Nadendla at KakinadaNadendla at Kakinada

స్కామ్’లో జిల్లాకు చెందిన పెద్దల ప్రమేయం
పూర్తి ఆధారాలతో త్వరలో మీడియా ముందుకు

రెండున్నరేళ్లుగా రోడ్లకు మరమ్మతులు లేవు
ప్రజలు కష్టాల్లో ఉంటే వన్ టైమ్ సెటిల్మెంట్లంటూ?

మండపేటలో శ్రమదానం సందర్భంగా శ్రీ నాదెండ్ల

రైతాంగాం ప్రయోజనాలకు వ్యతిరేకంగా, వారిని నష్టపరచేలా తూర్పుగోదావరి (East Godavari) జిల్లాలోని పెద్ద పెద్ద వ్యక్తులు భారీ కుట్రకు పూనుకొన్నారు. వారి అధినేత కనుసనల్లో ఓ భారీ స్కామ్’కు శ్రీకారం చుట్టారు. దాన్ని త్వరలో మీడియా (Media) ముఖంగా బహిర్గతం చేస్తామని జనసేన పార్టీ (Janasena Party) పీఏసీ చైర్మన్ (PAC Chairmen) స్పష్టం చేశారు. ఆ కుంభకోణానికి సంబంధించి పూర్తి సమాచారం జనసేన పార్టీ వద్ద ఉందని నాదెండ్ల (Nadendla) అన్నారు. పూర్తి ఆధారాలను రాష్ట్ర ప్రజలకు చూపిస్తామని తెలిపారు. రైతులను ఇంత మోసం చేస్తారా అని రాష్ట్ర ప్రజానీకం మొత్తం ఆశ్చర్యపోతారని అయన చెప్పారు.

వైసీపీ (YCP) ప్రభుత్వ వ్యతిరేక విధానాల మూలంగా రైతాంగం (Farmers), కౌలు రైతులు (Kaulu Rythulu) నష్టపోతున్నారు అన్నారు. అమలాపురం (Amalapuram) నియోజకవర్గంలో  మధుర సాయిబాబు అనే కౌలు రైతు నష్టపోయిన పంట చూసి గుండె పోటుతో (Heart attack) చనిపోయారు. మండపేట (Mandapeta) నియోజకవర్గం వల్లూరులో  సురేశ్ అనే కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. రహదారుల కోసం బడ్జెట్లో (Budget) నిధులు కేటాయించారు. రోడ్ల పేరు చెప్పి ఇతర సంస్థల నుంచి రుణాలు తీసుకువచ్చారు. కానీ రెండున్నరేళ్లుగా కనీసం ఒక్క రోడ్డు కూడా మరమ్మతు చేయలేదని నాదెండ్ల అన్నారు.

మండపేట నియోజకవర్గంలో శ్రమదానం

బుధవారం తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం పరిధిలోని మండపేట – ద్వారపూడి (Mandapeta-Dwarapudi Road) రహదారిపై శ్రమదానం అయన చేశారు. నియోజకవర్గం జనసేన (Janasena) ఇంఛార్జ్ వేగుల్ల లీలాకృష్ణ (Vegulla Leela Krishna) ఆధ్వర్యంలో శ్రమదానం (Sramadanam) కార్యక్రమం జరిగింది. గోతుల మయంగా మారిన దాదాపు రెండు కిలోమీటర్ల రహదారికి మరమ్మతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా  నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) మీడియా (Media) తో మాట్లాడుతూ “నాలుగు రోజుల పాటు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించి ప్రజా సమస్యలను క్షేత్రస్థాయి నుంచి తెలుసుకున్నాం.

