Senani at formation daySenani at formation day

జనసైనికుల నాడి ఏమంటున్నది?

జనసేన పార్టీ (Janasena Party) తన ప్రస్థానాన్ని ఒంటరిగా చేయడమే ఉత్తమం. జాతీయ పార్టీ (National Party) అయిన బీజేపీతో (BJP) పొత్తు పెట్టుకోవడం తప్పు లేదు. అదీ కూడా అసెంబ్లీలో జనసేన (Janasena) ఆధిపత్యం, ఎంపీలకు బీజేపీ అధిపత్యానికి అన్నట్లుగా వీరు పొత్తు ఉండవచ్చు . సీఎం కాండిడేట్ (CM Candidate) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అని బీజేపీ (BJP) స్పష్టమైన ప్రకటన చెయ్యాలి అని ప్రజలు భావిస్తున్నారు.

అలానే ప్రాతీయ పార్టీ అయిన టీడీపీతో (TDP) జనసేన పొత్తుపెట్టుకోవడం జనసేనకు శ్రేయస్కరం కాదు. చంద్రబాబు (Chandra Babu) నైజాన్ని చూసినాగాని, టీడీపీతో పొత్తు అంత మంచిది కాదు. ఒకవేళ పెట్టుకోవాలివస్తే జనసేన కింద పనిచేయడానికి చంద్రబాబు ఒప్పుకున్నట్లు అయితే పోటుకోవడంపై ఆలోచన చేయవచ్చు అని జనసేన మద్దతు దారులు భావిస్తున్నారు. అదీ కూడా ఎలా ఉండాలి అంటే…

జనసేన టీడీపీతో పొత్తు (Alliance) పెట్టుకొంటే అప్పుడు జనసేనాని సీఎం కాండిడేట్ అవ్వాలి.

దానికి చంద్రబాబు, బీజేపీ అంగీకరిస్తూ మీడియా సాక్షిగా బహిరంగ ప్రకటన చెయ్యాలి.

ఆ తరువాత మాత్రమే పొత్తు ప్రకననను సేనాని (Janasenani) చెయ్యాలి. అది కూడా బీజేపీ సమక్షంలో చెయ్యాలి అని యువత కోరుకొంటున్నది.

అప్పటివరకు వైసీపీకి (YCP) టీడీపీకి సమన దూరాన్ని జనసేన పాటించాలి. ఇద్దరిపై విరుచుకు పడాలి.

ఇలా చేయని యెడల చరిత్ర మెగా ఫ్యామిలీని (Mega Family) మెగా ఫ్యామిలీ మద్దతుదారుల్ని క్షమించదు.

అప్పుడు కులాన్ని తాకట్టుపెట్టి ఎదిగిన పెద్దాయనకి, కుల సంఘాలకు (Kula sanghalu), కుల నాయకులకు (Caste Leaders) జనసేనకు తేడా ఉండదు అనే మన ప్రత్యర్థుల విష ప్రచారాలకు మనం బలి కావాల్సి వస్తుంది.

పదవులు వస్తుంటాయి. పోతుంటాయి. కానీ చరిత్ర హీనులు అవ్వడం తగదు అని యువత భావిస్తున్నది.

యువత మదిలో మెదులుతోన్న ప్రశ్నలు ఇవే:

రేపు టీడీపీతో పొత్తు పెట్టుకొంటే కాబోయే సీఎం బాబు అయితే ఏమిటి ప్రయోజనం?

మనం పార్టీ పెట్టింది చంద్రబాబుని సీఎం చేయడానికేనా?

మనకి జగన్ సీఎం అయితే ఏమిటి? బాబు సీఎం అయితే ఏమిటి?

ఆ ఇద్దరూ మనకు శత్రువులే కదా?

చంద్రబాబుని సీఎం సీఎం చేయడానికే అయితే దీని కోసం పార్టీ ఎట్టాలా?

దానికి ముసుగులో గుద్దులాట ఎందుకు? డైరెక్టుగానే పల్లకీలు మోసేద్దాం?

నిన్నటివరకు పల్లకీలు మోసే కాపు, ఉద్యమ, నాయకులకు జనసేనకు తేడా ఏమిటి?
అనే వారి నోర్లు మూయిద్దాం? పొత్తులపై జనసేనదే పై చేయి అనిపించేలా
జనసేన నడుచుకోవాలి. ఆవిధంగానే జనసేనాని రేపటి ప్రసంగం ఉండాలి అని యువత భావిస్తున్నది.

మచ్చ లేని మెగా ఫ్యామిలీ పొత్తుల ఊబిలో కూరుకు పోదు. ముమ్మాటికీ మరకలు అంటించుకోదు. పార్టీ పెట్టింది అధికారాన్ని సాధించడానికి గాని బాబుని సీఎంని చేయడానికి కాదు అని నిరూపిస్తుంది. నా లాంటివారు తల ఎత్తుకొనేలా సేనాని రేపటి ప్రసంగం ఉండబోతుంది. ఇదే అక్షర సత్యం

ఆలోచించండి….ఫ్యాన్’పై కక్ష వద్దు. సైకిల్’పై ప్రేమ వద్దు. పువ్వుని ప్రేమించండి కానీ చెవిలో పెట్టుకోవద్దు. రాజ్యాధికారమే మన లక్ష్యం. (Its from Akshara Satyam)

యూపీలో చరిత్ర సృష్టించిన బీజేపీ!
నాలుగు రాష్ట్రాల్లో కమలం హవా

2 thought on “పొత్తుల ఊబిపై సేనాని ప్రసంగం ఎలా ఉండాలి?”
  1. ” T D P తొ పొత్తు వద్ధు “ఒకసారి ఇచ్ఛి తప్పు చేసినాము .ఆ తప్పు ,T D P కి దత్త పుత్రుడు అని ఇప్పటికీ Y C P వాళ్ళు హేళన చేస్తున్నారు .దయుంచి T D P తొ పొత్తు వద్ధు . “B J P కి‌ మన అవసరం ఎంతో ఉంది కావున ,B J P తొ కలిసిన మనకు మేలు జరుగుతుంది అనుకుంటున్నాను. నా చిన్న విన్నపం దయుంచి పెద్ధదిక్కుగా ముద్రగడను చేరదీయండి

Comments are closed.