Adhimulapu sureshAdhimulapu suresh

ఏపీలో (AP) పరిస్థితులకు అనుగుణంగా స్కూళ్ల నిర్వహిస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ (Adimulapu Suresh) తెలిపారు. స్కూళ్లకు, కరోనా వ్యాప్తికి సంబంధమే లేదని మంత్రి సురేష్ వివరించారు. గత రెండేళ్లలో కరోనా దృష్ట్యా పరీక్షలు నిర్వహించలేదని… విద్యా సంవత్సరం (Academic year) నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని సోమవారం మంత్రి మీడియాతో (Media) మాట్లాడుతూ చెప్పారు. విద్యార్థుల భవిష్యత్, ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని వ్యాక్సినేషన్‌ ప్రక్రియ (Vaccination Process0 కొనసాగిస్తామని అయిన వివరించారు.

విద్యార్థులకు 90 శాతం మేర వ్యాక్సినేషన్ పూర్తి చేశామని మంత్రి సురేష్ వివరించారు. కరోనా (Carona) వ్యాక్సినేషన్‌ పూర్తి కాలేదని స్కూళ్లను తెరవొద్దంటూ.. ప్రతిపక్షాలు (Opposition Parties) కామెంట్లు చేయడం దురదృష్టకరమని మంత్రి అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు (Inter exams) పెట్టలేక పోయినా ఏపీలో నిర్వహించామని సురేష్ తెలిపారు. ఆన్‌లైన్ బోధన ఒక లెవల్ వరకే పరిమితమని అన్నారు. క్లాసులకు ఫిజికల్‌గా వెళ్లడానికి ఆన్‌లైన్ బోధన ప్రత్యామ్నాయం కాదని మంత్రి సురేష్ వివరించారు.

రాష్ట్రంలో కొవిడ్‌  (Covid) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సెలవులు పొడిగించడమో.. లేక ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించడమో చేస్తారని విద్యార్థులు, తల్లిదండ్రులు భావించారు.
అయితే సంక్రాంతి సెలవులు ముగియడంతో రాష్ట్రంలో పాఠశాలలు, ఇంటర్‌ కళాశాలలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. దీనికితోడు పొరుగు రాష్ట్రం తెలంగాణలో (Telangana) కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ నెల 30 వరకు సెలవులు పొడిగించడంతో మన రాష్ట్రంలోనూ సెలవులు పొడిగించవచ్చని అందారూ అనుకున్నారు. కానీ సెలవులపై పునరాలోచన లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇంటిఅద్దె కూడా కట్టుకోలేని స్థితిలో గుల్జారీలాల్ నందా?

Spread the love