జనసేన అధ్యక్షులు (Janasena President) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) విశాఖ ఉక్కు (Visakha Steel Plant) పరిరక్షణ సమితి సభకు హాజరు కానున్నారు. విశాఖలోని స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో ఈ నెల 31 న మధ్యాన్నం 2 గంటలకు ఈ సభ ప్రారంభం కానుంది. విశాఖ ఉక్కు కర్మాగారం అమ్మకానికి వ్యతిరేకంగా చేస్తున్న తమ పోరాటానికి అండగా ఉండాలని విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి విజ్ఞప్తి చేస్తున్నది. అలానే సభలో పాల్గొని కర్మాగారం అమ్మకానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి జనసేనాని (Janasenani) మద్దతు తెల్పాల్సిందిగా ఈ సమితి విన్నవించు కొంటున్నది.
ఆ మేరకు 31వ తేదీన పవన్ కల్యాణ్ విశాఖపట్నం (Visakhapatnam) చేరుకొని అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ ప్రాంగణానికి వెళ్ళి పరిరక్షణ సమితి ప్రతినిధులను కలసి వారు నిర్వహించే సభలో పాల్గొంటారు. 31వ తేదీ మధ్యాహ్నం 2గం.కు సభ ప్రారంభమవుతుంది.
ఇంతకీ సమస్య ఏమిటంటే?
పాలక పక్షమైన వైసీపీ (YCP), ప్రతిపక్షమైన తెలుగుదేశం (Telugudesam) విశాఖ (Visakha) ఉక్కు పరిశ్రమ అమ్మకాన్ని ఆపలేకపోయాయి. ఈ విషయంలో ఈ రెండు పార్టీలు తీవ్రంగా విఫలమయ్యాయి. మరొక పక్కన జనసేన (Janasena) బీజేపీతో (BJP) పొత్తులో ఉన్నదీ. ఈ నేపథ్యంలో జనసేనాని ఏవిధంగా ప్రసంగించ బోతున్నారు. బీజేపీతో ఏవిధంగా పోరాడబోతున్నారు.
జనసేన-బీజేపీల మధ్య ఉన్న పొత్తు (Alliance) ఎలాగైనా చెడిపోవాలి అని పాలక పక్షం, ప్రధాన ప్రతిపక్షం బలంగా కోరుకొంటున్నాయి. వారు వేసే ప్రతీ అడుగు ఆవిధంగానే వేస్తున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య ఉన్న పొత్తు చెడిపోవాలి అని కొంతమంది రాష్ట్ర బీజేపీ నేతలు (State BJP Leaders) కూడా కోరుకొంటున్నట్లు తెలుస్తున్నది. రాజ్యాధికారం (Rajyadhikaram) ఆ రెండు పార్టీల నుండి జారిపోకుండా ఉండడం కోసమే వీరు పావులు కదుపుతున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో జరగబోతున్న జనసేనాని మీటింగ్ ఎలా ఉండబోతున్నది అని సర్వత్రా ఎదురు చూస్తున్నారు.
విశాఖ ఉక్కు బాధితులకు అండగా జనసేనాని ఉంటే బీజేపీతో స్పర్ధలు రావచ్చు. అలానే బీజేపీతో ఉన్న పొత్తువల్ల, బాధితులకు అండగా జనసేనాని ఉండ లేకపోతే ప్రజల్లో అపనమ్మకం వచ్చేటట్లు కుల మీడియా విష ప్రచారం చేసే అవకాశం ఉన్నది. జనసేనాని పరిస్థితి ముందు గొయ్యి, వెనుక నుయ్యి అన్నట్లు ఉంది అనేది అక్షర సత్యం (Akshara Satyam) భావిస్తున్నది. ఏమైనప్పటికి ఈ ఆదివారం జరగబోతున్న జనసేనాని మీటింగ్ రాష్ట్ర రాజకీయాల్లో (AP Politics) ప్రకంపనలు సృష్టించబోతున్నాదా? ఆలోచించండి.