సైదాబాద్ (Saidabad) బాలిక హత్యాచార (Rape) ఘటనలో నిందితుడిగా ఉన్న పల్లకొండ రాజు (Pallakonda Raju) ఆత్మహత్య చేసుకున్నాడు అని నిర్ధారణ అయ్యింది. ఏడు సంవత్సరాలు కూడా నిండని బాలిక హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) పెద్ద సంచలనం సృటించిన విషయం తెలిసిందే. స్టేషన్ ఘన్‌పూర్ (Station Ghanpur) సమీపంలోని నష్కల్ రైల్వే ట్రాక్‌పై (Railway Track) నిందుతుడు అయిన రాజు మృతదేహాన్ని గుర్తించారు. నిందితుడి చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా మృతదేహాన్ని రాజుగా నిర్ధారించారు. మృతదేహాన్ని వరంగల్ (Warangal) ఎంజీఎం ఆస్పత్రికి (MGM Hospital) తరలించారు. నిందితుడి రాజు మృతిని డీజీపీ మహేందర్‌రెడ్డి కూడా ధ్రువీకరించారు. స్టేషన్ ఘన్‌పూర్ వద్ద మృతదేహాన్ని గుర్తించామని, నిందితుడి శరీరంపై ఉన్న గుర్తుల ఆధారంగా నిర్ధారించినట్లు ఆయన తెలియజేసారు.
సైదాబాద్ సింగరేణి కాలనీలో (Singareni Colony) ఆరేళ్ల బాలికపై ఈనెల 9న హత్యాచారం జరిగిన విష్యం తెలిసిందే. ఈ ఘటన తర్వాత నిందితుడిగా ఉన్న రాజు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చేపట్టారు. రాజు ఆచూకీ తెలిపిన వారికి పోలీసులు రూ.10లక్షల నగదు రివార్డుని కూడా ప్రకటించారు. నిందితుడి కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు జల్లెడ పట్టారు. అనేకమంది పోలీసు సిబ్బంది ఈ గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. నిందితుడి కోసం గాలింపు కొనసాగుతుండగానే స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలో మృతదేహాన్నిగుర్తించినట్లు తెలుస్తున్నది. అన్ని వైపులా పోలీసులు నిందితుడిని చుట్టుముట్టడంతో రాజు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అందరూ భావిస్తున్నారు.