Konidala NagababuKonidala Nagababu

ఫిబ్రవరి 10వ తేదీన క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభం

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు (Janasena Party Membership Drive ప్రక్రియను విజయవంతం చేయాలని జనసేన నాయకులకు, వీర మహిళలకు, జనసైనికులకు జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కొణెదల నాగబాబు పిలుపునిచ్చారు. క్రియాశీలక సభ్యత్వం ద్వారా జనసేనపార్టీతో అనుబంధం మరింత పెంపొందించు కోండి.

అందుకోసం ఫిబ్రవరి 10 నుండి ప్రారంభమయ్యే మూడవ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు నమోదు చేసికోవాలని కొణెదల నాగబాబు కోరారు.

పార్టీ జెండాను భుజాన మోసే కార్యకర్తల సంకల్పం, పట్టుదలను జనసేన ఏనాడూ విస్మరించదు. గతంలో సభ్యత్వ నమోదు చేసుకున్న వారు రెన్యువల్ చేసుకోవడానికి, కొత్తగా క్రియాశీలక సభ్యత్వం తీసికోవాలి. దీనికోసం ఫిబ్రవరి 10 నుండి 28 వరకు అందరికీ అవకాశం ఉంటుంది.

జనసేన పార్టీకి కార్యకర్తలే వెన్నుదన్ను. ముఖ్యంగా క్రియాశీలకంగా ఉండే కార్యకర్తల కృషి ఫలితంగానే పార్టీ బలంగా ప్రజల్లోకి వెళ్తుందని విశ్వసిస్తున్నాం. గత రెండు సంవత్సరాలుగా లక్షల సంఖ్యలో జనసేన క్రియాశీలక సభ్యత్వాలు నమోదయ్యాయి. ఈ సంవత్సర కూడా క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని జనసేన నాయకులను, వీర మహిళలను, జన సైనికులను కొణెదల నాగబాబు కోరారు.

ముఖ్యంగా ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియలో పార్టీ క్రియాశీలక వాలంటీర్ల కృషి మరువలేనిది. కార్యకర్తలకు భరోసాను కల్పించడం మా బాధ్యత. కార్యకర్తలు, వారి కుటుంబాలకు భరోసా ఇవ్వడం బాధ్యతగా భావించే పవన్ కళ్యాణ్ ప్రమాద బీమా ప్రీమియం కోసం తమ వ్యక్తిగత సంపాదన నుంచి ప్రతీ సంవత్సరం కోటి రూపాయలు “క్రియాశీలక కార్యకర్తల భరోసా భీమా” కోసం ఇస్తున్నారు అని నాగబాబు వివరించారు.

5 కోట్ల 40 లక్షల 90 వేల రూపాయల ప్రమాద భీమా

ఇప్పటి వరకూ 265 మంది బాధిత కుటుంబాలకు 5 కోట్ల 40 లక్షల 90 వేల రూపాయల ప్రమాద భీమా చెల్లించడం జరిగింది. కార్యకర్తలు, వారు కుటుంబాల భద్రత గురించి ఆలోచించి వ్యక్తిగత సంపాదన నుంచి కోట్ల రూపాయలు పార్టీ కార్యకర్తల కోసం వెచ్చించే అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ తప్ప ప్రపంచంలోనే ఇంకొకరు ఉండరు అనేది వాస్తవం.

వినూత్నమైన ఈ భరోసా రాజకీయ పార్టీల్లో అరుదుగా మాత్రమే కనిపిస్తుంది. క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం గత రెండు విడతలు విజయవంతంగా చేపట్టిన క్రియాశీలక వాలంటీర్లు, జనసేన నాయకులు, జన సైనికులు, వీరమహిళలు ఈ సంవత్సరం కూడా మరింత క్రియాశీలకంగా వ్యవరించాలని కొణెదల నాగబాబు కోరారు.

జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి

Spread the love