Bhadratha vaiphalyamBhadratha vaiphalyam

అభిమానుల ముసుగులోని ఉన్మాదుల చర్యనా?
లేక నిర్వాహకుల ఉదాశీన వైఖిరినా?
లేక జనసేనాని అతి మంచితనమా?

సేనాని భద్రతపై శాంతి సందేశం

నరసాపురంలో (Narasapuram) జరిగిన మత్సకార అభ్యున్నతి సభ (Matsakara Abhyunnati Sabha) బ్రహ్మాండంగా విజయవంతం (Grand Success) అయ్యింది. మత్సకారుల్లోనూ, జనసైనికుల్లోను ఉత్తేజాన్ని నింపింది. అయితే నిన్నటి మత్సకార అభ్యున్నతి సభ కోసం జరిపిన ర్యాలీలో భద్రతా వైఫల్యాలు (Security Lapses), పోలీసులు నిష్క్రియాపరత్వం, అభిమానుల హద్దులు లేని ఉన్మాదం కళ్ళకు కట్టినట్లు కనిపించాయి.

అదృష్టవశాత్తు జనసేనానికి (Janasenani) ఏమీ కాలేదు. కాబట్టి గండం గడిచింది అని చెప్పవచు. కానీ అనుకోని దుర్ఘటన ఏదైనా జరిగినట్లు అయితే మన పరిస్థితి ఏమిటి? నిజంగా అభిమానులు పేరుతో చేస్తూన్న ఈ చేష్టలు హద్దులు దాటుతున్నాయి. వెగటు కూడా కలిగిస్తున్నాయి అనటంలో ఏమాత్రం సందేహం లేదు.

క్రిందకి పదతోయడమే అభిమానమా?

అయనంటే అభిమానం ఉంటే చక్కగా ప్రదర్శించి అయన దృష్టికి వెళ్ళండి. అంతేకానీ అయన కారు పైకి వెళ్ళి అయన క్రింద పడేలా చేయటం పైచాచికత్వం (Sadijam) అనిపించుకొంటుంది. అలానే ఇది అభిమానం కాదు ఉన్మాద చేష్ట. నిజంగా కింద పడటం వలన అయన వెన్నుపూసకు ఏమైనా గాయం కలగవచ్చు. కాలి ఎముకలకు గాయం అయినా అవ్వవచ్చు. అలానే ఆ ఊపులో నేలపైన పడితే తలకు గాయం కదా అవ్వవచ్చు. అలా అయితే దీనికి ఏవరు భాథ్యత తీసుకోవాలి. అభిమానుల ముసుగులో మీ మూర్ఖత్వానికి అయన అరోగ్యం, శరీరం బలి కావాలి అని భావిస్తున్నారా? అలా మీరు భావిస్తే, మీరు ఖచ్చితంగా జనసైనికులు కాదు. మీరు కేవలం ఉన్మాదులు మాత్రమే.

ముసుగు ఉన్మాదులను దూరంగా ఉంచండి

ఇకపోతే జనసైనికులకు (Janasainiks) కూడా బహిరంగంగా విజ్ఞప్తి. ఇటువంటి ఉన్మాదం కలిగిన వ్యక్తులు మీలో ఏవరో ఒకరికి తెలిసే ఉంటారు. దయచేసి అటువంటి ఉన్మాదం చేసేవారిని దూరంగా ఉంచండి. లేకపోతే అనుకోని దుర్ఘటన జరిగి అయన ప్రాణాలు పైకి వస్తే, మనం ఎటువంటి నష్టం అనుభవించాల్సిన పరిస్థితి వస్తుందో ఒక్కసారి ఉహించండి. కాబట్టి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గారి వ్యక్తిగత భద్రతా సిబ్బందితో పాటు, పవన్ కళ్యాణ్ గారి వాహనం చుట్టూ ఉన్న జనసైనికులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి ఉన్మాదులను పూర్తిగా నిరోథించాలి.

పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక సూటి ప్రశ్న

జనసైనికులకు ఒక సూటి ప్రశ్న వేస్తున్నాను. నిజంగా నిన్న జరిగిన సంఘటనల వలన అయన గాయాలపాలై, కష్టమైనా అటువంటి గాయాలతో పవన్ కళ్యాణ్ ప్రసంగించాలి వస్తే ఏమవుతోందే తెలుసా? మీ మనస్సు కకావికలం అవుతుంది? మీరు భాథపడతారు? కాబట్టి ఇటువంటి చేష్టలు చేసే వారి పట్ల ఒకింత కఠినంగా ప్రవర్తించడం మంచిది. లేకపోతే ప్రతిసారి అదృష్టం పవన్ కళ్యాణ్ పక్షాన ఉండదు. కాబట్టి అలోచన చేయండి అని మనవి చేస్తున్నాను.

జనసేనాని భద్రత సిబ్బంది ఏమి చేస్త్తున్నారు?

ఇకపోతే పవన్ కళ్యాణ్ భద్రతా సిబ్బందికి ( Pawan Security staff) కూడా ఒక విజ్ఞప్తి. ఇకనుంచి అయన కోసం ఒక ప్రత్యేకమైన ర్యాలీ వాహనం తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఇకనుంచి భవిష్యత్తులో జరగబోయే ప్రతీ ర్యాలీలో కానీ, చిన్న చిన్న బహిరంగ సభలలో (Public Meeting) కానీ అయన దాని టాప్ పైన నిలబడి అందరికీ కనబడేలా ప్రసంగాలు చేయాలి. అప్పుడు నిన్న జరిగినటువంటి సంఘటనలు జరగకుండా అపవచ్చు.

