మెగాస్టార్ చిరంజీవి (Megastar) నటిస్తున్న గాడ్ ఫాదర్ (GodFather) సినిమాలో పురీ జగన్నాధ్ (Puri Jagannadh) నటిస్తున్నట్లు చిరు ట్వీట్ ద్వారా తెలిపారు. అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా అంటూ దర్శకుడు పూరి జగన్నాథ్‌ను గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్‌లోకి మెగాస్టార్ చిరంజీవి ఆహ్వానించారు. దర్శకుడు పురీ జగన్నాధ్ నటుడు అవ్వాలని సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టారు. కానీ నటుడు కాలేక పోయారు కానీ బద్రి (Badri) సినిమాతో దర్శకుడు అయ్యారు.
ఆ తరువాత ఆయన దృష్ఠి దర్శకత్వం వైపే కొనసాగింది. బుల్లితెరపై ప్రసారమైన ధారావాహికకు కూడా దర్శకత్వం వహించారు. ఈ క్రమంలో భాగంగానే పవన్ కళ్యాణ్‌కు బద్రి కథను పురీ జగన్నాధ్ చెప్పడం జరిగింది. ఆ తరువాత సినిమా మంచి బ్లాక్ బస్టర్ (Block Buster) సాధించడం జరిగిపోయాయి.
దర్శకత్వం చేస్తూనే అప్పుడప్పుడు పూరి జగన్నాధ్ సిల్వర్ స్క్రీన్ (Silver Screen) మీద అప్పుడప్పుడు తళుక్కున మెరుస్తున్నారు. ఇప్పటికే అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya), సమంత (Samanatha) జంటగా నటించిన ఏ మాయ చేసావే, ఎన్.టి.ఆర్ హీరోగా ఆయన దర్శత్వంలో వచ్చిన టెంపర్, రామ్ పోతినేనితో తీసిన ఇస్మార్ట్ శంకర్ (Ismart Shankar) చిత్రాలలో కొంతసేపు నటించారు.
తన అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’లో పురీ జగన్నాధ్ కనిపించ బోతున్నారు. ఈ విషయాన్నీ ఎట్టకేలకు మెగాస్టార్ ఈరోజు స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ పెట్టి ధ్రువీకరించారు.
అందరినీ ఆకొట్టుకొన్న చిరు ట్వీట్
నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు, వెండితెర పైన నటుడిగా ఒక వెలుగు వెలగాలని హైదరాబాద్ వచ్చాడు. ఒకటి అరా వేషాలు కూడా వేసాడు. ఇంతలో కాలం చక్రం తిరిగింది. స్టార్ డైరెక్టర్ (Star Director) అయితే అయ్యాడు. కానీ, అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా అంటూ చిరు ఈ విషయాన్ని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది.