Nirmala in Loksabha Nirmala in Loksabha

ఆర్థిక సర్వేను (Economic Survey) కేంద్ర ఆర్థికమంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Seetharaman) సోమవారంనాడు లోక్‌సభలో (Lok Sabha) 2021-22 ప్రవేశపెట్టారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు (Indian Economy) దిశానిర్దేశం చేసేదిగా ఈ సర్వేను భావిస్తారు. దీని ఆధారంగానే ప్రతి ఏటా బడ్జెట్ (Budget) రూపకల్పన జరుగుతుంటుంది. కేంద్ర బడ్జెట్ (Central Budget) ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు ”ఆర్థిక సర్వే”ను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ ప్రక్రియలో భాగంగానే ఆర్ధిక సర్వేను ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభకు సమర్పించారు. అనంతరం సభను ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు సభాపతి ఓం బిర్లా ప్రకటించారు.

రాబోయే ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు (Growth rate) 8 నుంచి 8.8.5 శాతంగా ఉండొచ్చనే అంచనాల నేపథ్యంలో ఆర్ధిక సర్వేను మంత్రి ప్రవేశపెట్టారు. సర్వే వివరాలను ఆర్థిక శాఖ ప్రత్యేక మీడియా సమావేశంలో (Press meet) వెల్లడించనున్నది.

ఆర్ధిక సర్వే ప్రవేశపెట్టడానికి ముందు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను (Budget session) ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి (President) రామ్‌నాథ్ కోవింద్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించడం ద్వారా ప్రారంభించారు. భారతదేశం సాధించిన ప్రగతి, పథకాలు, భవిష్యత్‌ లక్ష్యాలను రాష్ట్రపతి తన ప్రసంగంలో వివరించారు.

ఆర్ధిక సర్వే ప్రధానాంశాలు

దేశ ఆర్థిక వ్యవస్థ కొవిడ్‌ (Covid) కష్టాల నుంచి బయటపడిందని ప్రస్తుత ఆర్థిక సంవత్సర ఆర్థిక సర్వే ప్రకటించింది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టారు.

వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23) జీడీపీ వృద్ధి రేటు 8 నుంచి 8.5 శాతం నమోదు చేసే అవకాశం ఉందని తెలిపింది.

బ్యారల్‌ చమురు ధర 70-75 డాలర్ల మధ్య ఉండవచ్చనే భావనతో ప్రభుత్వం ఈ అంచనాకు వచ్చింది. ప్రస్తుతం బ్యారల్‌ ముడి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో 90 డాలర్లు పలుకుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి9.2 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.

ద్రవ్యోల్బణంపై మౌనం

వచ్చే ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణం (Inflation) ఎలా ఉంటుందనే అంశంపై ఆర్థిక సర్వే మాట్లాడలేదు. ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) మాత్రం రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని ఆరు శాతం లోపు కట్టడి చేయడంలో చాలా వరకు విజయం సాధించామని చెప్పుకుంది. సరఫరాలు మెరుగుపరచడం, సుంకాల తగ్గింపు ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ వంట నూనెలు, పప్పుల ధరల్ని నియంత్రించినట్టు తెలిపింది.

పన్ను వసూళ్లు?

పన్ను వసూళ్లపైనా ఆర్థిక సర్వే సంతృప్తి వ్యక్తం చేసింది. 2021 నవంబరుతో ముగిసిన ఎనిమిది నెలల్లో కేంద్ర ప్రభుత్వ పన్నుల వసూళ్లు, అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 50 శాతం పెరిగినట్టు తెలిపింది. గత ఏడాది జూలై నుంచి నెలవారీ జీఎ్‌సటీ వసూళ్లూ రూ.లక్ష కోట్లపైనే ఉంటున్నట్టు వెల్లడించింది. దీంతో కష్టాల్లో ఉన్న రంగాలను ఆదుకునేందుకు అవసరమైతే మరింత సాయం చేసేందుకూ వీలవుతుందని సంకేతాలిచ్చింది.

