Jogaiah with MROJogaiah with MRO

కాపు నేస్తం (Kapu Nestham) ఒక తమాషా అంటూ కాపు సంక్షేమ సేన (Kapu Sankshema Sena) జగన్ ప్రభుత్వాన్ని (Jagan Government) విమర్శించింది. జగన్ ప్రభుత్వం కాపులకు (Kapu) మోసం చేస్తున్నది. కాపులకి సత్వరమే న్యాయం చెయ్యాలి అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి (Jagan Mohan Reddy) వినతిపత్రం ఇవ్వాలని కాపు సంక్షేమసేన పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య (Hari Rama Jogaiah) పాలకొల్లు తహసీల్దార్’కి వినతి పత్రం సమర్పించారు.

రాష్ట్రంలో ఉన్న అన్ని ఎమ్మార్వో కార్యాలయాల్లో కాపు సంక్షేమ సేన ప్రతినిధులు వినతిపత్రాలను సమర్పించారు. అనేక చోట్ల పెద్ద ఎత్తున ఉత్సాహంతో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున వచ్చిన స్పందనకిగాను,కాపు సంక్షేమ సేన ప్రతినిధులకు… సేన అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య కృతజ్ఞతలు తెలియజేసారు. 

జగన్ ప్రభుత్వం కాపునేస్తం పేరుతో కాపులను మోసం చేస్తున్నది. సాధారణ సంక్షేమ పధకాలను కాపు కార్పొరేషన్’లో (Kapu Corporation) చూపిస్తున్నది. కాపుల అభివృద్ధికి అవసరమయ్యే గత ప్రభుత్వ పధకాలను జగన్ ప్రభుత్వం నిలిపివేసింది. విద్యార్థుల ఉన్నత విద్యకు అవసరమయ్యే నిధులను ఇవ్వడం లేదు. కాపు కార్పొరేషన్ ద్వారా నిర్ధేశిత లక్ష్యాలకు ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టడం లేదు. కాపులకి EWS కోటాలో భాగమైన 5 % కాపులకు ఇవ్వాలి. అంటూ కాపు సంక్షేమ సేన జగన్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టింది.

వినతిపత్రం సమర్పించిన గాజువాక కాపు సంక్షేమసేన

లాయర్ కలావతి కరణం, గాజువాక లీగల్ సెల్, కాపు సంక్షేమసేన రాష్ట్రా ఉపాధ్యక్షురాలు నాయకత్వంలో, సంక్షేమ సేన ప్రతినిధులు గాజువాక తహసీల్దారుకి వినతిపత్రం సమర్పించారు. కాపులకి రిజర్వేషన్స్ కల్పించాలి, కాపు నేస్తం అందరికి వర్తింప చేయాలి అంటూ వినతి పత్రం సమర్పించారు.

AP Cabinet Expansion

Spread the love