నాటు సారాయి (Illicit Liquor) తయారీ కేంద్రాలపై మంగళవారం జంగారెడ్డిగూడెం (Jangareddygudem) పోలీసులు (Police) దాడులు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) జంగారెడ్డిగూడెం మండలం పంగిడి గూడెం గ్రామం మారుమూల ప్రాంతములో పోలీసులు దాడులు నిర్వహించారు. జంగారెడ్డి గూడెం డిఎస్పీ డాక్టర్ రవికిరణ్ యొక్క ఆదేశాలపై ఎస్ ఐ సాగర్ బాబుకు అందిన సమాచారంపై మంగళవారం సిబ్బందితో దాడి జరిపారు. జంగారెడ్డి గూడెం మండలం పంగిడి గూడెం శివారులో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న సారాయి తయారీ కేంద్రాముపై ఈ దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 1,600 లీటర్ బెల్లం ఊటను ద్వంశము చేశారు. అలానే 60 లీటర్ నాటు సారాయిని, దీనికి ఉపయోగించే సామానులు గ్యాసు సిలిండర్, స్టౌ లను స్వాధీనము చేసుకున్నట్లు గా ఎస్ఐ సాగర్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా సాగర్ బాబు మాట్లాడుతూ మండలంలో ఎవరైనా ప్రజా ఆరోగ్యానికి హాని కలిగించే నాటుసారా తయారీ చేసిన, అమ్మిన వారిపై కఠినంగా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.