దశాబ్దాలుగా అంతర్జాతీయ స్థాయిలో వేళ్ళూనికొని పోయిన బియ్యం మాఫియాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన పోరాటం కొనియాడదగినదే.
రైతుల పొట్టకొట్టి ప్రభుత్వం సేకరించిన బియ్యాన్ని ప్రభుత్వాలు పేదలకు ఉచితంగా ఇస్తున్నది. పేదలు పేరుతో తీసికొన్న వారు ద్వారంపూడి లాంటి వారికి సుమారు 10 రూపాయలకు అమ్మేస్తున్నారు. ద్వారంపూడి లాంటి వ్యాపారస్తులు ఆ కొన్న పేదల బియ్యాన్ని ప్రభుత్వాల కళ్ళు గప్పి అక్రమంగా ఎగుమతి చేసేస్తున్నారు? అలా ఎగుమతి చేస్తున్న ద్వారంపూడి లాంటి అక్రమ వ్యాపారులపై చర్యలు తీసుకుకోవాలి అంటే కట్టుదిట్టమైన చట్టాలు ఉండాలి. అలానే పీఎంఓ, సీఎంఓతో సహా యావత్తు ప్రభుత్వ యంత్రాంగం మద్దతు పవన్ కళ్యాణ్ కి ఉండాలి. లేకపోతే ద్వారంపూడి లాంటి అక్రమ వ్యాపారుల పీచం అణచివేయడం సాధ్యం కాకపోవచ్చు.
అయితే ద్వారంపూడి దందాని అణిచివేస్తే సమస్యకు పరిస్కారం జరగదు. సమస్యకు మూలాలు ఏమిటీ పరిస్కారాలు ఏమిటి అంటూ అక్షర సత్యం జనసేనానికి పంపిన కొన్ని ట్వీట్ల సారాంశం:
అక్షర సత్యం ట్వీట్ల ద్వారా అన్నదాతల ఆవేదనల సారాంశం
1. పవన్ కళ్యాణ్ గారు! రైతుల నుండి వంద రూపాయల విలువైన బియ్యాన్ని ప్రభుత్వం సుమారు 30 రూపాయలకు కొంటున్నది. ప్రభుత్వం 30 పురుపాయిలకు కొన్న బియ్యానికి ప్రభుత్వ ఖర్చులు, జీతాలు కలిపితే కేజీకి సుమ్మారు 49 రూపాయిలు అవుతున్నది. అలా వంద రూపాయల విలువైన బియ్యాన్ని సుమారు ౩౦ రూపాయలకు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కోసం ప్రభుత్వం కొంటూ, రైతులను మోసం చేస్తున్నది. రైతుల నుండి కొన్న 49 రూపాయిల బియ్యాన్ని PDS ద్వారా పేదల పేరుతో ప్రజలకు ఉచితంగా ఇస్తూ ప్రభుత్వం మళ్ళీ రైతులను మోసం చేస్తున్నది.
2. రైతు పండించిన 100 రూపాయిల విలువైన రూపాయిల బియ్యాన్ని ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసికోకుండా ఉచితంగా ప్రజలకు ఇస్తుంటే
3. ప్రజలు మాత్రం ఆ 49 రూపాయిల బియ్యాన్ని ద్వారంపూడి లాంటి వాళ్ళకి 10 రూపాయిలుకి అమ్మేస్తున్నారు. ఆ విధంగా కూడా ప్రజలు మరల రైతులనే మోసం చేస్తున్నారు. ఏడు దశాబ్దాలుగా ఇదే తంతు జరుగుతున్నది. రైతుల ఎన్నో లక్షల కోట్ల రూపాయిలును వ్యాపారస్తులు, దళారులు, రాజకీయ నాయకులూ ఈ విధంగా బొక్కేస్తున్నారు. మీలాంటి వారు తీసుకొన్న చొరవతో ఈ పోరాటంలో మీరు విజయం సాధిస్తే ఆకలితో అలమటించే అన్నదాత మీకు రుణపడి ఉంటాడు.