వాటి పరిష్కారం కోసం మా పార్టీ నాయకులంతా కలసికట్టుగా ముందుకు రావడం ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ రోజు పార్టీ జిల్లా నాయకులంతా కలసి శ్రీ లీలాకృష్ణ ఆధ్వర్యంలో రెండు కిలోమీటర్లు రహదారికి మరమ్మతు చేపట్టే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని కోసం నిలబడదామని నిర్ణయించారు. సెప్టెంబర్ 2, 3, 4 తేదీల్లో శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల దుస్థితి మీద డిజిటల్ క్యాంపైన్ నిర్వహించారు. అప్పుడు వేల సంఖ్యలో ఫోటోలు, లక్షల సంఖ్యలో వీడియోలు సోషల్ మీడియాలో పెట్టారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితి చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోయింది.

బడ్జెట్ నిధులు… రుణాలు ఏమైపోయాయి?

రెండున్నరేళ్లుగా రహదారులకు కనీసం మరమ్మతులు చేపట్టడం లేదు. అందుకు నిధులు ఇవ్వలేదు. ఈ రెండేళ్లలో రోడ్ల కోసం రూ. 13,708 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇతర సంస్థల నుంచి రుణాలు తెచ్చారు. అవన్నీ ఏమైపోయాయి? ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అక్టోబర్ 2వ తేదీన స్వయంగా శ్రమదానం చేయడానికి శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చి  స్వయంగా ప్రారంభించేందుకు ముందుకు వచ్చారు.

రాజమండ్రి (Rajahmundry) శ్రమదాన కార్యక్రమాన్ని ఆపేందుకు అన్ని వ్యవస్థలను వాడారు. ముఖ్యమంత్రి, ఆయన సలహాదారు స్వయంగా డీఎస్పీ స్థాయి అధికారులతో మాట్లాడి సభకు వచ్చే జనసైనికులను ఆపే ప్రయత్నం చేశారు. కొత్త చెరువులో అయితే నాలుగు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న రోడ్డును శ్రీ పవన్ వస్తున్నారని తెలుసుకుని పూడ్చేశారు అని నాదెండ్ల వివరించారు.

మరో ఏడు నెలలు ప్రజలకు గతుకుల రోడ్లే గతి?

ఇప్పుడు మండపేటలో రెండు కిలోమీటర్ల మేర శ్రమదానం కూడా కీలకమైనది. నాలుగు నియోజకవర్గాలను అనుసంధానించే రహదారి. అలాంటి రోడ్డును కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎక్కడ చూసినా ప్రభుత్వం కేవలం మోసపూరిత ప్రకటనలతో సరిపెడుతోంది. ఇప్పుడు ముఖ్యమంత్రి రెండు వేల కోట్లు కేటాయించినట్టు అక్టోబర్ 1వ తేదీన ప్రకటించారు. తర్వాత వర్షాలు తగ్గాక చేస్తామన్నారు. ఇప్పుడు జూన్ అంటున్నారు. మరో ఏడు నెలలు ఈ రహదారుల మీద ప్రజలు ఇబ్బందులు పడాల్సిందేనా అంటూ నాదెండ్ల ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.

ఇప్పటికే ప్రతి జిల్లాలో కాంట్రాక్టర్లు తీర్మానం చేశారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించే వరకు టెండర్ల ప్రక్రియలో పాల్గొనబోమని తేల్చి చెప్పేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదని చిన్నచిన్న కాంట్రాక్టర్లు ఆవేదన చెందుతున్నారు. చిత్తశుద్ధి లేని ప్రభుత్వం.. స్పందించే గుణం లేని ముఖ్యమంత్రి వల్లే ఈ దుస్థితి. కనీసం రహదారులు బాగు చేయలేనప్పుడు రెండు లక్షల కోట్ల బడ్జెట్ ఎందుకు? దీనికి తోడు టాక్సులు వేసి ప్రజలను ఇబ్బందిపెడుతున్నారు అంటూ నాదెండ్ల ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

వ్యవసాయ శాఖ మంత్రి ఉండి ఏం లాభం?