పవన్ కళ్యాణ్ మనస్సులోని మాట?

ఇక్కడ ఒక్క విషయం నేను మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఇది స్వయంగా పవన్ కళ్యాణ్ నాతో చెప్పిన మాట చెబుతున్నాను. నిన్నటి సంఘటన చూసిన తరువాత దీనిని బహిరంగంగా చెప్పాలని భావిస్తున్నాను.

“నన్ను చాలామంది అభిమానులు ఏంతగానో అభిమానిస్తారు. గౌరవిస్తారు. తమ జీవితంలో ఒక్కసారైనా సరే నాకు షేక్ హ్యాండ్ ఇవ్వాలని, నాతో ఫోటో దిగాలని అనుకుంటారు. మరికొందరు నన్ను వ్యక్తిగతంగా తాకాలని ప్రయత్నాలు చేస్తారు. మరికొందరు హఠాత్తుగా వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకోవాలని ప్రయత్నాలు చేయటం జరుగుతుంది. వారి ప్రథాన ఉద్దేశ్యం నాకు హానీ చేయాలని ఏంత మాత్రం కాదు. నన్ను ఒక్క సారి తాకాలి. తద్వారా అటువంటి జ్ఞాపకాలు పదిలంగా దాచుకోవాలి అనేది వారి కోరిక. నేను ఎప్పుడూ అభిమానులు అభిమానంకి తలవంచుతాను. వారిని ఎప్పుడూ మందలించను.

అయితే ఒకోక్కసారి ఇటువంటి అభిమానం పూర్తిగా హద్దులు దాటి పోతుంది. నా అరోగ్యం పైన, భద్రతపైన ఇబ్బందులు తెచ్చేలా ఉంటుంది. నాకున్న కొందరి వీరాభిమానులు నన్ను తాకి, నా చొక్కా చింపి తీసుకోని వెళ్లడం కోసం ఒకోక్కసారి నా చేతి పైన ఉన్న వెంట్రుకలు పీక్కోని వెళ్ళటం చేస్తారు. అది నాకు కీడు చేయాలని కాదు, నాకు చెందిన వస్తువు ఒక బహుమతిగా, జ్ఞాపికగా ఉంచుకోవాలి అనేది వారి ఉద్దేశం. అటువంటప్పుడు నాకు విపరీతమైన శారీరక భాథ కలుగుతుంది. అయినా ఓర్చుకుంటాను.

ఒకసారి నా అభిమానులు అందరూ భథ్రతా వలయాన్ని ఛేథించి, నన్ను మథ్యన పెట్టి గట్టిగా ఒత్తేసారు. కానీ అ సంఘటనలో నాపైన టన్నుల ఒత్తిడి పడటంతో నాకు ఊపిరి తీసుకోవడం చాలా కష్టం అనిపించింది. నా ఛాతి ఎముకలు పైన తీవ్రమైన ఒత్తిడి పడటంతో అవి విరుగుతాయా అన్నంత అనుమానం వచ్చింది. శ్వాస తీసుకునే విషయంలో చాలా ఇబ్బందులు పడ్డాను.” అని చెప్పటం జరిగింది.

జనసైనికుల కింకర్తవ్యం?

కాబట్టి జనసేనాని వీరాభిమానులైనవారు ఇప్పుడు చెప్పండి? ఇటువంటి పరిస్థితులు మీ పవన్ కళ్యాణ్’కి మరలా మరలా రావాలని కోరుకుంటారా? అలా కోరుకుంటే, మీరు పవన్ కళ్యాణ్ వీరాభిమానులైతే కావచ్చు కానీ మా జనసైనికులకు మాత్రం శత్రువులే. కారణం మాకు పవన్ కళ్యాణ్ గారి భద్రత అత్యంత ముఖ్యం. అయనకు చిన్నపాటి గాయం కలిగినా, కలిగించే వ్యక్తి మా జనసైనికులకు ఎప్పుడూ శత్రువే.

మాకు ఈరోజు కావాల్సింది జనసేన పార్టీ ఉద్దానం. జనసేనాని ముఖ్యమంత్రి కావటం. తద్వారా రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో బతకటం. దానికి విఘాతం కలిగించే వాడు ఏవడైనా మాకు శత్రువే అవుతాడు.

దయచేసి ఇకనుంచి జనసైనికులు ఇటువంటి ఉన్మాద అభిమానులను తిరస్కరించాలి. వారి చేష్టలను ఖండించాలి. అటువంటి వారిని దూరంగా ఉంచాలి అని మనవి. దీన్ని సహృదయంతో అర్ధం చేసుకుంటారని… జనసేనాని భద్రతకు రక్షకులుగా ఉంటారని ఆశిస్తూన్నాం.

— Shanti Prasad Singaluri, Janasena Party Legal Cell

మత్సకార అభ్యున్నతి సభలో ప్రభుత్వాన్ని ఏకేసిన జనసేనాని!