Supreme CourtSupreme Court

తీర్పు వెల్లడించిన ఉన్నత న్యాయస్థానం

రఘు రామరాజుకు (Raghu Rama Krishna Raju) షరతులతో కూడిన బెయిల్‌’ని సుప్రీం కోర్టు (Supreme Court) మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రఘురామపై మోపిన అభియోగాలు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించేటంత తీవ్రమైనవి కావని చెప్పింది. అందుచే పిటిషనర్‌ ఆరోగ్య పరిస్థితిని (Health Condition) పరిగణనలోకి తీసుకొని బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు సుప్రీం స్పష్టంగా చెప్పింది.

అయితే కేసు దర్యాప్తుకు రఘురామకృష్ణరాజు పూర్తిగా సహకరించాలని ఉన్నత న్యాయస్థానం (Supreme Court) పేర్కొంది. అయితే పిటిషనర్‌ మీడియా, సామాజిక మాధ్యమాల్లో (Social Media) మాట్లాడకూడదని నిబంధన పెట్టినట్లు తెలుస్తున్నది. కేసు విచారణకు అవసరమైతే కనీసం ఒక రోజు ముందు పిటిషనర్‌కు నోటీసులు ఇవ్వాలని న్యాయస్థానము అధికారులను ఆదేశించింది. న్యాయవాది సమక్షంలో దర్యాప్తు అధికారి ఎదుట హాజరవ్వొచ్చని తెలిపింది. రఘురామ, మరో ఇద్దరు వ్యక్తులు రూ.లక్ష పూచీకత్తును పది రోజుల్లో ట్రయల్‌ కోర్టులో సమర్పించాలని కూడా కోర్టు ఆదేశించింది.

అంతకుముందు ఏమి జరిగింది అంటే:

ఎంపీ రఘు రామరాజు కాలుకి తగిలిన గాయాలు నిజమే అని మెడికల్ రిపోర్టు అందించింది. రఘు రామకృష్ణ రాజు కాలు వేలికి ఫ్రాక్చర్‌తో పాటు మరికొన్ని గాయాలు కూడా ఉన్నట్లు మెడికల్ నివేదికలో పేర్కొన్నారని జస్టిస్‌ వినీత్‌ శరన్‌ అన్నారు బెయిల్‌, వైద్యపరీక్షల అంశంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రి వైద్యులు అందించిన మెడికల్ నివేదిక తమకు అందిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వినీత్‌ శరన్‌ చెప్పారు. వైద్య పరీక్షల నివేదికను ఆయన తెరిచారు. ముగ్గురు వైద్యులు పరీక్షించి ఎక్స్‌రే, వీడియో కూడా పంపారని తెలియ జేశారు. రఘు రామరాజుకు జనరల్‌ ఎడిమా ఉందని చెప్పారు

మేము చేసిన ఆరోపణలు నిజమని నేడు తేలాయి: ముకుల్‌ రోహత్గీ

కస్టడీలో చిత్రహింసలు పెట్టారని తాము చేసిన ఆరోపణలు నిజమని నేడు తేలాయని రఘురామ తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ అన్నారు. ఏపీ సీఐడీ అధికారుల చిత్రహింసలపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన కోరారు. సిట్టింగ్‌ ఎంపీకే ఇలా జరిగితే సామాన్యుడి పరిస్థితేంటని ఆయన ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది దుష్యంత్‌ దవే స్పందిస్తూ రఘురామే స్వయంగా చేసుకున్న గాయాలా? కాదా? అన్నది తెలియ దన్నారు. వైద్య పరీక్షల నివేదికను ఏపీ ప్రభుత్వం, న్యాయవాదులకు మెయిల్ చేస్తామని తెలిపింది. 

Allocations to Kapu Corporation in AP Budget