Sheik Riyaz Press meetSheik Riyaz Press meet

జనసేన కౌలు రైతు భరోసా యాత్రతో వైసీపీకి భయం
అందుకే తాడేపల్లి ప్యాలెస్ నుంచి అరుస్తున్నాయి
ఉద్యోగం ఊడ గొట్టుకున్న పెంపుడు కుక్క నాని
బందరులో ప్రజలే మిమ్మల్ని బట్టలూడదీసి కొడతారు
నువ్వు నిజాయితీపరుడివైతే పదవి ఎందుకు ఊడింది?
నాడు-నేడు రైతుల పక్షాన నిలబడింది పవన్ కళ్యాణ్’నే
జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్

జనసేన పార్టీ (Janasena Party) అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాష్ట్రవ్యాప్తంగా కౌలు రైతుల్ని (Tenant Farmers) ఆదుకుంటుంటే ఈ సీబీఐ దత్తపుత్రుడికి (CBI adopted son) వెన్నులో వణుకు పుడుతోంది. అందుకే పర్చూరు సభ (Parchur sabha) పూర్తవగానే తాడేపల్లిలో (Tadepalli) ఆయన పెంపుడు కుక్కలు మొరగడం మొదలుపెట్టాయని జనసేన పార్టీ ప్రకాశం జిల్లా (Prakasam District) అధ్యక్షులు షేక్ రియాజ్ స్పష్టం చేశారు. బాధల్లో ఉన్నవారికి భరోసా కల్పించాల్సింది పోయి, పిచ్చి వాగుడు వాగుతున్నారు అని రియాజ్ దుయ్యపట్టారు.

రైతుల పట్ల ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ది ఉంటే నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) సవాలు స్వీకరించి ఉండేవారు. పర్చూరు కౌలు రైతు భరోసా సభకు వచ్చి రైతు కుటుంబాల కన్నీటి వ్యథలు వినేవారని రియాజ్ అన్నారు.

ఎన్నికల ముందు నేను ఉన్నాను- ఎన్నికలు అయ్యాక?

మంగళగిరి పార్టీ కార్యాలయంలో (Mangalagiri Party office) పార్టీ నాయకులతో కలసి షేక్ రియాజ్ మాట్లాడారు. “ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కౌలు రైతు భరోసా యాత్ర (Kaulu Rythu Bharosa Yatra) చేపట్టి కుటుంబ పెద్దను కోల్పోయిన ప్రతి కుటుంబానికి పవన్ కళ్యాణ్ భరోసా కల్పిస్తున్నారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి (Chief Minister) జగన్ రెడ్డి (Jagan Reddy) మనుషులు అవాకులు చవాకులు పేలుతునున్నారు. ఎన్నికల ముందు నేనున్నాను.. నేను విన్నాను అన్నారు. ఎన్నికలు అయ్యాక కానరాకుండా పోయారు అని రియాజ్ ఎద్దేవా చేసారు.

ఈ రోజు రైతుల పక్షాన ఉన్నదీ, నిలబడింది పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాత్రమే. మీకు నిజంగా చిత్తశుద్ది ఉంటే మా పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారి సవాలు స్వీకరించి ఉండే వారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు న్యాయంగా ప్రభుత్వం నుంచి అందాల్సిన రూ. 7 లక్షల పరిహారం ఎగ్గొట్టిన ఘనత జగన్ రెడ్డి ప్రభుత్వానిది అని రియాజ్ అన్నారు.

ఉద్యోగం ఊడగొట్టుకున్న పెంపుడు పేర్ని నాని (Perni Nani). అతను పవన్ కళ్యాణ్ మీద అవాకులు చెవాకులు పేలడం ఆపకపోతే మీకు మీ ముఖ్యమంత్రికి శ్రీలంక గతే పడుతుంది. మిమ్మల్ని బందరులో బట్టలు ఊడదీసి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వేల కోట్ల అక్రమార్జన చరిత్ర మీది. నిన్న ఫాదర్స్ డే రోజు మిమ్మల్ని కన్న పాపానికి నాని తండ్రి ఆత్మ కచ్చితంగా దు:ఖించి ఉంటుంది అని రియాజ్ విమర్శించారు.

