Nagababu at AnantapurNagababu at Anantapur

జనసేనాని లాంటి గొప్ప నాయకుడు దగ్గర పని చేయడం గర్వంగా ఉంది
అనంతపురం జిల్లా కార్యకర్తల సమావేశంలో కొణిదెల నాగబాబు

వైసీపీ నాయకులు (YCP Leaders) అప్పుడేమో అబద్ధపు హామీలు, అసత్య ప్రచారలతో అధికారం చేజిక్కించుకున్నారు.. ఇప్పుడేమో పరిపాలన చేతకాక ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనని భయపడి చేస్తున్నారు. అందుకే ప్రజల దృష్టి మరల్చడానికి పనికిమాలిన మాటలతో వైసీపీ నాయకులూ  ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజలను మోసం చేయడంలో వైసీపీ నాయకులు నిజంగా ఘనత సాధించారని జనసేన పార్టీ (Janasena Party) రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబు (Konidela Nagababu) స్పష్టం చేశారు. అనంతపురంలో (Anantapur) ఆదివారం జరిగిన జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో నాగబాబు మాట్లాడారు.

జగన్ రెడ్డి గారి నటనకు ఆకర్షితులైన ప్రజలు ఆయనను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోటెడితే అదే నటనతో ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారని అన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం పని చేయాల్సిన ప్రభుత్వం, మంత్రులు వ్యక్తిగత స్వలాభాల కోసం పని చేస్తున్నారని పేర్కొన్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప నాయకుడు దగ్గర కార్యకర్తగా పని చేయడం గర్వంగా ఉంది. ప్రజలంతా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని కొణెదల నాగబాబు వెల్లడించారు.

అనంతపురం జిల్లాలోని వీర మహిళలు, జన సైనికుల మీద వైసీపీ నాయకులు దాడులకు తెగబడుతున్న విషయం తమ దృష్టికి వచ్చింది. అకారణంగా బెదిరింపులకు, దాడులకు తెగ బడే వారిని ప్రతిఘటించాలని అన్నారు. అనంతపురం జిల్లా అధ్యక్షులు టీ.సీ. వరుణ్ జిల్లా సమగ్ర నివేదిక వివరించిన అనంతరం అనంతపురంలో జనసేన పార్టీ బలోపేతం కోసం అన్ని స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.

స్థానిక ప్రజలు, ప్రజా సంఘాల నుండి నాగబాబు వినతులు స్వీకరించారు. అనంతపురం పర్యటనలో భాగంగా జరిగిన సమావేశాల్లో పాల్గొన్న నాగబాబు స్థానిక ప్రజలు, ప్రజా సంఘాల ప్రతినిధులు వివిధ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలు అందజేశారు. నాగబాబు గారు స్వయంగా వినతులు స్వీకరించి వాటిని పరిశీలించిన అనంతరం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తామని బాధితులకు వెల్లడించారు.

అనంతపురంలో నాగబాబు గారికి అశేష జన స్వాగతం…

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబుకి అనంతపురంలో అశేష జన స్వాగతం లభించింది. కర్నూలు జిల్లా పర్యటన ముగించుకొని శనివారం సాయంత్రం అనంతపురం జిల్లాలోకి ప్రవేశించిన నాగబాబుకి జిల్లా సరిహద్దు నుంచే జన సైనికులు, వీర మహిళలు ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా బాణసంచా, హారతులు, గజమాలలతో అనంతపురం కార్యకర్తలు ఆహ్వానం పలికారు.

జనసేన వీర మహిళా కార్యాలయం సందర్శించిన నాగబాబు..

అనంతపురం పర్యటనలో భాగంగా నాగబాబు గారు ఆదివారం అనంతపురంలోని జనసేన పార్టీ వీర మహిళా కార్యాలయం సందర్శించారు. కార్యాలయంలో మహిళా సాధికారత కోసం చేపడుతున్న శిక్షణ కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

పీఏసీ సభ్యులు కందుల దుర్గేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూధన్ రెడ్డి, అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్, రాయపాటి అరుణ, కీర్తన , మర్రెడ్డి శ్రీనివాస్, బాబురావు, జయ రామిరెడ్డి, ఈశ్వరయ్య, మంజునాథ్ గౌడ్, పవన్, శ్రీకాంత్ రెడ్డి, ఉమేష్, బైరవ ప్రసాద్, చంద్ర శేఖర్, నాగేంద్ర, అబ్దుల్లా, బెస్త సీనా, శ్రీదేవి, రాధిక తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పాలకుల కుట్రలకు బలవుతున్న కాపు యువతకి శాంతి సందేశం

Spread the love