బారులు తీరిన రిటైల్‌ ఇన్వెస్టర్లు

స్టాక్‌ మార్కెట్లో రిటైల్‌ మదుపరుల పెట్టుబడులపైనా ఆర్థిక సర్వే ప్రత్యేక దృష్టి పెట్టింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో నెలకు సగటున 4లక్షల డీమ్యాట్‌ ఖాతాలు కొత్తగా ఓపెన్‌ అయితే, ఈ ఆర్థిక సంవత్సరం అది 26 లక్షలకు చేరినట్టు పేర్కొంది. దీంతో నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎ్‌సఈ) టర్నోవర్‌లో 2019-20లో 38.8 శాతంగా ఉన్న రిటైల్‌ మదుపరులు వాటా ఏప్రిల్‌-అక్టోబరు మధ్య కాలానికి 44.7 శాతానికి చేరిన విషయాన్ని గుర్తు చేసింది. కొవిడ్‌ నుంచి ఆర్థిక వ్యవస్థ బయట పడుతుందన్న గట్టి నమ్మకంతో రిటైల్‌ మదుపరులు పెద్ద సంఖ్యలో షేర్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్లలో పెట్టుబడులు పెడుతున్నట్టు తెలిపింది.

ఉద్దీపన పథకాలకు రాంరాం!

కొవిడ్‌ కష్టాల నుంచి ఆర్థిక వ్యవస్థ బయటపడేందుకు ప్రకటించిన ఉద్దీపన చర్యల్ని, మంగళవారం ప్రకటించే కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా?అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కోలుకున్న బ్యాంకులు

గత ఆర్థిక సంవత్సరం (2020-21)తో పోలిస్తే 2021-22 ఆర్థిక సంవత్సరం దేశంలోని వాణిజ్య బ్యాంకుల ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని ఆర్థిక సర్వే పేర్కొంది. 2020 సెప్టెంబరుతో పోలిస్తే 2021 సెప్టెంబరుతో ముగిసిన ఆరు నెలల్లో దేశంలోని వాణిజ్య బ్యాంకుల నికర లాభాలు రూ.59,426 కోట్ల నుంచి రూ.78,729 కోట్లకు పెరిగిన విషయాన్ని గుర్తు చేసింది.

మౌలికమే కీలకం

2025 నాటికి భారత్‌ను 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలంటే మౌలిక రంగంలో (infrastructure) పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని సర్వే స్పష్టం చేసింది. ఇందుకోసం ఎంత లేదన్నా కనీసం 1.4 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు అవసరం అవుతాయని అంచనా వేసింది.

చిప్‌’ల తయారీకి చేయూత

ఆటోమొబైల్‌, ఎలకా్ట్రనిక్‌ పరిశ్రమలను వేధిస్తున్న చిప్‌ల కొరతనీ సర్వే గుర్తుచేసింది. ఈ కొరతతో అనేక పరిశ్రమల్లో ఉత్పత్తి ఆగిపోవడమో, కుంటుపడడమో జరిగిందని తెలిపింది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు దేశంలోనే చిప్‌లు, డిస్‌ప్లే తయారీని ప్రోత్సహించేందుకు రూ.76,000 కోట్లతో ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించింది. ఈ పథకాన్ని పీఎల్‌ఐతో ముడిపెట్టడంతో భారత్‌ అంతర్జాతీయ చిప్‌ల తయారీ కేంద్రంగా ఎదిగే అవకాశం ఏర్పడిందని తెలిపింది.

ఇళ్ల ధరలు పడిపోలేదు

కొవిడ్‌ మొదటి, రెండో దశల కారణంగా దేశంలో ఇళ్ల విక్రయాలు తగ్గినప్పటికీ.. చాలా నగరాల్లో ధరలు మాత్రం తగ్గలేదని సర్వే తెలిపింది. కొన్ని నగరాల్లో అయితే ధరలు పెరిగాయని వెల్లడించింది. అంతేకాదు గృహాల కొనుగోళ్లకు డిమాండ్‌ అనూహ్యంగా పెరిగిందని తెలిపింది. ధరలు పెరిగిన నగరాల్లో హైదరాబాద్‌, గాంధీనగర్‌, బెంగళూరు, ముంబై సహా పలు నగరాలున్నాయని పేర్కొంది.

పెద్దమనిషి వేధింపులు తాళలేక బాలిక బలవన్మరణం!