున్నట్లు కనిపిస్తున్నది. వైసీపీ ఓడిపోతే జనసేనకి వచ్చే లాభం ఏమిటి అనే మెసేజ్’ని వైసీపీ అభిమానులు పంపడానికి చూస్తున్నట్లు కనిపిస్తున్నది.

ఇది ఇలా ఉంటే టీడీపీ పార్టీ (Telugudesam Party) శ్రేణుల్లో అమితానందం కనిపిస్తున్నది. పవన్ కళ్యాణ్ ఇక బాబు జేబులోనే ఉన్నాడు అనే ప్రచారాన్ని పచ్చ మీడియా పచ్చ శ్రేణులు మొదలు పెట్టేశాయి.

ఒక పక్కన సేనాని చెలరేగి మాట్లాడిన వైనం, మరొపక్కన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుతో, పవన్ భేటీ వైసీపీ నాయత్వానికి మింగుడు పాడడం లేదు. వైసీపీకి ఇక ఓటమి తప్పదా అని చర్చ సోషల్ మీడియాలోను, మెయిన్ మీడియాలోనూ కొనసాగుతున్నది. అలానే సేనాని ముఖ్యమంత్రి కాబోతున్నాడా? ఇది నిజమైతే చంద్రబాబు దీనికి ఒప్పుకొంటాడా అనే చర్చ పల్లె పల్లెలో కూడా నడుస్తున్నది.

మొత్తం మీద పొత్తులపై టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం-వైసీపీ శ్రేణుల్లో ఆందోళన, జనసైనికుల్లో మిశ్రమ స్పందన కనిపిస్తున్నది. అధికారం పంపిణీ పద్ధతిలో పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడానికి బాబు ఒప్పుకొంటే, చంద్రబాబుతో కలిసి నడవడం సరియైనదే అని మెజారిటీ వర్గం భావిస్తున్నారు.

అయితే ప్రజల, జనసేనాని మద్దతుదారుల్లో కొన్ని అనుమానాలు పెనుభూతాలుగా మారబోతున్నాయి. వారి మదిని తొలిచివేస్తున్న ఆ ప్రశ్నలు ఏమిటంటే:

 • చంద్రబాబు జనసేనానిని సీఎంగా ఒప్పుకొంటాడా?
 • ఒప్పుకొన్నాగాని సేనానిని సీఎంగా బాబు కొనసాగనిస్తాడా?
 • తెలుగుదేశం, జనసేన సరిసగం సీట్లు పంచుకొన్నాగాని జనసేన సీట్లలో కూడా బాబు వర్గం వారే పోటీచేస్తే జనసేన పరిస్థితి ఏమిటీ?
 • ఒకవేళ చంద్రబాబు సీఎం అవ్వడానికి సేనాని ఒప్పుకొంటే?
 • అప్పుడు జనసేన మనుగడ ఏమిటి? అప్పుడు ప్రజలు సేనాని నిర్ణయాన్ని హర్షిస్తారా?
 • ఇలాంటి కీలపై ప్రశ్నలపై పల్లె పల్లెలో చర్చ జరుగుతున్నది.

మొత్తం మీద రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని జనసేనాని సృష్టించాడు అనే చెప్పాలి. అయితే పవన్ కళ్యాణ్’ని సీఎంగా ఒప్పుకొంటున్నాను అని చంద్ర బాబు ఎంత తొందరగా ప్రకటిస్తే సేనాని పేరు ప్రతిష్ట అంత తొందరగా పెరుగుతాయి. అలా బాబు ప్రకటన చేయక పోయినా సేనాని తెలుగుదేశంతో దోబూచులాట కొనసాగిస్తే, సేనాని పేరు ప్రతిష్టలకు మనోహరమైన మసి కమ్మేస్తుంది. అప్పుడు జనసేన పార్టీ మనుగడనే కష్టం అవుతుంది.

ఎవ్వరికి లాభం ఎవ్వరికి నష్టం?

