Chegondi prakashChegondi prakash

జనసేన (Janasena) పిఎసి సభ్యునిగా (PAC member) చేగొండి సూర్య ప్రకాష్ (Chegondi Surya Prakash) నియామకం జరిగింది. జనసేన పార్టీ కమిటీలలో మరికొన్ని నియామకాలకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆమోదం తెలిపారు. పార్టీలో అత్యున్నతమైన రాజకీయ వ్యవహారాల కమిటీ (పి.ఎ.సి.)లో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చేగొండి సూర్యప్రకాష్’ని సభ్యునిగా నియమించారు.

అదే విధంగా కాకినాడ, రాజమండ్రి, ఒంగోలు, తిరుపతి నగరాలకు అధ్యక్షుల్ని నియమించారు.  సంగిశెట్టి అశోక్ (కాకినాడ),  యర్నాగుల శ్రీనివాసరావు (రాజమండ్రి),  మలగా రమేష్ (ఒంగోలు),  జగదీష్ రాజారెడ్డి (తిరుపతి)లను నగర అధ్యక్షులుగా నియమించారు.

మొగిలయ్యకు కెసిఆర్ బంపర్ ఆఫర్
కోటి రూపాయిలు, ఒక ఇళ్ల స్థలం

Spread the love