Supreme CourtSupreme Court

ఈడీ, సీబీఐ తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి

దేశంలోని వివిధ ప్రజా ప్రతినిధులపై (Peoples Representatives) పెట్టిన కేసుల దర్యాప్తులో (investigation) మితిమీరిన ఆలస్యం జరుగుతుండడంపై సుప్రీంకోర్టు (Supreme Court) అసంతృప్తి వ్యక్తం చేసింది. వివిధ ప్రజా ప్రతినిధులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (Enforcement) డైరెక్టరేట్‌ (Directorate), సీబీఐలు (CBI) కేసులు నమోదు చేస్తున్నాయి. కానీ వాటికి ముగింపు ఉండడం లేదని న్యాయస్థానం ఆవేదన వెలిబుచ్చింది. దీనికి అవసరమైన మానవ వనరులు, ఇతర సదుపాయాలను కేంద్ర ప్రభుత్వం (Central Government) కల్పించాలని సూచించింది.

ప్రజాప్రతినిధులపై పెట్టిన కేసులను త్వరగా విచారించాలి. నేరం రుజువైతే వారు జీవితకాలం పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలంటూ అశ్విన్‌ ఉపాధ్యాయ, బీజేపీ నాయకుడు, దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్య చేసింది.

దర్యాప్తులో ఏమైనా ఉంది అని తేలితే వెంటనే అభియోగ పత్రాలు (ఛార్జిషీట్‌) దాఖలు చేయండి. కోర్టుల్లో 200కుపైగా కేసులు అసంపూర్తిగా ఉన్నాయి. 10, 15 ఏళ్లు దాటినా అభియోగ పత్రాలు నమోదు చేయకపోవడంపై ఎలాంటి కారణాలూ చెప్పడం లేదు. సంబంధిత వ్యక్తుల ఆస్తులు స్వాధీనం చేసుకున్నంత మాత్రాన సరిపోదు అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

పార్లమెంటే నిర్ణయం తీసుకోవాలి?

వివిధ కేసుల్లో శిక్షలు పడిన ప్రజా ప్రతినిధులు ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించడంపై పార్లమెంటే నిర్ణయం తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది.

దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై నమోదైన ఈడీ, సీబీఐ కేసుల వివరాలు:

ఎంపీలపై నమోదైన ఈడీ కేసుల తీరు

మొత్తం నమోదయ్యిన కేసులు: 51
విచారణ దశలో ఉన్నవి: 2
దర్యాప్తు పెండింగ్‌’లో ఉన్నవి: 28
అభియోగాల నమోదు దశలో ఉన్నవి: 10
విచారణ పెండింగ్‌’లో ఉన్నవి: 4
హైకోర్టుల్లో స్టేలో ఉన్నవి: 2
సుప్రీంకోర్టులో స్టేలో ఉన్నవి: 1

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై ఈడీ కేసుల తీరు

మొత్తం కేసులు నమోదు అయినవి: 71
అభియోగాల నమోదు దశలో ఉన్నవి: 15
దర్యాప్తు పెండింగ్‌’లో ఉన్నవి: 48
విచారణ పెండింగ్‌’లో ఉన్నవి: 3
సుప్రీంకోర్టులో స్టే లో ఉన్నవి: 1
హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో స్టేలో ఉన్నవి: 2

ఎంపీలు, ఎమ్మెల్యేలపై సీబీఐ కోర్టుల్లో కేసుల తీరు

మొత్తం నమోదైన కేసులు: 121
నిందితులుగా ఉన్న ఎంపీలు: 51 (సిట్టింగ్‌ 14, మాజీలు 37, మరణించినవారు 5)
నిందితులుగా ఉన్న ఎమ్మెల్యేలు: 112 (సిట్టింగ్‌ 34, మాజీలు 78, మరణించినవారు 9)
తాజా కేసు: సీబీఐ, ఏసీబీ, బెంగళూరు కోర్టు, మే, 20న ఛార్జిషీటు నమోదైంది.

సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసులు(ఆగస్టు 19 నివేదిక ప్రకారం

ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న పెండింగ్‌ కేసులు: 37
కేసుల్లో ఉన్న ఎంపీలు: 17 (సిట్టింగ్‌ 5, మాజీలు 12, మరణించినవారు 2)
కేసుల్లో ఉన్న ఎమ్మెల్యేలు: 17 (సిట్టింగ్‌ 11, మాజీలు 6)

తెలంగాణలో 147 కేసులు పెండింగ్‌

తెలంగాణలోని వివిధ ప్రత్యేక కోర్టుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలపై 147 కేసులు పెండింగ్.
నాన్‌బెయిలబుల్‌ వారెంట్లు పెండింగ్‌’లో ఉన్నవి: 8
విచారణ ప్రారంభం అయినవి: 30
అభియోగాల నమోదు, నిందితుల విచారణలో ఉన్నవి: 10
పాక్షికంగా విచారణ పూర్తయిన కేసులు: 53
సీఆర్‌పీసీ 311 ప్రకారం నిందితుల ఎగ్జామినేషన్‌’లో ఉన్నవి: 13

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేలపై 138 పెండింగ్‌ లో ఉన్న కేసులు

ప్రజా ప్రతినిధుల కేసుల విచారణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రత్యేక కోర్టుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలపై 138 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో కొన్ని కేసుల విచారణలో అసాధారణ జాప్యం చోటు చేసుకుంటోందని వెల్లడించారు.

Magastar Chiranjeevi Birthday Celebrations