Mega BrothersMega Brothers

రాజకీయ కుట్రలపై శాంతి సందేశం

ఎవరికీ ఎక్కడ కష్టం వచ్చినా మెగా ఫామిలీ (Mega Family) స్పందించాలి. ఎవరికీ డబ్బు అవసరం వచ్చినా మెగా ఫామిలీ దానం చెయ్యాలి. ప్రభుత్వాలను ప్రశ్నించడానికి మెగా ఫామిలీ కావాలి. ఎన్నికలు అయినా తరువాత మెగా ఫ్యామిలీని అందరూ కీర్తిస్తూ ఉంటారు. కానీ ఓట్లు వేసేటప్పుడు మాత్రం మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఉంటారు. వీరి విష ప్రచారానికి ప్రజలు మెగా ఫామిలీ నుండి తాము పొందిన ప్రయోజనాన్ని మరిచి పోతుంటారు. అసలు మెగా ఫ్యామిలీనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? దీనికి కారణం ఏమిటి?

మెగా ఫ్యామిలీనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనే దానిని విశ్లేషణ చేస్తే సమాధానం సులభంగా అర్ధం అవుతుంది.

చిరు ప్రజారాజ్యం స్థాపనకు కారణం?

చిరంజీవి అనే వ్యక్తి, తన 30సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు పణంగా పెట్టి 2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. వాస్తవానికి చిరంజీవికి 2009 లో పార్టీని స్థాపించడం అంత ఇష్టం లేదు. దీనికన్నా 2014లో రాజకీయపార్టీని స్థాపించి ప్రజల లోకి వెళ్ళాలి అనేది చిరు భావన.

కానీ కొందరు మేథావులు (Inteliectuals) , అశావహులు (Aspirants), స్వార్థపరులు మరియు మీడియా అథిపతులు (Media owners) తమ స్వార్ధ ప్రయోజాల కోసం చిరు (Chiru) చుట్టూ చేరడం మొదలు పెట్టారు. వారు ఏవరో నేను చెప్పనక్కర్లేదు అనుకొంటా. రాజశేఖరరెడ్డి (Raja Shekar Reddy) దెబ్బకి ఒక వర్గం అర్థిక మూలాలు (Financial Roots) పూర్తిగా కుదైలానాయి. అలానే చంద్రబాబు (Chandra Babu) ప్రతిష్ఠ కూడా పూర్తిగా పాతాళంలోకి నెట్టవేయబడింది. ఈ ఆందోళనతోనే ఆ మేధావులు, ఒక వర్గపు మీడియా (Pacha Media) అధిపతులు, చిరు చుట్టూ చేరడం మొదలు పెట్టారు. 2014 పరిస్థితి ఎలా ఉంటుందో ఏవరు చెబుతారు? 2009 లోనే మీరు రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టాలి అని చెవిలో ఇల్లు కట్టుకోని మరీ చెప్పడం మొదలు పెట్టారు. కావాలంటే మేథావులను, రాజకీయ నిపుణులను తాము పంపిస్తామనే ప్రతిపాదన కూడా జరిగింది. అలా వచ్చిన వాడిలో పరలోకం పరంగాడు ఒకడు. అతను ఎవరి మనిషో కూడా మీకు తెలిసిందే.

చిరంజీవికి (Chiranjeevi) అప్పటికీ తనకు రాజకీయాలు పట్ల పూర్తి స్థాయిలో ఔపోసన, అవగాహన లేదు. అయినప్పటికీ వారి (పచ్చ) మాటలు నమ్మి… మరియు తన అభిమానులు కోరిక ప్రకారం 2009లో ప్రజారాజ్యం (Prajarajyam) ప్రస్తానం మొదలు పెట్టవలిసి వచ్చింది. నిజంగా నభూతో నభవిష్యతి అనే స్థాయిలో పార్టీ ఆవిర్భావ సభ తిరుపతిలో (Tirupathi) జరిగింది. నాడు పచ్చ మీడియా (Pacha Media) చిరంజీవిని పూర్తిగా ఆకాశానికి ఎత్తేయటం జరిగింది.