సేనానితో బాబు భేటీ ఎవ్వరికి లాభం ఎవ్వరికి నష్టం అంటే ఖచ్చితంగా వైసీపీకి తీవ్ర నష్టం. టీడీపీకి ఇది మరో పునర్జన్మ అని చెప్పాలి. ఇక జనసేనని లాభమా నష్టమా అంటే ఇప్పుడే చెప్పలేము. సేనానిని సీఎంగా ఒప్పుకొంటున్నాను అని చంద్రబాబు చేసే ప్రకటన మీద జనసేన భవిత, జనసేనాని ప్రతిష్ట ఆధారపడి ఉంటాయి. బాబు ఆ ప్రకటన చేయకపోతే సేనాని చుట్టూ మనోహరమైన మసి మాత్రమే మిగలవచ్చు.

జనసేనాని చేసిన కొన్ని కీల వ్యాక్యలు:

 • రాష్ట్రంలో ఈ రోజు నుంచి రాజకీయ ముఖచిత్రం మారబోతుంది.
 • ఆంధ్రప్రదేశ్ లో జనసేన జెండా ఎగరడం ఖాయం.
 • ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ మంచితనం, సహనాన్నే చూశారని, ఇక నుంచి యుద్ధమే
 • ప్యాకేజీ స్టార్ అని మొరిగే ప్రతి వెధవకి ఒకటే చెబుతున్నాను.. ఇక నుంచి ఆ పదం పలికితే చెప్పుతో కొడతానని.. చెప్పు చూపించి మరీ వార్నింగ్ ఇచ్చారు.
 • ఇక మీతో యుద్ధమే.. మీ ఇష్టం ఎలాంటి పోరాటానికైనా నేను సిద్ధం. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను, బాధ్యతలతో యుద్ధం చేస్తాను. సభ్యత, సంస్కారం, మంచి, మర్యాద వైసీపీ నాయకులకు పనిచేయదు. బూతులు తిట్టే ప్రతి వైసీపీ నాయకుడికి ఇదే చెబుతున్నాను ఇక నుంచి నుంచోబెట్టి తోలు తీస్తాను. వారు ఎలా సమాధానం చెబితే మీరు కూడా అదే విధంగా స్పందించండి. దీనిలో వెనక్కి తగ్గొద్దు. ఎలాంటి పోలీసు కేసులకైనా, దమనకాండలకైనా సిద్ధంగానే ఉన్నం. తేల్చుకుందాం రండి.
 • పార్టీ నిధులు నా కష్టార్జితం, జనసైనికులు, దాతలు చేసిన సాయం తప్ప అవినీతి లేదు. ప్యాకేజీ లేదు.
 • వైసీపీ… ఎక్కువమంది నీచుల సమూహం
 • అధికారం అన్ని కులాలకు ఉండాలి
 • రంగా గారిని ఎందుకు కాపాడుకోలేకపోయారు
 • కాపు కులానికి చెందిన నాయకులు కాపులకు ఇప్పటి వరకు అధికారం కోసం ఏం చేశారో ఎందుకు చెప్పరు.
 • రాయలసీమ వెనుకబాటుకు కారణం ఎవరు? రాయలసీమ ముఖ్యమంత్రులు కాదా?
 • విశాఖ ఉక్కు ప్రైవేటికరణ కాకుండా నేను చూస్తా
 • ఇక చావోరేవో తేల్చుకుంటాం కానీ భయపడేది లేదు.
 • సైద్ధాంతిక బలంతో మనం కొట్టే దెబ్బ ఎలా ఉంటుంది చూపిద్దాం. పోలీస్ శాఖ అంటే మాకు ఎనలేని గౌరవం ఉంది. వారు కూడా గుర్తించుకోవాలి. భవిష్యత్తులో మా ప్రభుత్వంలోనే పనిచేయాలని గుర్తించుకుంటే మంచింది. జనసేన నాయకులు శ్రేణులు యుద్ధానికి సంసిద్ధం కండి” అని పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా కళ్యాణ్-బాబుల ఐక్య పోరాటం