ఏపీ సీఎం జగన్ రెడ్డి (AP CM Jagan Reddy) ఢిల్లీ పర్యటన ముగిసింది. ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), హోంమంత్రి అమిత్‌షా (Amit Shah), ఆర్థిక శాఖామంత్రి నిర్మలాసీతారామన్‌లతో (Nirmala Seetharaman) వరుసగా భేటీ అయ్యారు.
ప్రధాని నివాసంలో నరేంద్ర మోదీతో సాయంత్రం 4:30 గంటలకు సీఎం జగన్ సమావేశం అయ్యారు. ముఖ్యమంత్రి దాదాపు 1 గంట సేపు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించారు.
దీనికి ముందు కేంద్రం హోంమంత్రి అమిత్‌షాతో మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో జగన్ రెడ్డి సమావేశం అయ్యారు. దాదాపు 45 నిమిషాలసేపు హోంమంత్రితో సీఎం జగన్ రెడ్డి సమావేశం అయ్యారు.
ప్రధాని మోడీతో సమావేశం తర్వాత సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
సీఎం జగన్ రెడ్డి న్యూఢిల్లీ పర్యటనను ముగించుకున్న తర్వాత తిరిగి రాష్ట్రానికి పయనమయ్యారు.
ప్రధానితో సమావేశం సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను సీఎం ప్రస్తావించినట్లు ప్రకటన జరీ చేసారు.
రాష్ట్ర విభజన సహా అపరిష్కృత అంశాలపై సత్వరమే దృష్టిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం విజ్ఞప్తి చేశారు.
పోలవరం ప్రాజెక్టు, జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో హేతుబద్ధత, విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలు, కొత్త మెడికల్ కాలేజీలకు ఆర్థిక సహాయం తదితర అంశాలను ప్రధాని దృష్టికి ముఖ్యమంత్రి తీసికెళ్ళినట్లు తెలుస్తున్నది.