పచ్చ మీడియా విషపు కుల ముద్ర

కోద్ది రోజులలోనే పచ్చ పార్టీ (Pacha Party) అథినేత అదేశాలు మేరకు, పచ్చ మీడియా చిరంజీవిపైన కులముద్ర (Kula Mudra) వేయడం మొదలు పెట్టేసింది. ఎమ్మెల్యే టికెట్లు సినిమా టికెట్లు మాదిరిగా బ్లాకులో అమ్ముకున్నారనే ముద్ర కూడా వేయడం మొదలు పెట్టేసింది. ప్రజారాజ్యం అంటే జనాలు తిట్టుకొనేలా విపరీతమైన విష ప్రచారాన్ని పచ్చ మీడియా చేయటం జరిగింది. దీనిని అత్యథికంగా చిరంజీవి సామాజిక వర్గం వారే నమ్మే స్థాయిలో విష ప్రచారం జరిగింది. దీనితో సదరు వర్గం వారు పూర్తిగా సదరు పచ్చ ట్రాప్ లో పడ్డారు.

సామాజిక స్పృహ మరియు మార్పు కోసం పెట్టిన పార్టీ

ఆ రెండు వర్గాలు చేయించి మీడియా (Media) పెద్దలు చిరంజీవి సామాజిక స్పృహ మరియు మార్పు కోసం పెట్టిన పార్టీని పూర్తిగా దెబ్బతీసారు. అఖరి అస్త్రంగా నాటి కులాజీరావు (Kulajeerao) అధుచరుడైన పరలోక పాపాత్ముడితో స్వయంగా ప్రజారాజ్యం పార్టీ అఫీసు నుంచే విష ప్రచారం చూపించారు. దీనితో చిరంజీవికి పార్టీ పైన పట్టులేదనే సంకేతాలు పంపారు. స్వయంగా చిరంజీవి సోంత నియోజకవర్గంలో కూడా ఓడేలా కూడా కుట్రలు చేశారు. అయినా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 294 సీట్లలో 18 స్థానాలు, 17% ఓటుశాతం తో రెండో స్థానంలో నిలబడగలిగింది. రెండవ ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకున్నారు.

తన పార్టీ 2009 లో ఓటమికి చిరంజీవి మాత్రమే భాథ్యుడు అని నాడు చంద్రబాబు (Chandra babu) కూడా చెప్పటం జరిగింది. అలాగే రాజశేఖరరెడ్డి (Raja Shekar Reddy) కూడా బోటాబోటి మెజారిటీతో చావు తప్పి, కన్ను లోట్ట బోయినట్లు గెలవటం జరిగింది.

రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తరువాత?

తదనంతరం రాజశేఖరరెడ్డి హఠాన్మరణం (YSR Death) తరువాత తెలంగాణా ఉద్యమం (Telangana agitation) ఊపందుకుంది. అప్పుడే ఎంపీగా (2009) రాజకీయ ప్రస్థానం చేసిన జగన్ రెడ్డిని (Jagan Reddy) ముఖ్యమంత్రి (Chief Minister) చేయాలని బలంగా వాదన రావటం, సంతకాలు సేకరణ జరిగింది. అందులో భాగంగా చిరంజీవి గారి సమ్మతి కోసం రాయబారం నడిస్తే, చిరంజీవి గారు సున్నితంగా తిరస్కరించారు. ముందు పార్థీవదేహం అంతిమ సంస్కారాన్ని చూడండి అని చెప్పటం జరిగింది. తదనంతర పరిణామంలో రోశయ్య ముఖ్యమంత్రి అవటం జరిగింది. ఇది జగన్ రెడ్డి కి ఏమాత్రం నచ్చలేదు. అయినా కూడా ఏమీ చేయలేక నాడు ఊరుకున్నాడు.

