Dharmo RakshithiDharmo Rakshithi

ధర్మో రక్షతి రక్షితః నలందా విద్యాలయంపై భక్తియార్ ఖిల్జీ సుమారు కీ. శ 1193లో దండయాత్ర చేసినప్పుడు భారతీయులు ఘోరంగా ఓడిపోయారు. ఆ దాడిలో భారతీయ విజ్ఞాన భాండాగారం తగులబెట్టబడింది. భారతీయ సంప్రదాయానికి సంబంధించి విజ్ఞాన ఘని కూడా చాలా వరకు నాశనం చేయబడింది.

నాడు దాడిచేసిన ఖిల్జీ సైనికులు సుమారు రెండు వేలు. కానీ విద్యాలయంలో ఉన్నవాళ్లే సుమారు 25 వేలు. అయినా ప్రతిఘటించలేకపోయారు. నాకు ఎందుకు అని మిన్న కుండిపోయారు.

నాడు భారతీయులు ఓడిపోవడానికి ప్రాధాన కారణాలు: 

ఐకమత్యం లేకపోవడం, ఖర్మ సిద్దాంతం, దేవుడే చుసుకొంటాడులే అనే నిర్లిప్తత, దేశ భక్తి లేకపోవడం. మతాల్లో కుల పిచ్చితో కూడిన విభజన వాదం, నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ.

నాడు నలంద నాశనంతో భారతదేశం అనేక విధాలుగా నాశనం అయ్యింది అని నాటి ప్రప్రంచ చరిత్ర కారులే చెప్పారు.

హైయందవ సంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని కాపుడుకోవడం ప్రతీ భారతీయుడి బాధ్యత. ఇది ఏ ఒక్క మతానికి సంబంధించినది కాదు.

తిరుమలలోకి అన్యమతస్తులు వెళ్ళడం తప్పో ఒప్పో అని మాత పెద్దలు చెప్పలేక పోతున్నారు. ఒకవేళ వెళితే డిక్లరేషన్ ఇవ్వాలో వద్దా అని చెప్పలేని స్థితిలో పీఠాలు, పీఠాధిపతులు జాతీయ పార్టీలు ఉండడం విచారకరం.

మత విశ్వాసాలను గౌరవించాల్సిన పాలకులే అగౌరపరచే విధంగా మాట్లాడుతున్నారు. అయినా అడిగే వ్యవస్థలు గాని, ప్రజలు కానీ నేడు లేకపోవడం దురదృష్టం.

అన్నీ మతాలను సమానంగా గౌరవించాలి. అలానే మతం ఏదైనా భారతీయ సంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని, నిలబెట్టుకోవాలిసిన అవసరం నేడు ఎంతైనా ఉంది.

ఓట్ల కోసం చెప్పే విభజన వాదంతో వచ్చే మోసపూరిత లౌకిక వాదులను/ అవినీతి పార్టీలను నమ్మ డం మంచిదేనా? అని ఒక్కసారి ఆలోచించండి. అలాగే ఢిల్లీలో శ్రీ రామ్ అంటూ రాష్ట్రాల్లో ప్రభు రామ్ అంటున్న బూటకపు జాతీయ పార్టీలను కూడా నమ్మడం మంచిదేనా?

ఆలోచించండి… లౌకిక వాదం అంటే అన్నీ మతాలను సమానంగా చూడడమేనా లేక కొన్ని మత విశ్వాసాలను అగౌర పరచడం కాదు కదా?

ధర్మో రక్షితి రక్షతః అనే మాటకు నేడు విలువ ఉందా? ఉంటే అది ఎక్కడవుంది.