పశ్చిమగోదావరి ఏలూరు జిల్లా కొయ్యలగూడెం (Koyyalagudem) మండలం, కొయ్యలగూడెంలో పొట్టి శ్రీరాములు (Potti Sreeramulu) వర్ధంతి ఘనంగా జరిగింది. ఆంధ్రరాష్ట్ర సాధనకై ప్రాణత్యాగం చేసిన శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నియోజకవర్గ కన్వీనర్ బోరగం శ్రీనివాస్ పూలమాలలు వేసి గురువారం నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో బొరగం మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు జీవితం అందరికీ ఆదర్శమని భాషా ప్రయుక్త రాష్ట్రాల పితామహుడు, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన మహనీయులు శ్రీ పొట్టి శ్రీరాములని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పారేపల్లి రామారావు, మండల పార్టీ ఉపాధ్యక్షులు నిమ్మగడ్డ రవీంద్రనాథ్, మండల ప్రధాన కార్యదర్శి కర్రి రాంబాబు, టౌన్ పార్టీ అధ్యక్షులు జ్యేష్ఠ రామకృష్ణ, నాయుడు లిలాకాంత్, మేకల ప్రసాద్, చిన్ని మాస్టారు, నిమ్ము జగదీష్, పడమట రవి, రాచూరు మధన్, ఏలూరు పార్లమెంట్ తెలుగుయువత కార్యదర్శి నల్లూరి గోపికృష్ణ, బిసి సెల్ మండల అధ్యక్షులు గంగుల నాగు, బొబ్బర రాజు, కోడెల్లి వెంకటేష్, ఓగిరాల కుమార్ తదితరులు పాల్గొన్నారు.
–జంగారెడ్డిగూడెం నుండి గరువు బాబురావు