అంజనీ పుత్రా (Anjani Putra)! అక్షర సత్యాలపై జర జాగ్రత్త…
నరకాసుర (Narakasura) రాక్షస పరివారం ప్రజలకు చూపించే నరకం కొనసాగాలి అంటే జనసేనాని (Janasenani) అడ్డుగా ఉండరాదు అనే ఉద్దేశంతోనే నరకాసుర పరివారం సేనానిని తిడుతూ ఉండేది. అనుకోకుండా తిట్టడం మానేసి, ఈ నరకాసుర పరివారం జనసేనానిని పొగడడం మొదలు పెట్టారు.
నరకాసుర రాక్షస పరివార పొగడ్తల వెనుక ప్రేమ లేదు. దాని వెనుక ఉన్న “రాక్షస మైండ్ గేమ్”ని (Raksasa Mind game) తెలిసికోండి. సైనికులారా! జర జాగ్రత్త (Jara jagratha) అంటూ సేనాని తన జనసైన్యాన్ని (Jana sainyam) హెచ్చరించడాన్ని అభినందిస్తున్నాను.
ఇది సరే…
“హే నా మజ్ను… నువ్వు ఈ ప్రపంచానికే ఆదర్శ నాయకుడివి. నా మనో వేదన ఒక్కసారి అయినా విను. నన్ను నువ్వు ప్రేమించకపోతే నా వెన్ను పోటు సామ్రాజ్య కలలు కల్లలుగానే మిగిలిపోతాయి. రేపు నా పిల్ల రాక్షసుడి భవిత ఏమి గాను. నా ఈ రాక్షస ప్రేమను వన్ సైడ్ ప్రేమగా మిగిలిపోనీకు… అంటూ బకాసురుడు (Baka surudu) అతని రాక్షస పరివారం నిన్నటివరకూ మీ వెంటపడింది.
కానీ నేడు ఈ చంద్రాసురుడు (Chandrasurudu) అనే బకాసురుడు, అతని పరివారం ఏమి చేస్తున్నారో తెలుసా? నేడు నిన్ను, నీ జనసైన్యాన్ని తూలనాడుతూ, చులకనగా మాట్లాడుతున్నారు.
నిన్నటి వరకూ పొగిడి నేడు నీపై చులకనగా మాట్టాడుతున్న ఈ బకాసురుడిని వీడి రాక్షస పరివారాన్ని మనం ఏమి చెయ్యాలి. ప్రతి విమర్శలతో ఒక పట్టు పెట్టమంటారా? లేక గతాన్ని మరిచి రెచ్చిపోతున్న ఈ చంద్రాసుర వరివారాన్ని మెచ్చికొంటూ, శాలువాలు కప్పమంటారా?
ఆలోచించండి… నరకాసురుని నేటి కొంగ్రొత్త ప్రేమ… బకాసురుని ఊసరవెల్లి రూపాలు రెండూ మనకు ప్రమాదమే. ఈ రెండూ కూడా మనతో ఈ రాక్షసుల పల్లకీలు మోపించుకోవడానికే అని గ్రహించండి. (It’s from Akshara Satyam)
(ఇది ఎవ్వరినీ ఉద్దేశించి కాదు. కేవలం కల్పితం)