Janasena Party symbolJanasena Party symbol

జనసేన పార్టీకి (Janasena Party) ఎన్నికల గుర్తుగా (Election Symbol) మళ్ళీ గాజు గ్లాసునే (Glass tumbler) ఎన్నికల సంఘం (Election commission) కేటాయించింది. తెలంగాణ (Telangana), ఆంధ్రాలో (Andhra) జరగబోయే అన్ని ఎన్నికలకు జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేస్తుందని జనసేన పార్టీ ప్రకటించడంతో జనసేన పార్టీ క్యాడర్ లోను, ప్రజల్లోనూ, సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది.

రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రావాలన్నా, అణగారిన వర్గాలకు అధికారం దక్కాలన్నా సామాన్యుని సైకిల్, సామాన్యుని గ్లాసుకే ఓటు వేయాలని జనసేన పార్టీ ఒక జనసేన కార్టూన్ విడుదల చేసింది.

వైసీపీ ప్రభుత్వంపై (YCP Government) ఏపీ సీఎం జగన్ రెడ్డిపై (AP CM Jagan Reddy) జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో విడుదల చేస్తున్న జనసేనాని కార్టూన్ (Janasenani Cartoon) పర్వం కొనసాగుతూనే ఉన్నది.

2024 లో రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ వ్యూహాలు చిత్తు అవుతాయి. జగన్ ప్రభుత్వం పడిపోతుంది అనే అర్ధం వచ్చేటట్లు జనసేనాని పవన్ కళ్యాణ్ తన వంగ్య కార్టూన్ల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు.

జగనన్న ప్రభుత్వంపై జనసేనాని పవన్ కళ్యాణ్ విడుదల చేస్తున్న కార్టూన్లపై వైసీపీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్’కి ఘాటుగానే ప్రతిస్పందిస్తున్నారు. మొత్తం మీద ఏపీ రాజకీయాలు వైసీపీ-జనసేనల మధ్య రసవత్తరంగానే కోనసాగుతున్నాయి అని చెప్పాలి.

మరో ఆరు నెలల్లో అణగారిన వర్గాలకు అధికారం: పవన్ కళ్యాణ్

Spread the love