4. పది రూపాయలకు పేదలు అనబడే ప్రజల నుండి కొన్న బియ్యాన్ని ద్వారంపూడి లాంటి వ్యాపారస్తులు సుమారు 100 రూపాయలకు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇక్కడ రైతుకి వచ్చేది కేవలం ౩౦ రూపాయిలు. అయితే ద్వారపూడి లాంటి వాళ్లకు వచ్చేది కేజీకి వంద రూపాయిలు అనే వార్తలు వింటున్నాం. ఈవిధంగా కూడా ద్వారంపూడి లాంటివాళ్లు రైతులకు అన్యాయం చేస్తున్నారు.
5. 49 రూపాయిల బియ్యాన్ని ప్రభుత్వం ఉచితంగా ప్రజలకు ఇవ్వడం ఆపాలి. ఒకవేళ ప్రభుత్వం ఇవ్వాలి అనుకొంటే కేజీకి సుమారు 50 రూపాయిల చొప్పున సంబధిత పేదలకి డైరెక్ట్ గా నగదు ట్రాన్స్ఫర్ చేయడం వలన మొత్తం సమస్యను పరిష్కరించ వచ్చును. ద్వారంపూడి లాంటివారిని అణచివేసే విధానంతో సమస్య పరిస్కారం కాదు. రెడ్డిగారి దందాని అణచివేస్తే కారంచేడు చౌదరు గారు లాంటి వారి దందానో లేక మరొక్కరి దంధానో పుడుతూనే ఉంటాయి. ఈ అక్రమ వ్యాపారస్తులు రైతుల నోట్లో మట్టి కొడుతూనే ఉంటారు. పబ్లిక్ డిస్త్రిపుటిన్ సిస్టం కోసం అన్నదాతలకు అన్నాయం చేయడంపై పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ పరులే పోరాటం చేయాలి. లెవీ విధానంపై, PDS పాలసీలపై, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, చచ్చుబడ్డ వ్యవస్థలపై జనసేనాని కేంద్ర రాష్ట్ర పాలిసీలపై పోరాడాలి.
6. PDS కోసం మద్దతు ధర నిర్ణయంలో ప్రభుత్వం జోక్యం వలన అన్నదాతలకు అన్యాయం జరుగుతున్నది. PDS విధానం వల్ల దళారులకు, మిల్లరులకు, ద్వారంపూడి లాంటి నాయకులకు మాత్రమే లాభాలు చేకూర్చుతున్నది. ప్రస్తుత పీడీఎస్ సిస్టమ్ వల్ల రైతులు, ప్రభుత్వం, టాక్స్ పేయర్స్ తీవ్రంగా నష్టపోవడం జరుగుతున్నది.
7. ప్రస్తుతం ఉన్న పబ్లిక్ డిస్త్రిపుటిన్ సిస్టంని మార్చగలిగితే దళారులు, ద్వారంపూడి లాంటి వ్యాపారస్తులను శాశ్వతంగా కట్టడి చేయవచ్చు. తద్వారా ప్రభుత్వానికి, అన్నదాతలకు లక్షల కోట్ల ఆదాయం చేకూర్చవచ్చు.
8. ప్రభుత్వ డిస్ట్రిబ్యూషన్ సిస్టం, లెవీ విధానం, ప్రభుత్వ మద్దతు ధరల నిర్ణయం, బియ్యం అక్రమ వ్యాపార నివారణ సంబంధిత పూర్తి వివరాలకు మేము సదా సిద్ధమే అని తెలియ జేస్తున్నాం.
9. అంజనీపుత్రా! బియ్యం అక్రమ రవాణా నివారణకుగాని మీరు చేస్తున్న ఉద్యమం విజయం సాధిస్తే, యావత్తు రైతు, రైతు కుటుంబాల ఆశీస్సులు మీకు సదా ఉంటాయి. వాళ్ళు అందరూ మీకు ఎప్పటికీ సదా రుణపడి ఉంటారు అని తెలియచేస్తున్నాను.
10. అత్యవసర పరిస్థితుల్లో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం ద్వారా ప్రభుత్వం ఏమైనా ఇవ్వాల్సి వస్తే, మార్కెట్ ధరల్లో సేకరించి పంచాలి గాని లెవీ విధానం వల్ల కాదు అన్నదాతల భావనని గమనించండి