Bheemla nayakBheemla nayak

లాలా భీమ్లా.. అడవి పులి (Adavi Puli) అనే పాట (Song) ఉర్రూతలూగిస్తున్నది. లాలా భీమ్లా.. అడవి పులి.. గొడవపడి’ అంటూ పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) పాత్రను తెలియజేేసలా ఒక చక్కటి పాటను రూపొందించారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ (Tivikram), దర్శకుడు సాగర్‌.కె.చంద్ర (Sagar K Chandra) ఈ పాటకు సాహిత్యం అందించారు. ఇది మలయాళం సూపర్‌హిట్‌ ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ కధానాయకుడు. ఈ ‘భీమ్లా నాయక్‌’  (Bheemla Nayak) సినిమాలోని మూడో పాటను ‘సౌండ్‌ ఆఫ్‌ ‘భీమ్లానాయక్‌’ అనేపేరుతో ఆదివారం విడుదల చేశారు.

తమన్‌ చక్కటి సంగీతం అందించారు. ఈ పాటను అరుణ్‌ కౌండిన్య ఉర్రూతలూగించేలా అలపించారు. అన్నపూర్ణ స్టూడియోలో (Annapurna Studio) ఈ పాటను భారీగా చిత్రీకరించారు. కవర్‌ సాంగ్‌లో ఒరిస్సా నుంచి రప్పించిన 30 మంది మహిళా నృత్య కళాకారులు పాల్గొన్నారు. ప్రస్తుతం లాలా భీమ్లా అనే పాట యూ ట్యూబ్‌లో (You Tube0 హల్‌చల్‌ చేస్తోందీ. విడుదల చేసిన కొన్ని గంటల్లోన్లే లక్షల్లో వ్యూస్‌ సాధించింది. అతి తక్కువ సమయంలో లక్ష వ్యూస్‌ మార్కును దాటిన పాటగా గుర్తింపు పొందినది అని సోషల్‌ మీడియాలో (Social Media) విస్తృత ప్రచారం జరుగుతోంది.

మాస్‌ లుక్‌లో పవన్‌కల్యాణ్‌ అదరగొట్టారని అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఇందులో డ్యానియేల్‌ శేఖర్‌గా రానా (Rana) కీలక పాత్ర పోషిస్తున్నారు. పవన్‌కు జతగా నిత్యా మీనన్‌ (Nithya Menon), రానాకు జోడీగా సంయుక్త మీనన్‌ (Samyuktha Menon) నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ (Surya Devara Naga Vamsi) నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.