Natusarapai dadi

జంగారెడ్డి గూడెం (Jangareddygudem) మండలం పెరంపెట గ్రామములో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న సారాయి (Illicit Liquor) తయారీ కేంద్రాముపై దాడులు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District), జంగారెడ్డి గూడెం డిఎస్పీ (DSP) డాక్టర్ రవికిరణ్ ఆదేశాలపై జంగారెడ్డి గూడెం సీఐ (CI) బాల సురేష్ బాబు ఈ దాడులు జరిగాయి. ఎస్. ఐ.సాగర్ బాబుకి వచ్చిన సమాచారముపై ఆదివారం నాడు ఎస్ఐ సాగర్ బాబు ఆయన సిబ్బందితో ఈ దాడుల్లో పాల్గొన్నారు. ఆ దాడుల్లో 1,000 లీటర్ బెల్లం ఊటను ద్వంశము చేశారు. అలానే 10 లీటర్ నాటు సారాయిని, సారాయి తయారీకీ ఉపయోగించే సామానులను స్వాధీనము చేసుకున్నట్లుగా ఎస్ఐ సాగర్ బాబు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఎవరైనా ప్రజా ఆరోగ్యానికి హాని చేసే నాటుసారా తయారీ చేసిన, అమ్మిన వారిపై కఠినంగా చట్ట ప్రకారం చర్యలు (Action) తీసుకుంటామని అన్నారు. నాటు సారాయి తయారీగాని అమ్మకముగాని చేసిన వారి యొక్క వివరాలను డయల్ 100 కు లేదా పోలీస్లకు సమాచారం తెలియ చేయాలని అయన కోరారు. సమాచారం తెలియజేసిన వారి యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతామని అయన అన్నారు.

మమ్ములను ఆదుకోండి: ప్రధానికి సీఎం జగన్ విన్నపాలు