NagababuNagababu

భవిష్యత్తు తరాల కోసం జనసేనను గెలిపించుకోవాలి
ఏపీని అవినీతిపరులు, దోపిడీదారుల నుంచి విముక్తి చేయాలి
పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే వరకు ఒక కార్యకర్తనై పనిచేస్తా
జనసేన పార్టీ పీ.ఏ.సీ. సభ్యులు కొణిదెల నాగబాబు

జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్’నే (Pawan Kalyan) ముఖ్యమంత్రి (Chief Minister) అభ్యర్థిగా వచ్చే ఎన్నికలు జరగబోతున్నాయి అని కొణెదల నాగబాబు (Konidala Nagababu) స్పష్టం చేసారు. అవినీతిపరులు, దోపిడీదారుల నుంచి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రాన్ని విముక్తి చేయడానికి, భవిష్యత్తు తరాలను కాపాడుకోవటానికి జనసేనను (Janasena) గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని జనసేన పార్టీ (Janasena Party) పిఏసీ సభ్యులు కొణిదెల నాగబాబు స్పష్టం చేశారు.

జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లో బలంగా ప్రచారం చేస్తూ, జనసేన గెలుపే లక్ష్యంగా పని చేస్తున్న ముఖ్య కార్యకర్తలతో శనివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో నాగబాబు సమావేశమై మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమూల్యమైన వనరులు ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో, ప్రజా ఆమోద పరిపాలన అందించడంలో వైసీపీ ప్రభుత్వం (YCP Government) విఫలమైందని నానబాబు అన్నారు. దోపిడీకి గురవుతున్న రాష్ట్ర ఆర్థిక వనరులు, ప్రకృతి సంపదను కాపాడే సమర్థత జనసేనకు మాత్రమే ఉన్నదని నాగబాబు స్పష్టం చేసారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి జనసేన దగ్గర వినూత్నమైన ప్రణాళికలు ఉన్నాయని, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ముఖ్యమంత్రి (Chief Minister) అయితే అవినీతి అనే పదమే వినపడకుండా ప్రజా ప్రయోజన పరిపాలన అందిస్తారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే వరకూ నేనూ ఒక కార్యకర్తగా పని చేస్తానని నాగబాబు పేర్కొన్నారు. రానున్న ఎన్నికలే లక్ష్యంగా గ్రామీణ స్థాయిలో విస్తరించి పని చెయ్యాల్సిన ఆవశ్యకతను పార్టీ ముఖ్య కార్యకర్తలకు నాగబాబు వివరించారు. కార్యకర్తలు అంతా సమష్టిగా పని చేయాలని నాగబాబు సూచించారు.

చాతుర్వర్గ వ్యవస్థ పోవాలి అంటే పవన్ రావాలి!
చాతుర్వర్ణ వ్యవస్థ Vs చాతుర్వర్గ వ్యవస్థ

One thought on “జనసేనానే ముఖ్యమంత్రి అభ్యర్థి: కొణిదెల నాగబాబు”

Comments are closed.