జగన్ రెడ్డిని (Jagan Reddy) నమ్మి ముఖ్యమంత్రిని (Chief Minister) చేశారు.. 151 సీట్లు గెలిపిస్తే ఏ మాత్రం పరిపాలనా దక్షత లేకుండా ముందుకు వెళ్తున్నారు. ప్రజలంటే లెక్కలేదు. జిల్లాలో రైతాంగం భయభ్రాంతులకు గురయ్యారు. ప్రభుత్వంలోని పెద్దలు నిత్యం రైతుల గురించి మాట్లాడుతూ ఉంటారు. రైతుల పక్షాన నిలబడతాం అని పెద్దపెద్ద కబుర్లు చెబుతారు. ధాన్యం కొనుగోలు దగ్గర నుంచి ఏ విషయంలోనూ రైతులకు మద్దతుగా నిలబడడం లేదు.

రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. అసలు ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో. జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి ఉండి ఏం లాభం? క్షేత్ర స్థాయిలో ఎక్కడా అధికారులు కనబడడం లేదు. వ్యవసాయ అధికారులు (Agriculture officers) పొలాల్లో తిరగడం లేదు. క్రాప్ ఇన్సురెన్స్ (Crop Insurance) 30 శాతమే ఇస్తామని ముందుగానే ఫిక్స్ చేసేస్తున్నారు. నష్టం ఎంత జరిగిందో అంచనా వేయకుండా ముందే ఎలా ఫిక్స్ చేస్తారు. పంట నష్టం వివరాలు సర్వే చేయాలి. ముందే ఇంత ఇస్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేస్తోంది. ఇన్ పుట్ సబ్సిడి ఇవ్వడం లేదు. గత ఏడాది ఇవ్వాల్సింది ఇవ్వలేదు. క్షేత్ర స్థాయిలో మాత్రం ప్రభుత్వం నుంచి రైతులకు ఎలాంటి భరోసా లేదు అంటూ నాదెండ్ల తన ఆవేదన వ్యక్తం చేసారు.

పైశాచికానందం పొందుతున్నారు!

రాజకీయ వ్యవస్థ పటిష్టంగా లేకపోతే యంత్రాంగం పని తీరు ఎందుకు బాగుంటుంది. రోడ్లకు మరమ్మతులు చేయరు.. రైతుల్ని ఆదుకునే పరిస్థితులు లేవుగానీ 30 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇళ్లకు వన్ టైమ్ సెటిల్మెంట్ అంటూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ప్రజలు బాధల్లో ఉంటే డబ్బులు కట్టాలంటూ వేధిస్తు సీఎం పైశాచికానందం పొందుతున్నారు. రోడ్ల దుస్థితి, రైతుల కష్టాలు, వన్ టైమ్ సెటిల్మెంట్.. ఈ మూడు అంశాల మీద జనసేన పార్టీ ఉద్యమిస్తుంది. ప్రభుత్వం దిగి వచ్చే వరకు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంది” అని నాదెండ్ల అన్నారు.

జనసేన (Janasena) శ్రేణులు (Cadre) వందలాది బైకులతో ర్యాలీ

మాజీ ఎమ్మెల్యే వల్లూరి నారాయణమూర్తి అకాల మరణం పట్ల విచారం నాదెండ్ల మనోహర్ వ్యక్తం చేశారు. మండపేట నుంచి శ్రమదానం చేపట్టిన రోడ్డు వరకు జనసేన శ్రేణులు వందలాది బైకులతో ర్యాలీ నిర్వహించాయి. జనసేన నినాదాలతో హోరెత్తించాయి. వేగుళ్ల లీలాకృష్ణ అధ్వర్యంలో ఈ కార్యక్రమం చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్, పీఏసీ సభ్యులు  ముత్తా శశిధర్, పంతం నానాజీ … పితాని బాలకృష్ణ, రాష్ట్ర కార్యక్రమాల విభాగం కన్వీనర్ కళ్యాణం శివశ్రీనివాస్… అన్ని నియోజకవర్గాల ఇంఛార్జులు, పార్టీ రాష్ట్ర, జిల్లా కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు.

అస్తమించిన పాటల చంద్రుడు
ఆధిభిక్షువుని నిగ్గతీసి అడగడానికి పయనం!