Tuni CommitteeTuni Committee

జనసేన పార్టీ (Janasena Party) తుని మండల కమిటీ (Tuni Mandal Committee) ప్రమాణస్వీకారం అత్యంత వైభవంగా జరిగింది. దీనితో తుని నియోజకవర్గ జనసేన కార్యకర్తల్లో (Janasena Cadre) ఉత్సాహం రెట్టింపు అయ్యింది అని చెప్పాలి.

తుని నియోజక వర్గం, తుని మండలంలోని తేటగుంట (Tetagunta) గ్రామంలో ఈ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి బోడపాటి శివదత్, రాష్ట్ర జనసేన పార్టీ మత్సకార విభాగ కార్యదర్శి చొక్కా కాశీ విశ్వేశ్వరరావు, తుని జనసేన (Tuni Janasena) పార్టీ నాయకులూ బోనం చినబాబు పాల్గొన్నారు.

దారకొండ వెంకటరమణ తుని జనసేన పార్టీ మండల అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అనంతరం జనసేన పార్టీ మండల కమిటీ సభ్యులు కూడా ప్రమాణం చేయడం జరిగింది.

Tuni committee 2
Tuni committee 2

జనసేన పార్టీ మండల కమిటీ ప్రమాణ స్వీకారం అనంతరం జనసేన పార్టీని తుని మండలంలో ఎలా బలోపేతం చెయ్యాలి అనేదానిపై పార్టీ కార్యకర్తలకు వివరించారు. సమావేశానికి విచ్చేసిన నాయకులు (Janasena Leaders) జనసేన కార్యకర్తలకు వివిధ సూచనలను కూడా ఇవ్వడం జరిగింది.

రాష్ట్ర, జిల్లా, తాలూకా నాయకులూ ఇచ్చిన ప్రసంగాలతో… దిగ్విజయంగా ముగిసిన కార్యక్రమంతో తుని మండల జనసేన కార్యకర్తల్లో ఉత్సాహం పెల్లుబికితున్నది అని చేప్పాలి.

వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దురాగతాలను బోనం చినబాబూ తదితర జనసేన నాయకులు జనసేన కార్యకర్తలకు వివరించడం జరిగింది.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) సంయుక్త కార్యదర్శి పలివెల లోవరాజు, తుని టౌన్ నాయకులు ఉప్పల పాటి సీతారామరాజు, అద్దేపల్లి బాలాజీ, తొండంగి మండల ప్రధాన కార్యదర్శి గట్టెం నాగబాబు, కోటనందూరు మండల ఉపాధ్యక్షులు ఇండగపల్లి రామకృష్ణ, తొండంగి మండల జనసేన పార్టీ ప్రెసిడెంట్ బెండపూడి నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

తుని తాలూకా (Tuni Taluq) నాయకులు, తుని మండల, తొండంగి మండల, నందురు మండల కార్యకర్తలు, నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జోరువానలోను జనవాణికి క్యూ కట్టిన బాధితులు
సమస్యల వెల్లువతో చలించిన జనసేనాని