రోశయ్య (Rosaiah) గారు ముఖ్యమంత్రిగా సమర్థంగా రాణించటం లేదని, తెలంగాణా ఉద్యమం సరిగ్గా నియంత్రణ చేయటం లేదని… జగన్ రెడ్డి అగడాలు కట్టడి చేయలేక పోతున్నారు అని కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) ముఖ్యమంత్రిగా రావటం జరిగింది. దాదాపుగా తనకు ఇప్పట్లో కాంగ్రెసు పార్టీ (Congress Party) ముఖ్యమంత్రి స్థానం ఇవ్వటం జరగదు అని అర్థం అయిన తరువాత, బహిరంగంగా జగన్ తిరుగుబాటు చేశారు. తిరుగుబాబు చేసి కాంగ్రెసు ప్రభుత్వాన్ని మైనారిటీలో పడేయటానికి ప్రణాళికాబథ్థంగా పావులు కదపటం మొదలు పెట్టాడు.

ప్రజారాజ్యం కాంగ్రెసులో విలీనం ఎందుకు?

చంద్రబాబు నాడు నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) పైన ఉపయోగించిన ఎత్తుగడ వాడాడు. తనతో చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారనే భీతిని కాంగ్రెసు పార్టీ అగ్రనేతలకు రుచి చూపాడు. నాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూడా శల్యసారథ్యం చేసారు. దీనితో అయోమయంలో పడిన కాంగ్రెసు అగ్రనేతలు చిరంజీవి గారిని సంప్రదించటం జరిగింది. ఈలోపు ప్రజారాజ్యంలో ఉన్న కాంగ్రెసు మనుషులు, తెదేపా మనుషులు మరియు జగన్ రెడ్డి అనుచరులు కప్పల తొక్కడం మొదలు పెట్టారు. పార్టీని కాంగ్రెసు వైపు తీసుకువెళ్లాలని కొందరు… తెదేపా వైపు తీసుకువెళ్లాలని మరి కొందరు… అలానే జగన్ రెడ్డి వైపుకు తీసుకువెళ్లాలని ఇంకొందరు ప్రయత్నాలు చేయటం మొదలు అయ్యింది. దీనితో చిరంజీవిపైన తీవ్రమైన ఒత్తిడి తేవటం జరిగింది. వీరి మాటలు వినకపోతే పార్టీ నుంచి తామే వెళ్ళి పోతామనే సంకేతాలు చిరుకి ఇవ్వడం ఆరంభించారు. ఇక గత్యంతరం లేక తదనంతరం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేయడం జరిగింది.

కాంగ్రెసు రాష్ట్ర ప్రభుత్వానికి స్థిరత్వం తేవటంతో, జగన్ రెడ్డి అశలు రెండో సారి చిరంజీవి వలన తీవ్రంగా దెబ్బతిని పోయాయి. ఈరకంగా రెండు సార్లు ముఖ్యమంత్రి పదవి జగన్ద రెడ్డికి దక్కకపోవటానికి చిరంజీవినే కారణం.

రాష్ట్ర విభజన అనంతరం చిరు

ఈలోపు జగన్ రెడ్డి జైలుకి వెళ్ళటం, తెలంగాణా ఉద్యమం తీవ్రమైన స్థాయిలోకి వెళ్ళటంతో రాష్ట్ర విభజన అనివార్యం అవటం, రాష్ట్ర విభజన జరగటం అందరికీ తెలుసు.

ఇక్కడ ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే నాటి యువరాజ్యం అథ్యక్షుడైన పవన్ కళ్యాణ్ చిరంజీవితో విభేదించి దూరం జరిగిపోవటం జరిగింది. ప్రజారాజ్యం విలీనం విషయంలో చిరుతో విభేదించారు. రాష్ట్ర విభజన తదనంతర సమయంలో పవన్ కళ్యాణ్జ నసేన పార్టీ స్థాపించారు.

జనసేన పార్టీ (Janasena party) మోఢీతో చేతులు కలపటం జరిగింది. భాజపా, చంద్రబాబు పార్టీతో పోత్తులో ఉండటంతో, అనివార్యంగా చంద్రబాబుకి 2014 లో రాజకీయ సపోర్ట్ ఇవ్వవలిసి వచ్చింది. అప్పట్లో తానుగా పోటీ చేయలేదు. తరువాత కూడా ఎటువంటి రాజకీయ అవసరాలు అడగలేదు. పైగా 2015 ఆగష్టు నెల నుంచి చంద్రబాబు విథానాలు పైన జనసేనుడు విభేదించడం మొదలు పెట్టారు. అరకంగా జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అవటానికి వచ్చిన మూడో అవకాశం పవన్ కళ్యాణ్ వలన 2014లో ఆగిపోయింది.