బాధలో ఉన్న రైతు కుటుంబాలకు  పవన్ కళ్యాణ్ రూ. లక్ష పరిహారం ఇచ్చి, వారి బిడ్డల చదువులకు కూడా అండగా నిలబడుతుంటే ఏం మాట్లాడుతున్నావ్. మీ సీబీఐ దత్తపుత్రుడికి ఒక్కటే చెప్పండి. అన్ని వేల కుటుంబాలకు భరోసాగా నిలబడిన తన కొడుకుని చూసి స్వర్గంలో ఉన్న కొణిదల వెంకట్రావు ఆనందిస్తూ ఉండి ఉంటారు. కానీ వైఎస్ రాజశేఖరరెడ్డి (Y S Rajasekhar Reddy) ఆత్మ మాత్రం పైన ఉండి కూడా తలదించుకునే పరిస్థితి అని రియాజ్ వాపోయారు.

పేర్ని నానికి ఇంట్లో విలువ లేదు, నియోజకవర్గంలోనూ విలువ లేదు. బందరులో నీ కొడుకు పేర్ని కిట్టూ చేస్తున్న రౌడీ రాజకీయ చరిత్ర మా దగ్గర ఆధారాలతో సహా ఉంది. శ్రీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయి మీకు లేదు. నువ్వు నిజంగా నిజాయితీపరుడువి అయితే నీ మంత్రి పదవి ఎందుకు పీకాడో మీ ముఖ్యమంత్రిని అడగండి అని షేక్ రియాజ్ దుయ్యబట్టారు.

రాష్ట్రవ్యాప్తంగా జరిగిన కౌలు రైతు భరోసా యాత్ర ద్వారా ఇప్పటికే పవన్ కళ్యాణ్ 272 కుటుంబాలకు సాయం అందించారు. మీ ముఖ్య మంత్రి వారిని ఆదుకుని ఉంటే మేం పార్టీ తరఫున సమాదానం చెబుతాం. సహాయం చేయలేదు అంటే మీరు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటారా?” అంటూ రియాజ్ పేర్ని నానికి సవాలు విసిరారు.

ఈ ప్రభుత్వానికి కౌలు రైతు ఉసురు తగులుతుంది: శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్

పార్టీ చేనేత వికాస విభాగం ఛైర్మన్  చిల్లపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ “కష్టాల్లో ఉన్న రైతులకు అండగా నిలబడుతున్న పవన్ కళ్యాణ్  మీద విమర్శలు చేయడానికి సిగ్గు ఉండాలి. ఆత్మహత్య చేసుకున్న ప్రతి కౌలు రైతు ఉసురు మీ ప్రభుత్వానికి తగులుతుంది. ఫాదర్స్ డే రోజు అంత మంది తమ తండ్రుల్ని కోల్పోయిన పిల్లలు ఒక వేదిక మీదకు వచ్చి వారి కష్టాలు చెప్పుకొంటున్నా ముఖ్యమంత్రిలో చలనం లేకపోవడం శోచనీయం అని అన్నారు.

ప్రకాశం జిల్లా నాయకులు వరికూటి నాగరాజు మాట్లాడుతూ “ముఖ్యమంత్రికి కౌలు రైతులు (Tenant Farmers) ఎలా ఉంటారో తెలియదన్నారు. కౌలు రైతులకు పాసు పుస్తకం ఉండదనే విషయం కూడా తెలియని వ్యక్తి రాష్ట్రాన్ని పాలించడం దురదృష్టకరమ”న్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీ అమ్మిశెట్టి వాసు, శ్రీ మండలి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

పర్చూరులో జనసేనాని కీలక సందేశం?
పచ్చమీడియా కరుపులకు జనసైనికులు సిద్ధమా

Spread the love