చంద్రబాబు పతనానికి జనసేన పంతం

చివరకు 2019లో చంద్రబాబు పతనానికి జనసేన పంతం గట్టింది. రాజకీయ పార్టీగా ప్రత్యక్ష ఎన్నికలలో శ్రీకారం చుట్టింది. చివరకు చెప్పినట్లుగా చంద్రబాబుని పూర్తిగా కోలుకోలేని విథంగా జనసేనుడు పతనం చేశాడు. అయితే ఇక్కడ యుశ్రారైకాపా, తెదేపా విష ప్రచారం ప్రభావంతో, మరలా చిరంజీవి సామాజిక వర్గం వారు మరలా జనసేన పార్టీని నమ్మలేదు. ఆ అపనమ్మకంతో జనసేనకు వచ్చిన ఫలితాలు మీకు తెలుసు.

ఈరకంగా మెగా కుటుంబం వలన జగన్ రెడ్డికి మూడు సార్లు ముఖ్యమంత్రి అవకాశాలు దెబ్బతిని పోయాయి. చంద్రబాబుకి రెండు సార్లు దెబ్బ పడింది. ఇప్పుడు చెప్పండి జగన్ రెడ్డి కానీ, చంద్రబాబు కానీ ఏందుకు మెగా కుటుంబం పట్ల ద్వేషభావమో?

అందుకే మెగా కుటుంబం (Mega Family) అర్థిక మూలాలపైన దెబ్బ వేయటం కోసం, ప్రణాళికాబథ్థంగా ‘మా’ ఎన్నికలలో దెబ్బ తీయాలనే ప్రయత్నాలు జరిగాయి. సదరు కుటుంబంకి సాయి థర్మతేజ్ ప్రమాదంతో, వీటి పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదు. నాగబాబు చివరి నిమిషంలో ప్రయత్నాలు ఆరంభించారు. ఆయన ప్రయత్నాలు ఫలితాలు మరీ లేకుండా మాత్రమే ఉపయోగబడ్డాయి.

ఇప్పుడు చెప్పండి ప్రజలారా… ఇందుకే మెగా కుటుంబం అంటే కమ్మని దొడ్డల పగ. ఎప్పటికైనా మెగా కుటుంబం వలన తమ రెండు కుటుంబాల ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందని భావించారు. అందుకే ఆ రెండు వర్గాలు మా ఎన్నికల్లో కలిసినట్లు తెలుస్తున్నది. ఆ తదనంతరం వచ్చినవే మా ఫలితాలు.

ఇప్పుడు చెప్పండి. మెగా కుటుంబం అనేది ఏంత ప్రభావితం చేయగలదో? వీరికి వారి సామాజిక వర్గం వారు అండగా నిలబడితే ఫలితం ఎలా ఉండేదో? కలిసి పోరాడితే కామ్రెడ్లకు అథికారం అనేది కలే. మెగా ఫాలితో అణగారిన వర్గాలు కలిస్తే… అప్పుడు మెల్లగా అథికారం కాపులు, బీసీలు చేతుల మీదగా దళితుల పరం అవుతుంది. అప్పుడు దీనిని కామ్రెడ్లు అంగీకరించటం చేయగలరా?

ఇది మొత్తం మీకు అర్ధం అయితే, మీకు గత రాజకీయాలు, ప్రస్తుత రాజకీయాలు మరియు భవిష్యత్తు రాజకీయాలు పైన పూర్తిగా అవగాహన వస్తుంది. ఒకసారి థీర్ఘంగా అలోచన చేయండి. మార్పు కోసం చేయి చేయి కలపండి. రాజ్యాధికారాన్ని సాధించండి.

–శాంతి ప్రసాద్ శింగలూరి (Shanti Prasad Singaluri), న్యాయవాది, జనసేన లీగల్

Final results declared for MAA elections

Spread the love